వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్ ను కొట్టాలనే వైసీపీ మంత్రుల ప్రయత్నం... అడ్డుకోకుండా ఎలా ఉంటాం : యనమల షాకింగ్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

ఏపీలో శాసనమండలిలో చోటుచేసుకున్న గందరగోళం నేపథ్యంలో అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తప్పు మీది అంటే మీది అంటూ అటు వైసిపి, టిడిపి నేతలు ఒకరిమీద ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. మండలిలో వైసీపీ నేతల తీరును టిడిపి నేతలు తప్పు పడుతున్నారు. వైసిపి మంత్రుల ప్రవర్తన చాలా దారుణంగా ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు.

పెద్దల సభలో మంటలు .. ఎమ్మెల్సీని తన్నిన మంత్రి , ఏరా అన్న మంత్రి : దేవినేని ఉమా ఫైర్పెద్దల సభలో మంటలు .. ఎమ్మెల్సీని తన్నిన మంత్రి , ఏరా అన్న మంత్రి : దేవినేని ఉమా ఫైర్

ప్రతిపక్షం కాదు అధికార పక్షమే గొడవ చేసింది

ప్రతిపక్షం కాదు అధికార పక్షమే గొడవ చేసింది

తాజాగా శాసనమండలిలో జరిగిన రచ్చ నేపథ్యంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ ను కొట్టాలని వైసిపి నేతలు ప్రయత్నం చేసిన క్రమంలోనే గొడవ జరిగిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. సాధారణంగా ప్రతిపక్షం ఎక్కడైనా గొడవ చేస్తుంది కానీ అందుకు భిన్నంగా అధికార పక్షం గొడవ చేసిందని ఆయన పేర్కొన్నారు. మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడారని, గౌరవ ఎమ్మెల్సీని ఏరా అని సంబోధించారని ,ఇక టిడిపి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పై దాడికి పాల్పడ్డారని యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ద్రవ్య వినిమయ బిల్లు పాస్ కాకపోవటానికి ప్రభుత్వమే కారణం

ద్రవ్య వినిమయ బిల్లు పాస్ కాకపోవటానికి ప్రభుత్వమే కారణం

బిల్లులన్నీ సెలక్ట్ కమిటీ ముందు ఉన్నాయని గవర్నర్ తన ప్రసంగంలో చెప్పారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. మూడు నెలలు అయ్యింది కాబట్టి బిల్స్ పాస్ చేసుకుంటామంటే కుదరదన్నారు. అప్రోప్రియషన్ బిల్ పాస్ అవ్వకపోవడానికి ప్రభుత్వానిదే బాధ్యత అని యనమల పేర్కొన్నారు. ద్రవ్య వినిమయ బిల్లు పాస్ కాకపోవడానికి టీడీపీ ఎమ్మెల్సీలు బాధ్యులు కాదని ఆయన అన్నారు. అసలు శాసనమండలికి ఇంత మంది మంత్రులు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు యనమల రామకృష్ణుడు.

మంత్రి వెల్లంపల్లి సభ్యుడే కాదు ...ఆయనకి మండలిలో ఏం పని ?

మంత్రి వెల్లంపల్లి సభ్యుడే కాదు ...ఆయనకి మండలిలో ఏం పని ?

ఇక మంత్రి వెల్లంపల్లి అసలు సభలో సభ్యుడే కాదని, ఆయన ఎందుకు వచ్చి కూర్చున్నారని యనమల ప్రశ్నించారు. శాసనమండలిలో నిన్న జరిగిన ఘటన దారుణమని పేర్కొన్న యనమల, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని పేర్కొన్నారు. ద్రవ్య వినిమయ బిల్లు 14 రోజుల తర్వాత ఆటోమేటిక్ గా పాసవుతుందని పేర్కొన్నారు. లోకేష్ ను కొట్టాలని చూస్తే అడ్డుకోకుండా ఎలా ఉంటామంటూ యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. వైసీపీ మంత్రులు దాడికి యత్నం చేశారని పేర్కొన్నారు.

Recommended Video

TDP Criticizes YSRCP Over Liquor Rates Hike | ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారు..!!
యాక్షన్ కు రియాక్షన్ ఉంటుంది కదా !

యాక్షన్ కు రియాక్షన్ ఉంటుంది కదా !

ఎక్కడైనా యాక్షన్ ఉన్నప్పుడు దానికి రియాక్షన్ కూడా ఉంటుందని యనమల స్పష్టం చేశారు. మొత్తానికి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు వైసీపీ మంత్రులు, టిడిపి ఎమ్మెల్సీలపై సిఆర్డిఏ బిల్లు రద్దు, అలాగే అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులపై చర్చ విషయంలో పట్టు పట్టి అనుచితంగా ప్రవర్తించారని, నిన్న జరిగిన ఘటనకు వైసిపి మంత్రులే బాధ్యులని స్పష్టం చేస్తున్నాయి.

English summary
Former minister Yanamala Ramakrishnudu made interesting comments in the wake of the rally in the legislative council. He said the clashes had taken place as YCP leaders tried to beat TDP MLC Nara Lokesh. Yanamala Ramakrishna was outraged on the ministers Indiscipline behaviour .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X