వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాబడులు, అప్పులు, కరోనా ఉపశమన నిధులు .. లెక్క చెప్పండన్న టీడీపీ నేత యనమల

|
Google Oneindia TeluguNews

ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీరు కరోనా కష్టకాలంలోనూ మారటం లేదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు . ఇక కరోనా నియంత్రణా నిధులు విడుదల చేయవద్దని ట్రెజరీలకు ఆంక్షలు జారీ చేయడం అమానుషమని యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు . కేంద్రం ఇచ్చిన కరోనా ఉపశమన నిధులను తొక్కిపెట్టడం దారుణమైన చర్యగా ఆయన అభివర్ణించారు . ప్రజల ప్రాణాపాయ స్థితిగతుల్లో కూడా నిధులు విడుదల చేయవద్దని చెప్పిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. ఇక అన్నిటికీ పేర్లు పెట్టుకుంటున్న సీఎం జగన్ కరోనా వైరస్ కు కూడా తన పేరు పెట్టుకోవాలని చెప్పారు .

కరోనా బాధితులకు 2 వేలు ఆర్ధిక సాయం .. సీఎం జగన్ నిర్ణయంకరోనా బాధితులకు 2 వేలు ఆర్ధిక సాయం .. సీఎం జగన్ నిర్ణయం

వైఎస్సార్ కరోనా, జగన్ కరోనా అని పేర్లు పెట్టుకోవాలని యనమల ఎద్దేవా చేశారు . ఉద్యోగుల జీతాలకు, కరోనా ఉపశమన సహాయ చర్యలకు నిధులు విడుదల చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీకి ఆదేశాలు ఇచ్చారని ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులు, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ , కరోనా ఉపశమన నిధులు,డివల్యూషన్ కింద రావాల్సిన సొమ్ము, 14 వ ఆర్ధిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది పుష్కలంగా వచ్చాయని యనమల తెలిపారు. ఇన్ని నిధులు వచ్చినా వాటిని ట్రెజరీ స్థాయిలోనే నిలిపేయడం దారుణమైన చర్య అని పేర్కొన్నారు యనమల రామకృష్ణుడు .

 Yanamala demands to show accounts of Revenue, liabilities and corona relief funds

రాబడులు, అప్పులు, కరోనా ఉపశమన నిధులు ఎంత వచ్చిందీ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. నిధులు లేక డాక్టర్లు, వైద్యసిబ్బంది అనేక ఇబ్బందులు పడుతుంటే వారి అవసరాలు తీర్చటం కోసం కూడా నిధులు కేటాయించకపోవటం దారుణం అని ఆయన మండిపడ్డారు . ప్రస్తుతం కరోనా కిట్లకు, మాస్కులు, పీపీఈలకు, వైద్యం, పారిశుధ్య పనులకు నిధులు అత్యవసరంగా కావాల్సి వున్నప్పటికీ, ఈ నిధులను విడుదల చేయకుండా నిలిపివేయటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. వలస కార్మికుల కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, పెడచెవిన పెట్టిందని యనమల ఏపీ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .

English summary
TDP leader Yanamala Ramakrishnudu said that issuing orders to treasury that not to sanction the amount was inappropriate for the release of corona regulatory funds. He described the stopping of the corona relief funds provided by the Center as a dreadful act. Is there anywhere in the government that says the funds should not be released even in the most life threatening conditions? He asked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X