అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ తన గొయ్యి తానే తీసుకుంటున్నాడు, ఉద్యోగుల తీరు ఇలా దేశ చరిత్రలోనే లేదు : యనమల ఫైర్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మరోమారు రచ్చ కొనసాగడానికి కారణమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికలను ప్రస్తుతం నిర్వహించడాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న జగన్ సర్కార్, పంచాయతీ ఎన్నికల నిర్వహణను జరిపి తీరుతామని పట్టుదలతో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య కొనసాగుతున్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది.

 చంద్రబాబు కారణంగానే నిమ్మగడ్డ భ్రష్టు; బాబు కబంధ హస్తాల నుండి బయటకు రా : లక్ష్మీ పార్వతి సలహా చంద్రబాబు కారణంగానే నిమ్మగడ్డ భ్రష్టు; బాబు కబంధ హస్తాల నుండి బయటకు రా : లక్ష్మీ పార్వతి సలహా

 అధికారుల తీరును ఆక్షేపిస్తున్న టీడీపీ

అధికారుల తీరును ఆక్షేపిస్తున్న టీడీపీ

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి, ఈరోజు నుంచి పంచాయతీ ఎన్నికలకు తొలివిడత నామినేషన్లను స్వీకరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినా ఉద్యోగులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలను బేఖాతరు చేయడంపై ప్రతిపక్ష పార్టీ టిడిపి తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ఇప్పటికే టీడీపీ నేతలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణ నిర్ణయానికి అనుకూలంగా ప్రకటనలు చేస్తూ ఎన్నికల నిర్వహణ సజావుగా సాగటం కోసం కూడా పలు సూచనలు చేస్తున్నారు . ఇక ఎన్నికలు జరగకుండా ఏపీలో సహాయ నిరాకరణ కొనసాగటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు . అధికారుల తీరును ఆక్షేపిస్తున్నారు .

జగన్ రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్నందుకు తగిన మూల్యం తప్పదు : యనమల

జగన్ రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్నందుకు తగిన మూల్యం తప్పదు : యనమల

టిడిపి సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు పంచాయతీ ఎన్నికల్లో అధికార యంత్రాంగం తీరుపై, జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న విధానం పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల విధుల్లో అధికార యంత్రాంగం పాల్గొనకుండా చేసి జగన్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని యనమల రామకృష్ణుడు విమర్శించారు. జగన్ రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్నందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్ కు ఉందన్నారు యనమల .

 గవర్నర్ జోక్యం చేసుకుని ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలి

గవర్నర్ జోక్యం చేసుకుని ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలి

గవర్నర్ తన అధికారాలను వినియోగించాలని, పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేలా గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని యనమల రామకృష్ణుడు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత విధుల్లో పాల్గొనడం లేదని చెప్పడం దేశ చరిత్రలోనే లేదని ఉద్యోగుల తీరుపై ఆక్షేపణ వ్యక్తం చేశారు యనమల రామకృష్ణుడు. రాజ్యాంగానికి లోబడి పని చేస్తామని ప్రమాణం చేసిన ఉద్యోగులు దానిని గుర్తు చేసుకోవాలని సూచించిన యనమల, ప్రభుత్వాలు శాశ్వతం కాదని, అధికార యంత్రాంగం శాశ్వతమని వారు గ్రహించాలని పేర్కొన్నారు.

 ఉద్యోగులు ప్రభుత్వం చెప్పింది చేస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు

ఉద్యోగులు ప్రభుత్వం చెప్పింది చేస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు


ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక విధానాలతో తాను అనుకున్నది చేస్తుందని మండిపడ్డారు. ఉద్యోగులు ప్రభుత్వం చెప్పింది మాత్రమే చేస్తూ రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడటం తప్పని యనమల అభిప్రాయపడ్డారు. స్థానిక పాలన అందించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని యనమల విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా ఉద్యోగులు పునరాలోచించాలని అవసరముందని, తమ వ్యవహారశైలి సమంజసం కాదని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.

English summary
TDP senior leader Yanamala Ramakrishnudu is deeply impatient with the attitude of the ruling party in the panchayat elections and the approach taken by the Jagan government. Yanamala Ramakrishnudu criticized Jagan for digging his own , by not involving the authorities in the panchayat election duties. Jagan warned that adequate value must be paid for creating a constitutional crisis.Yanamala said it was the responsibility of the governor to decide on the current situation in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X