వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

69 ఏళ్ల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి.. : వైఎస్ జగన్‌ ఘనతంటూ యనమల తీవ్ర విమర్శలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావడం వల్లే రాష్ట్ర ప్రజలకు ఇన్ని కష్టాలు వచ్చాయని అన్నారు.

జగన్‌కు ఢిల్లీలో రెండోసారి పరాభవం: అందుకేనంటూ యనమల రామకృష్ణుడు నిప్పులుజగన్‌కు ఢిల్లీలో రెండోసారి పరాభవం: అందుకేనంటూ యనమల రామకృష్ణుడు నిప్పులు

69ఏళ్ల చరిత్రలో..

69ఏళ్ల చరిత్రలో..


కోర్టు బోనులో నిలబడ్డ తొలి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనత సాధించారని యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. 63ఏళ్ల చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ రాష్ట్రానికి ఇంత చెడ్డ పేరు తీసుకురాలేదని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను, అధికారులను కూడా జగన్ జైలుకు తీసుకెళ్లడం ఖాయమని అన్నారు.

ప్రజలను రోడ్డునపడేశారు..

ప్రజలను రోడ్డునపడేశారు..

ఒక వైపు ఆందోళనలతో రాష్ట్ర మండిపోతుంటే వీడియో గేముల్లో ముఖ్యమంత్రి, కోడి పందేల్లో మంత్రులు మునిగిపోతున్నారని యనమల విమర్శించారు. సీఎం, మంత్రులు నీరో చక్రవర్తిని మించిపోయారని దుయ్యబట్టారు. మూడు రాజధానులంటూ ప్రజలందర్నీ రోడ్డున పడేశారని మండిపడ్డారు.

600 కోట్ల పేదల కానుకలు ఎగ్గొట్టారు..

600 కోట్ల పేదల కానుకలు ఎగ్గొట్టారు..

అన్న క్యాంటీన్లు, సంక్రాంతి కానుకలు, తదితర పథకాలను రద్దు చేసి, పేదల నోటికి కాడి ముద్దను లాగేశారని యనమల ధ్వజమెత్తారు. పండగ కానుకలు ఎగ్గొట్టి పేదలకు రూ. 600 కోట్ల నష్టం చేసిందని జగన్ సర్కారుపై మండిపడ్డారు. అక్కలు, అమ్మలు, చెల్లెమ్మలంటూ వాళ్లపైకి పోలీసులను ఉసిగొల్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళలపైనా దాడులు చేయిస్తూ..

మహిళలపైనా దాడులు చేయిస్తూ..


తెనాలిలో మహిళలపై దాడి చేయడం దారుణమని.. దుర్గ గుడికి వెళ్లే మహిళలను అడ్డుకుని దాడులు చేస్తారా? అంటూ యనమల మండిపడ్డారు. విజయవాడలో మహిళలను పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళా కమిషన్ సుమోటాగా కేసు పెట్టినా వైసీపీకి సిగ్గులేదని విమర్శించారు.

మానవ హక్కుల ఉల్లంఘనలు..

మానవ హక్కుల ఉల్లంఘనలు..

మానవ హక్కులను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. దీనిపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఎస్సీల ఆత్మహత్యలపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని యనమల తెలిపారు. విద్యార్థులను బయటకు పంపొద్దని కళాశాలలకు నోటీసులిచ్చారని దుయ్యబట్టారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నవారిపై లాఠీఛార్జీ చేయడం అమానుషమని అన్నారు. అమరావతిలో రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున రైతులు, ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

English summary
TDP leader Yanamala Ramakrishnudu hits out at ys jagan for amaravathi issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X