వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోటాపోటీగా వైసీపీ, టీడీపీ బాధితుల సమావేశాలు.. పల్నాడులో టెన్షన్ .. పోలీసులు అలర్ట్

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచినా కూడా పరిస్థితుల్లో మాత్రం మార్పు రాలేదు. ఎన్నికల సమయంలో ఎలాంటి టెన్షన్ వాతావరణం ఉందో, ఇప్పటికి ఏపీలోని పలు గ్రామాల్లో అలాంటి వాతావరణమే కనిపిస్తుంది. వైసిపి వర్సెస్ టిడిపి అన్నది అటు ప్రధాన నాయకుల దగ్గర నుండి చిన్నపాటి కార్యకర్తల వరకు కనిపిస్తోంది. గ్రామాలలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఒకరిమీద ఒకరు దాడులతో, ప్రతి దాడులతో గ్రామాలు రాజకీయ రణరంగంగా మారుతున్నాయి.

ఒకరిపై ఒకరు పోటాపోటీగా దాడులు .. రాష్ట్ర వ్యాప్తంగా లోపించిన శాంతిభద్రతలు

ఒకరిపై ఒకరు పోటాపోటీగా దాడులు .. రాష్ట్ర వ్యాప్తంగా లోపించిన శాంతిభద్రతలు

టిడిపి కార్యకర్తలపై వైసిపి దాడులు చేస్తున్నారని ఆరోపణలు టిడిపి నేతలు ప్రధానంగా వినిపిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కార్యకర్తలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడం కోసం చంద్రబాబు నాయుడు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. టిడిపి శ్రేణుల్లో ధైర్యం నింపుతూ, తాను అండగా ఉన్నారని చెబుతున్నారు. టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడులను తిప్పికొట్టడం కోసం ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు గుంటూరులో వైసీపీ బాధితుల సమావేశం చేపట్టారు. ఇక ఈ నేపథ్యంలో చంద్రబాబు సమావేశానికి పోటీగా పల్నాడులో టిడిపి బాధితులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు వైసిపి నాయకులు.

ఆన్ లైన్ గేమింగ్ పిచ్చి ..తండ్రికే టోకరా వేసిన తొమ్మిదేళ్ళ బాలుడు .. ఏం చేశాడంటేఆన్ లైన్ గేమింగ్ పిచ్చి ..తండ్రికే టోకరా వేసిన తొమ్మిదేళ్ళ బాలుడు .. ఏం చేశాడంటే

పల్నాడులో టీడీపీ బాధితుల సమావేశం .. హోం మంత్రి సుచరిత హాజరు

పల్నాడులో టీడీపీ బాధితుల సమావేశం .. హోం మంత్రి సుచరిత హాజరు

దీంతో పల్నాడులో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ, వైసీపీ ఆధ్వర్యంలో పోటాపోటీగా శిబిరాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో, ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో పోలీసులు పల్నాడులో భారీగా మోహరించారు.ఇక వైసీపీ నిర్వహిస్తున్న టిడిపి బాధితుల సమావేశ కార్యక్రమానికి హోం మంత్రి సుచరిత హాజరుకానున్నారు.ఎలాంటి ఆందోళనలు చోటుచేసుకోకుండా ముందుగా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. పోలీసులు భారీగా మోహరించి భద్రత కట్టుదిట్టం చేశారు. అధికార పార్టీ రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన అవసరం ఉంది.

గ్రామాల్లో శాంతి నెలకొల్పండి ... శాంతిభద్రతలను పరిరక్షించండి అంటున్న ప్రజలు

గ్రామాల్లో శాంతి నెలకొల్పండి ... శాంతిభద్రతలను పరిరక్షించండి అంటున్న ప్రజలు

వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని అధికార పార్టీ నేతలు ఆందోళన చేయడం, సమావేశాలు నిర్వహించడం శోచనీయం. ఇక ఏకంగా హోంమంత్రి శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన స్థానంలో ఉండి మంత్రి పదవిలో కొనసాగుతూ స్వయంగా టి.డి.పి బాధితుల సమావేశానికి హాజరు కావడం అందరినీ ఆలోచనలో పడేస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు జరిగినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగినా, దాడులకు పాల్పడుతున్నా వాటన్నింటినీ కట్టడి చేయాల్సిన బాధ్యత అధికార పార్టీ పైనే ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఇప్పటికైనా ప్రభుత్వం ఆ పని చెయ్యాలని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు.

English summary
Chandrababu Naidu is holding district-wise meetings to give activists confidence.The TDP lines up the courage and say that he is good. Chandrababu held a meeting of the YCP victims in Guntur, trying to repel the YCP attacks on the TDP series. Against this backdrop, TDP victims convened a meeting in Palnadu to contest the Chandrababu meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X