వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీలో మ‌రో టెన్ష‌న్‌: విజ‌య‌సాయిరెడ్డి..సీఎం ర‌మేష్ సుదీర్ఘ మంత‌నాలు: ప‌చ్చ కోట‌కు బీట‌లేనా..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

టీడీపీలో మ‌రో టెన్ష‌న్‌ ప‌చ్చ కోట‌కు బీట‌లేనా..! || Oneindia Telugu

చంద్ర‌బాబు కోట‌రీకీ బీట‌లు వారుతున్నాయా. రెండు రోజుల క్రితం టీడీపీ ముఖ్య‌నేత సుజ‌నా చౌద‌రి పార్టీ వీడే సంకేతాలు ఇచ్చారు. దీని పైనా పార్టీలో చ‌ర్చ సాగుతుండ‌గానే..ఇప్పుడు అదే కోట‌రీలో మరో ముఖ్య నేత సీఎం ర‌మేష్ వైఖ‌రి మీద చ‌ర్చ మొద‌లైంది. వైసీపీ ముఖ్య నేత విజ‌య‌సాయిరెడ్డి తో సీఎం ర‌మేష్ మ‌ధ్య సుదీర్ఘ మంత‌నాలు సాగాయి. ఉప్పు - నిప్పులా ఆ ఇద్ద‌రు నేత‌లూ ఇలా ఇంత‌సేపు ఆప్యాయంగా మాట్లాడుకోవ‌టంతో ఏం జ‌రుగుతుంద‌నే ఉత్సుక‌త మొద‌లైంది. ఇంత‌కీ వీరిద్ద‌రి మ‌ధ్య అంత‌సేపు జ‌రిగిన సంభాష‌ణ ఏంటి..

ఉప్పు..నిప్పులా ఉండే ఆ ఇద్ద‌రూ..

ఉప్పు..నిప్పులా ఉండే ఆ ఇద్ద‌రూ..

ఇద్ద‌రూ రాజ్య‌స‌భ స‌భ్యులే. వైసీపీ లో దాదాపు నెంబ‌ర్ టూ స్థానంలో ఉన్న విజ‌య‌సాయిరెడ్డి..టీడీపీ అధినేత చంద్ర‌బాబు కోట‌రీలో కీల‌క నేత‌గా ఉన్న సీఎం ర‌మేష్ తొలి నుండి ఉప్పూ నిప్పూగా ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఇద్ద‌రూ వ్యక్తిగ‌త ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. సీఎం ర‌మేష్‌ను దొంగ సారాయి వ్యాపారిగా విజ‌య సాయిరెడ్డి ఆరోపించేవారు. సీఎం ర‌మేష్‌కు టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ద‌క్కిన కాంట్రాక్టులు..ఆయన తీరు గురించి అనేక సార్లు సాయిరెడ్డి బ‌హిరంగంగానే ఆరోప‌ణ‌లు చేసారు. రాజ్య‌స‌భ ఫ్లోర్‌లోనూ ఇద్ద‌రి మ‌ధ్యా వాదోప‌వాదాలు చోటు చేసుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. సీఎం ర‌మేష్ త‌మ పార్టీ అధినేత చంద్ర‌బాబు మౌత్ పీస్‌గా ఢిల్లీలో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు..విజ‌య సాయిరెడ్డి త‌మ పార్టీ అధినేత ఆదేశాల‌తో లౌక్యంగా ప‌నుల‌ను పూర్తి చేసుకొని రావ‌టం ప్ర‌త్యేక‌త‌గా మ‌ల‌చుకున్నారు.

ఇద్ద‌రి మ‌ధ్య గంట‌న్నార మంత‌నాలు..

ఇద్ద‌రి మ‌ధ్య గంట‌న్నార మంత‌నాలు..

లోక్‌స‌భ‌లో ఏపీ స‌భ్యులు ప్ర‌మాణ స్వీకారం చేస్తున్నారు. ఆ స‌మ‌యంలో ఆ ఇద్ద‌రూ గ్యాల‌రీలో దాదాపు గంట‌న్నార సేపు మంత‌నాలు చేసారు. విజ‌య సాయిరెడ్డి గ్యాల‌రీకి వ‌చ్చే స‌మ‌యానికి అప్ప‌టికే అక్క‌డ సీఎం ర‌మేష్ ఉన్నారు. ఆయ‌న‌కు క‌ర‌చాల‌నం చేసి సాయిరెడ్డి వెళ్లి వెనుక కూర్చున్నారు. త‌రువాత సాయిరెడ్డి లేచి సీఎం ర‌మేష్ సీటు ప‌క్క‌నే కూర్చుకున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఇద్ద‌రూ చాలా ఆప్యాయంగా దాదాపు గంట‌న్నార సేపు మంత‌నాల్లో మునిగిపోయారు. అక్క‌డ‌కే కాంగ్రెస్ స‌భ్యుడు కెవిపి రామచ‌చంద్ర‌రాకు అక్క‌డికి వ‌చ్చినా..వీరిద్ద‌రూ త‌మ మాటట్లో ముగినిపోయారు. అయితే, ఈ ఇద్ద‌రూ అక్క‌డ అంత‌సేపు మంత‌నాల్లో మునిగిపోవ‌టం పైనే ఇప్పుడు చ‌ర్చ. దీని పైన విజ‌య సాయిరెడ్డిని ప్ర‌శ్నిస్తే ..టీడీపీ హ‌యాంలో ఏం జ‌రిగిందో చెప్ప‌మ‌ని అడిగాన‌ని స‌మాధాన మిచ్చారు. అంటే ఆ ప్ర‌భుత్వంలో చోటు చేసుకున్న అవినీతి గురించి సీఎం ర‌మేష్ గుట్టు విప్పారా అనే అనుమానం మొద‌లైంది.

రాజ‌కీయాలా..పార్టీ ర‌హ‌స్యాలా..

రాజ‌కీయాలా..పార్టీ ర‌హ‌స్యాలా..

సాయిరెడ్డి..సీఎం ర‌మేష్ మ‌ధ్య అంత‌సేపు ఏం చ‌ర్చ జ‌రిగింది. ఇద్ద‌రూ రాజ‌కీయ అంశాలు మాట్లాడారా లేక గ‌త ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవినీతి పైన సీఎం ర‌మేష్ పార్టీలో త‌న‌కు అంత‌ర్గ‌తంగా ఉన్న వ్య‌తిరేకుల‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల‌పైన ఉప్పందించారా అంటూ ఒక ఎంపీ అనుమానం వ్య‌క్తం చేసారు. రెండు రోజుల క్రితం టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నా చౌద‌రి ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోవ‌టానికి కార‌ణాల‌ను కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ఆయ‌న బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ద‌మ‌య్యార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌ల్లో సుజ‌నా అంశం కూడా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే..టీడీపీ అధినేత చంద్రబ‌బు కోట‌రీలో కీల‌కంగా ఉండే నామా నాగేశ్వ‌ర‌రావు టీఆర్‌య‌స్‌లోకి వెళ్లి ఎంపీ అయ్యారు. సుజనా చౌద‌రి పార్టీ వీడుతున్నార‌నే అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఇక‌, ఇప్పుడు సీఎం ర‌మేష్ భ‌విష్య‌త్ నిర్ణ‌యం ఏంట‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.

English summary
YCP and TDP Rajyasbha Members Vijaya Sai Reddy and CM Ramesh one to one discussions more than one hour in Loksabha Gallery. Now this issue became politically hot subject.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X