• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైసిపి, బీజేపి చర్యల వల్ల లాభం ఎవరికి.. నష్టం ఎవరికి..? ఏపిలో టీడిపి పరిస్థితి మారనుందా..?

|

అమరావతి/హైదరాబాద్ : ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా మరే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. పోలవరం టెండర్లను నిలిపివేయడం, అదే సమయంలో కాలేశ్వరం ప్రాజెక్టు శంఖుస్తాపనకు హాజరవ్వడం, ఏపి ప్రత్యేక హోదా సాద్యం కాదన్న బీజేపితో స్నేహ పూర్వకంగా మసులుకోవడం, నిన్నటికి నిన్న పార్టీ ఫిరాయించిన రాజ్యసభ సభ్యులతో వైసీపి ఎంపి విజయసాయి రెడ్డి కలిసి భోజనం చేయడం, ప్రజా వేదిక విషయంలో ఏపి ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయం తీసుకోవడం వంటి అంశాలు దీర్ఘకాలిక రాజకీయాలల్లో టీడిపి కి అనుకూలించే పరిణామాలని చర్చ జరుగుతోంది.

కక్ష్య సాధింపు రాజకీయాలు..! కనుమరుగయ్యేది ఎవరు..!!

కక్ష్య సాధింపు రాజకీయాలు..! కనుమరుగయ్యేది ఎవరు..!!

ఓవైపు తెలుగుదేశం పార్టీలో కుదుపులు, షాకింగ్ ప‌రిణామాలు చోటుచేసుకుంటుంటే, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పరిస్థితులు మారుతున్నయానే ప్రచారం అమరావితిలో జోరుగా సాగుతోంది. టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు కు ఏపి ప్రజలనుండి సానుభూతి పెరుగుతుందనే కోణంలో కూడా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, బీజేపీతో వేస్తున్న అడుగులు ఆ పార్టీకి ఎప్పటికైనా ప్రమాదకరమేననే చర్చ కూడా జరుగుతోంది. అంత స్నేహపూర్వకంగా మెదులుతున్నప్పుడు ప్రత్యేక హోదా సాధిస్తే పరవాలేదు గాని సాధించకపోతే ఇబ్బందులు తప్పపనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఏపీలో ఇటీవ‌లే ముగిసిన ఎన్నిక‌ల త‌ర్వాత ప‌రిణామాలు...రాబోయే ఎన్నిక‌ల నాటికి చోటుచేసుకోబోయే ఘ‌ట‌న‌ల‌ను చూస్తుంటే రాజకీయంగా పెను మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

 పార్టీ ఫారాయించిన నలుగురి వల్ల బీజేపికీ లాభమా..? టీడిపికి సానుభూతి రాదా..?

పార్టీ ఫారాయించిన నలుగురి వల్ల బీజేపికీ లాభమా..? టీడిపికి సానుభూతి రాదా..?

తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, టీజీ వెంకటేష్‌, సీఎం రమేష్ బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. పార్టీ మారిన సుజనా చౌదరి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌, గరికపాటి మోహనరావులు లేఖ రాయడంతో.. రాజ్యసభలోని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోద ముద్ర వేశారు. ఇవాళ ఈ న‌లుగురు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. కాగా, ఎంపీలను పార్టీ మారిపించిన తీరు, వారిలో ఏకంగా రాజ్య‌స‌భ ప‌క్షం విలీనం చేపించిన విధానం ఆంధ్రుల‌ను ర‌గిలిపోయేలా చేస్తోంది.

ప్రజావేదిక విష‌యంలో వైసీపి తొందరపాటు..! ససేమిరా అంటున్న ఏపి సీఎం..!!

ప్రజావేదిక విష‌యంలో వైసీపి తొందరపాటు..! ససేమిరా అంటున్న ఏపి సీఎం..!!

ఇక తాజాగా ఏపీ ప్ర‌భుత్వం మాజీ సీఎం చంద్ర‌బాబు విష‌యంలో మ‌రో అవ‌మాన‌క‌ర‌మైన చ‌ర్య‌కు పాల్ప‌డింది. ఉండవల్లిలోని ప్రజావేదికను ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రజావేదికలో ప్రస్తుతం ఉన్న టీడీపీకి సంబంధించిన సామగ్రిని తీసుకెళ్లాలని ఆ పార్టీ నేతలకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. కాగా, ప్రజా వేదికను తమకు కేటాయించాలని వారం రోజుల క్రితం ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాశారు. కార్యకర్తలు, ప్రజలతో అందుబాటులో ఉండేందుకు వీలుగా ప్రజావేదికను కేటాయించాలని ఆ లేఖలో కోరారు. వాస్తవానికి ముందుగా నిర్ణయించిన ప్రకారం సచివాలయం ఐదో బ్లాక్‌లో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ జరగాల్సి ఉంది. కానీ సదస్సును ప్రజావేదికకు మారుస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. తొలిసారిగా ఈ నెల 24న ప్రజావేదికలోనే కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించి తిరిగి వేదిక‌ను మార్చి ఇలాంటి క‌క్ష‌పూరిత చ‌ర్య‌ల‌కు ప్ర‌భుత్వం పాల్ప‌డింది.

ప్రత్యేక హోదా పైనే తెలుగుప్రజల ఆశలు..! వైసీపి బీజేపి స్నేహం ఫలితం ఇస్తుందా..?

ప్రత్యేక హోదా పైనే తెలుగుప్రజల ఆశలు..! వైసీపి బీజేపి స్నేహం ఫలితం ఇస్తుందా..?

ఇటు రాష్ట్రప్ర‌భుత్వం అటు కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌ను ప్ర‌తి ఒక్క ఆంధ్రుడు గుర్తిస్తున్నార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. అధికారం చేప‌ట్టి నెల కూడా గ‌డ‌వ‌ని ఏపీ స‌ర్కారు, ఐదేళ్లుగా ప‌గ‌బ‌ట్టిన ఢిల్లీ స‌ర్కారు చేస్తున్న చ‌ర్య‌ల‌కు 2024లో ఓటు రూపంలో ప్ర‌జ‌లు బుద్ధిచెప్ప‌డం ఖాయ‌మ‌ని, తిరిగి చంద్ర‌బాబు కు మంచిరోజులు రాబోతున్నయని విశ్లేషిస్తున్నారు. పైగా ఏపీ ప్రాణాధార ప్రాజెక్టును ఆపేయమని ఆదేశాలు ఇచ్చి కాళేశ్వరం దగ్గరుండి ప్రారంభించడం, ఏపీని మోసం చేసిన బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టడం, బీజేపీ ఎప్పటికీ ఇవ్వని ప్రత్యేక హోదా విషయం తప్ప మిగతావి మాట్లాడక పోవడం వంటివన్నీ చూస్తుంటే... కచ్చితంగా మళ్లీ టీడీపీ వైపు జనం మళ్లే అవకాశం కనిపిస్తోంది. జనం కక్షసాధింపులను భరించని. ఇది తెలుగుదేశానికి కచ్చితంగా దీర్ఘకాలంలో సానుకూల అంశమనే చర్చ అమరావితి వేదికగా జరుగుతోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The decisions being taken by AP CM Jaganmohan Reddy are in the process of being favored by the opposition. Polavaram tenders, attending the Kaleshwaram project conclave,friendly nature with the BJP, which is not given special status of the AP, Rajya Sabha members yesterday allow The favourable consequences to tdp in ap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more