వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మండలి రద్దు కావాలంటే : ప్రజావేదిక కాదు..రాజ్యంగ వ్యవస్థ: యమనల ఫైర్..!

|
Google Oneindia TeluguNews

ఏపీ మంత్రివర్గం సమావేశం ప్రారంభమైంది. మండలి రద్దు దిశగా నిర్ణయం ఖాయమని తెలుస్తోంది. మండలిలో ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులు..సీఆర్డీఏ రద్దు బిల్లులను తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా సెలెక్ట్ కమిటీకి పంపటం పైన ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. దీంతో..మండలి రద్దు దిశగా చర్చకు అధికార పార్టీ తెర లేపింది. ప్రస్తుతం సమావేశమైన మంత్రివర్గం మండలి రద్దుకు నిర్ణయం తీసుకోవటం ఖాయమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో టీడీపీ భిన్నంగా స్పందిస్తోంది. ఏడాది కాలంలో మండలిలో అధికారం పార్టీకి పూర్తి మెజార్టీ వస్తుందని పరోక్షం గా రద్దు వద్దని సూచిస్తోంది. దీంతో పాటుగా మండలి రద్దు తీర్మానం మాత్రమే ప్రభుత్వం చేయగలదని..కేంద్రం నిర్ణయం తీసుకొని రాష్ట్రపతి ఆమోదం పొందాలంలే రెండేళ్ల వరకు పడుతుందని అంచనా వేస్తోంది. మండలిలో ప్రతిపక్ష నేత యనమల ప్రభుత్వ నిర్ణయం మీద మండిపడుతున్నారు.

టీడీపీ ఎమ్మెల్సీలు లొంగలేదు..
శాసనమండలి రద్దు యోచనపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్సీలపై సీఎం జగన్ ప్రలోభాలు పనిచేయలేదన్నారు. గడిచిన 3 రోజుల్లో ప్రలోభాలు పనిచేయకే వైసీపీ అక్కసు రెట్టింపు అయిందని విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థల ప్రభుత్వం అనుకున్నంత సులభం కాదని హితవు పలికారు. మండలి రద్దు అంటే.. ప్రజావేదిక కూల్చినంత ఈజీ కాదన్నారు. శాసనమండలి రద్దు అమల్లోకి రావాలంటే రెండు, మూడేళ్లు పడుతుందని వివరించారు. ఏడాదిలో వైసీపీకి మెజార్టీ వస్తుంది.. ఎందుకు రద్దు చేస్తున్నారో అర్థం కావడంలేదని యనమల ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఇదే సమయంలో మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లులు మూడు నెలల్లోగా తిరిగి వస్తాయని..ఈ లోగా ఎందుకింత ఉక్రోశమని వ్యాఖ్యానించారు. మండలి రద్దు చేస్తే టీడీపీ కంటే..అధికార వైసీపీకే ఎక్కువ నష్టం అని యనమల చెప్పుకొచ్చారు.

Yanamala slams govt on abolish of council..He says it may take two years time for final approval

Recommended Video

Abolish Of AP Legislative Council Resolution In Assembly After AP Cabinet Passes || Oneindia Telugu

కేబినెట్ లో ఇదే ప్రధానాశంగా..
ప్రస్తుతం సాగుతున్న కేబినెట్ సమావేశంలో ఇదే ప్రధాన అంశంగా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు కేబినెట్ లో మంత్రుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవటంతో పాటుగా ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని స్పష్టం చేయనున్నారు. అదే సమయంలో మండలిలో గతంలో ఇంగ్లీషు మీడియం బిల్లు..ఎస్సీ కమిషన్ బిల్లు తో పాటుగా తాజాగా మూడు రాజధానుల బిల్లు..సీఆర్డీఏ బిల్లు పైన వ్యవహరించిన తీరు భవిష్యత్ లోనూ కొనసాగే అవకాశం ఉందనేది వైసీపీ ప్రభుత్వ అభిప్రాయం. దీంతో..మండలి రద్దు తప్పదనే వాదన వినిపిస్తోంది. అయితే, ఇప్పుడు ప్రభుత్వం ఈ మేరకు కేబినెట్ లో ఆమోదించినా..శాసనసభలో తీర్మానం కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. అయితే..ప్రభుత్వం మండలి రద్దు దిశగా తీసుకొనే చర్చల్లో పాల్గొనకూడదని టీడీపీ నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశం సమయంలోనే అటు టీడీపీ శాసనభా పక్షం సైతం సమావేశం అవుతుంది.

English summary
Council LOP Yanamala objected Govt decision on abolish of council. He syas state govt have only the right to pass reolution in favour of council abolilsh. But, central govt to take final decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X