అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

YCPకి నియోజకవర్గాన్ని రాసిస్తున్న TDP సీనియర్ నేత!

తుని అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కోసం యనమల రామకృష్ణుడు కుటుంబంలో పోరు

|
Google Oneindia TeluguNews

వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం వైసీపీ, తెలుగుదేశం పార్టీ.. రెండూ హోరాహోరీగా తలపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన సహజశైలికి భిన్నంగా ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాలను పెండింగ్ లో పెడుతున్నారు. అలా పెండింగ్ లో పెట్టిన నియోజకవర్గాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని కూడా ఒకటి.

టీడీపీకి కంచుకోట లాంటిది

టీడీపీకి కంచుకోట లాంటిది

2009 ఎన్నికలకు ముందు వరకు యనమల రామకృష్ణుడు కుటుంబానికి తుని కంచుకోట లాంటిది. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఆరుసార్లు గెలుపొంది పట్టు సంపాదించారు. కానీ 2009 ఎన్నికల్లో ఓటమిపాలవడంతో చంద్రబాబునాయుడు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. 2014 ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు తమ్ముడు యనమల కృష్ణుడు పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో కూడా మరోసారి పరాజయం పాలయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా రెండుసార్లు దాడిశెట్టి రాజా గెలుపొంది మంత్రి పదవిని చేపట్టారు.

టికెట్ కోసం పోటీపడుతున్న అన్నదమ్ములు

టికెట్ కోసం పోటీపడుతున్న అన్నదమ్ములు


వరుసగా రెండుసార్లు, మూడుసార్లు ఎన్నికల్లో ఓటమిపాలైన అభ్యర్థులకు సీటివ్వకూడదనే నిర్ణయాన్ని టీడీపీ అధిష్టానం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా యనమల కృష్ణుడికి ఎటువంటి హామీ దక్కలేదు. అంతేకాకుండా సీటు కోసం అన్నదమ్ముల మధ్య పోరు నడుస్తోంది. ఈ ప్రభావం నియోజకవర్గంపై పడటంతో గెలుపు అవకాశాల కోసం తెలుగుదేశం పార్టీ చెమటోడ్చాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే యనమల వచ్చే ఎన్నికల్లో తన కుమార్తెను తుని నుంచి పోటీకి దింపాలని ప్రయత్నాలు ప్రారంభించారు. తనకే కేటాయించాలని కృష్ణుడు పట్టుబడుతున్నారు.

 సర్వేలన్నీ దాడిశెట్టి రాజాకే అనుకూలం

సర్వేలన్నీ దాడిశెట్టి రాజాకే అనుకూలం


ప్రస్తుతం వస్తున్న సర్వేలన్నీ దాడిశెట్టి రాజా గెలుపొందడానికే అవకాశం ఉందని తేల్చిచెబుతుండటంతో ఇక్కడ బలమైన అభ్యర్థిని నిలబెట్టడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. కొందరు నేతల పేర్లు అధినేత చంద్రబాబు దృష్టిలో ఉన్నాయి. అంతేకాకుండా స్థానికంగా ఉన్న నేతలంతా యనమల కుటుంబానికి టికెట్ ఇవ్వొద్దని అధిష్టానం వద్ద పట్టుబడుతున్నారు. కాపు సామాజికవర్గానికి చెందినవారికి టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు సైతం ఇటీవలే చంద్రబాబును కలిశారు. దీంతో ఆయనకు సీటివ్వడం ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. అయితే సీనియర్లను కాదని చంద్రబాబు ధైర్యంగా అడుగు ముందుకేస్తారా? లేదా? అనేది తెలియాలంటే సీట్ల కేటాయింపు పూర్తయ్యేవరకు వేచిచూడక తప్పదు.

English summary
Both YCP and Telugu Desam Party are fighting each other to win the next election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X