వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ వర్సెస్ చంద్రబాబు: మండలి రద్దుపై: ఒకరిని ఇరికించేలా మరొకరు..ఏం జరగబోతోంది..!

|
Google Oneindia TeluguNews

ఏపీ శాసన మండలి కొనసాగుతుందా..రద్దు చేస్తారా. శాసనసభ లో ముఖ్యమంత్రి ప్రతిపాదన పైనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది. దీని పైన 27న చర్చించి నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి సభలో ప్రతిపాదించారు. అయితే, ఈ మూడు రోజుల సమయం ఇవ్వటం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. అయితే, మండలి రద్దు ఇప్పుటికిప్పుడు టీడీపీకి నష్టం చేసినా..రానున్న కాలంలో వైసీపీ నేతలు అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. దీంతో.ముఖ్యమంత్రి జగన్ తన ప్రతిపాదనల పైన పూర్తి స్థాయిలో చర్చ కోసమే వేచి చూస్తున్నారు.

దెబ్బకు దెబ్బ తీయాల్సిందే: సెలెక్ట్ కమిటీ బిల్లుల భవిష్యతేంటి: మండలి రద్దు...టీడీపీలో కొత్త టెన్షన్.దెబ్బకు దెబ్బ తీయాల్సిందే: సెలెక్ట్ కమిటీ బిల్లుల భవిష్యతేంటి: మండలి రద్దు...టీడీపీలో కొత్త టెన్షన్.

తుది నిర్ణయం తీసుకొనే ముందు అది పొరపాటు నిర్ణయం కాదని చెప్పటానికి..ఇప్పటికే అస్త్ర శస్త్రాలు సిద్దం చేసుకున్నారు. తన తండ్రి పునరుద్దరించిన మండలిని..తాను రద్దు చేయటం వెనుక కారణాలను జగన్ వివరించాలని భావిస్తున్నారు. అయితే, సభలో ప్రతిపక్ష టీడీపీ ఈ ప్రతిపాదన పైన విభేదించే అవకాశం ఉంది. దీంతో..జగన్..చంద్రబాబు తమ వ్యూహాలకు కు పదును పెడుతున్నారు. దీంతో..ఆసక్తి కర చర్చకు ఆస్కారం కనిపిస్తోంది.

మండలిపై నాడు ఎన్టీఆర్ ఏమన్నారు...

మండలిపై నాడు ఎన్టీఆర్ ఏమన్నారు...

శాసనమండలి ఏపీలో రద్దు ప్రతిపాదన హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఏపీలో ఇది రద్దవ్వటం ఇది తొలిసారి కాదు. 1983 మార్చి 24న అసెంబ్లీలో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మండలి రద్దు చేయాలనే తీర్మానం ప్రతిపాదించారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యల రికార్డులను ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం బయటకు తీసింది. అ సందర్బంలో సీఎంగా ఉన్న ఎన్టీఆర్ ప్రజల పన్నుల ద్వారా వస్తున్న ఆదాయా న్ని మండలి లాంటి సభల నిర్వహణ కోసం దుర్వినియోగం చేయకూడదని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రతినిధులతో శాసనసభ ఉండగా..దీనికి సమాంతరంగా మరో సభ అవసరం లేదనేది తమ అభిప్రాయమని ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీఆర్ వివరించారు. ఆ వెంటనే కేంద్రానికి తీర్మానం పంపంటం ద్వారా అప్పుడు ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏపీ ప్రతిపాదనకు మద్దతు గా నిర్ణయం తీసుకుంది. దీంతో..ఏపీలో మండలి రద్దు అయింది.

చంద్రబాబుకు ఇరకాటం..

చంద్రబాబుకు ఇరకాటం..

ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ సోమవారం శాసనసభలో మండలి రద్దు తీర్మానం చర్చకు ప్రతిపాదిస్తే..టీడీపీకి ఇరకాటమే. ప్రభుత్వ తీర్మానానికి వ్యతిరేకంగా టీడీపీ మాట్లాడాల్సి ఉంటుంది. కానీ, నాడు 2004లో వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఏపీలో మండలిని పునరుద్దరించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టారు.2004 జూలై 8న ఈ అంశం మీద ఏపీ అసెంబ్లీలో చర్చ సాగింది. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మాట్లాడారు. మండలి నిర్వహణ అవసరం లేదని..పన్నులు ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఇలాంటి వాటికి వెచ్చించకూడదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి భారంగా మారుతుందని వ్యాఖ్యానించినట్లు రికార్డులు చెబుతున్నాయి.మండలి పునరుద్దరణ బిల్లు ఉప సంహరించుకోవాలని..అవసరమైతే దీని పైన రిఫరెండం నిర్వహించాలి చంద్రబాబు సూచించారు.

జగన్ పైనా రివర్స్ అస్త్రాలు..

జగన్ పైనా రివర్స్ అస్త్రాలు..

మండలి రద్దు పైన తుది నిర్ణయం తీసుకుంటే..సోమవారం అసెంబ్లీలో దీని పైన ప్రభుత్వం తీర్మానం చేయనుంది. ఆ సమయంలో ముఖ్యమంత్రి జగన్ నాడు ఎన్టీఆర్ మండలి రద్దు అంశాన్ని..అదే విధంగా 2004లో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అసలు మండలి అవసరం లేదంటూ సభలో చేసిన ప్రసంగాన్ని ఆధారాలతో సభ ముందు ఉంచాలని ప్రభుత్వ భావిస్తోంది. దీని ద్వారా టీడీపీ..చంద్రబాబు నాడు ఒక రకంగా..నేడు మరో రకంగా వ్యవహరిస్తున్నానంటూ సభా వేదికగా ఇరకాటంలో పెట్టాలని భావిస్తోంది. ఇదే సమయంలో నాడు 2004లో వైయస్సార్ మండలి పునరుద్దరణ సమయంలో ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేసిన ప్రసంగాన్ని సభలో ప్రస్తావించి.నేడు ఆయన వారసుడిగా చెప్పుకుంటూ ఎన్టీఆర్..చంద్రబాబు ప్రసంగాలను ప్రస్తావిస్తూ మండలి రద్దు నిర్ణయం దిశగా జగన్ వేస్తున్న అడుగులను సభలోనే తప్పు బట్టాలని టీడీపీ సిద్దం అవుతోంది. దీంతో..మండలి రద్దు తీర్మానం సమయంలో శాసనసభలో జగన్ వర్సెస్ చంద్రబాబు అన్నట్లుగా వాదనలకు అవకాశం కనిపిస్తోంది.

English summary
Govt and oppostion parties prerating their strategies to follow in the assembly at the time of Council abolish resolution. Govt concentrated on NTR and CBN previous speeches in Assembly on this issue. TDP ready to corner CM with mention of YSR decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X