వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజ్ఞాతంలో యరపతినేని.. అక్రమ మైనింగ్ కేసులో బిగుస్తున్న ఉచ్చు

|
Google Oneindia TeluguNews

ఏపీలో టీడీపీ నేతల మెడకు ఉచ్చు బిగుస్తోంది . గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ పై అక్రమ మైనింగ్ కేసులో యరపతినేనిపై సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతించింది. దీంతో యరపతినేనికి ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తుంది. ఒకపక్క కోడెల ఇప్పటికే పీకల్లోతు కేసుల్లో కూరుకుపోయి ఉంటే ఇప్పుడు యరపతినేనికి ఎక్కడలేని కష్టాలు వచ్చి పడ్డాయి.

ఇసుక కోసం చంద్రబాబు పోరాటం వెనుక మాస్టర్ ప్లాన్ .. ఇప్పుడే ఎందుకు అంటే ?ఇసుక కోసం చంద్రబాబు పోరాటం వెనుక మాస్టర్ ప్లాన్ .. ఇప్పుడే ఎందుకు అంటే ?

 ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ.. టెన్షన్లో యరపతినేని

ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ.. టెన్షన్లో యరపతినేని

యరపతినేని అక్రమ మైనింగ్ కేసులో అక్రమ మైనింగ్ జరిగిందని సీఐడీ ఇచ్చిన నివేదిక ద్వారా అర్థమవుతుందని కోర్టు తెలిపింది. అయితే దీనిపై సీబీఐ విచారణకు వెళ్లే నిర్ణయాన్ని రాష్ట్రప్రభుత్వానికి వదిలేసింది. దీనిపై జగన్ సర్కార్ కు నేడు , బుధవారం ఉత్తర్వులను ఇవ్వనుంది. ఇప్పుడు దీనిపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక తాజా పరిణామాల నేపధ్యంలో యరపతినేని అజ్ఞాతంలోకి వెళ్లాడు. యరపతినేని విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయం , అలాగే యరపతినేని దీనిపై ఎలాంటి స్టెప్ వెయ్యబోతున్నారు అన్న అంశం ఆసక్తికరంగా మారింది.

అజ్ఞాతంలో యరపతినేని శ్రీనివాస్.. న్యాయ నిపుణులతో సంప్రదింపులు

అజ్ఞాతంలో యరపతినేని శ్రీనివాస్.. న్యాయ నిపుణులతో సంప్రదింపులు


గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే , టీడీపీలో కీలక నేత యరపతినేని అక్రమంగా మైనింగ్ నిర్వహించాడని మాజీ ఎమ్మెల్యే యరపతినేనిపై కేసు నమోదైంది. అక్రమంగా మైనింగ్ చేశాడని సీఐడీ నివేదిక ఆధారంగా తేలిందని హై కోర్టు వ్యాఖ్యానించింది. ఇక ఈ అక్రమ మైనింగ్ లో వెనకున్న సూత్రధారుల కోసం కూడా విచారణ చేపట్టింది. యరపతినేనిపై అక్రమ మైనింగ్ వ్యవహరంలో సీబీఐ విచారణకు ఈ నెల 26 వతేదీన హైకోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని హైకోర్టు స్పష్టం చేయటంతో యరపతినేని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టాల్సిన అంశాలపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టుగా, తర్వాత ఏం చెయ్యాలి అన్న దానిపై చర్చిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

టీడీపీ నేతల అవినీతిపై జగన్ సర్కార్ ఉక్కుపాదం .. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఆసక్తి

టీడీపీ నేతల అవినీతిపై జగన్ సర్కార్ ఉక్కుపాదం .. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఆసక్తి


రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ సీబీఐ విచారణకు అనుమతిస్తే ఏం చేయాలనే దానిపై ఆయన చర్చిస్తున్నట్టుగా చెబుతున్నారు.హైకోర్టు తీర్పు పూర్తి సారాంశం వచ్చిన తర్వాత ఈ విషయమై ఏం చేయాలనే దానిపై సీఎం జగన్ నిర్ణయం తీసుకొంటారని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలై , అధికారం పోగొట్టుకున్నప్పటి నుండి యరపతినేని శ్రీనివాస రావు నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఇక తాజా హై కోర్టు ఆదేశాలతో ఇరకాటంలో పడ్డారు. అటు టీడీపీ నుండి కూడా ఈ వ్యవహారంలో ఎలాంటి సహకారం అందేలా కనిపించకపోవటంతో ఇబ్బంది పడుతున్నారు యరపతినేని . ఏది ఏమైనా గత ప్రభుత్వ హయాంలో అవినీతి పాల్పడిన వారి మెడకు ఉచ్చు బిగించే పనిలో బిజీగా ఉన్న వైసీపీ ప్రభుత్వం యరపతినేని విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

English summary
The Andhra Pradesh High Court on Monday sought to know if the State government wants to hand over the investigation into the illegal limestone mining case involving former Gurajala TDP MLA Yarapathineni Srinivasa Rao to the CBI. Reserving the power of handing over the case to the CBI to the State government, the High Court said that it would pass the order on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X