బాలకృష్ణ పై పోలీసు అధికారి : లోకేష్ పై ఆళ్ల :కృష్ణా లో కాపు-కమ్మ వర్గాలకు సమ ప్రాధాన్యం ..!
వైసిపి అభ్యర్దుల ఖరారు విషయంలో సామాజిక సమీకరణాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. రాయలసీమ లో బిసి లకు..కోస్తా లో అక్కడ ప్రభావం చూపే వర్గాలకు సమ ప్రాధాన్యత ఇచ్చారు. ఇక, టిడిపి - వైసిపి లకు కీలకమైన అనం త పురం జిల్లాలో సినీ హీరో బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపూర్ లో పోలీసు అధికారిని ఖరారు చేసారు. అయితే, హిందూపూర్ లోక్సభ కు సైతం పోలీసు అధికారే కావటం ఇక్కడి ప్రత్యేకత.

హిందూపూర్ లో పోలీసు అధికారులే..
టిడిపి అధినేత చంద్రబాబు వియ్యంకుడు..సినీ హీరో బాలకృష్ణ పై వైసిపి పోలీసు అధికారిని రంగంలోకి దింపింది. ఈ స్థానంలో గత ఎన్నికల్లో నవీన్ నిశ్చల్ పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో బాలకృష్ణ గెలిచారు. ఇక, ఆ తరువాత టిడిపికి చెంది న మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గని సైతం వైసిపి లో చేరారు. దీంతో..సీటు పై పోటీ నెలకొంది. చివరకు బాలకృష్ణ పై రిటైర్డ్ పోలీసు అధికారి ఇక్బాల్ ను బరిలోకి దించారు. ఇక, హిందూపూర్ ఎంపి అభ్యర్ధిగా సైతం పోలీసు అధికారినే ఎంపిక చే సారు. హిందూపూర్ లోక్సభ టిడిపి అభ్యర్ది గా సిట్టింగ్ ఎంపీగా నిమ్మల కిష్టప్ప తిరిగి బరిలోకి దిగుతున్నారు. ఇక, వైసి పి నుండి కురుబ వర్గానికి చెందిన గోరంట్ల మాధవ్ ను అభ్యర్దిగా ఖరారు చేసారు. అనంతపురం జిల్లాలో రెండు లోక్స భ స్థానాల్లోనూ బిసి వర్గానికి చెందిన అభ్యర్దులనే బరిలోకి దించారు.
వైసిపి అభ్యర్దులు వీరే : బిసి...మైనార్టీలకు ప్రాధాన్యత : ఒకే సారి 175 మంది జాబితా..!

కృష్ణ జిల్లాలో ఆ రెండు వర్గాలకు...
కృష్ణా జిల్లా లో ఉన్న రెండు లోక్ సభ నియోజకవర్గాలలో ఒక సీటును కమ్మ, మరో సీటును కాపు సామాజికవర్గ నేతకు కేటాయించారు. ప్రముఖ వ్యాపారి పొట్లూరి వరప్రసాద్, మచిలీపట్నం నియోజకవర్గానికి మాజీ ఎమ్.పి బాలశౌరి ని అ భ్యర్ధిగా నిర్ణయించారు. జిల్లాలో నలుగురు కాపు నేతలకు, నలుగురు కమ్మ నేతలకు అసెంబ్లీ సీట్లు ఖరారు చేసారు . గన్నవరం, గుడివాడ, విజయవాడ తూర్పు,మైలవరం సీట్లను కమ్మ వర్గానికి, జగ్గయ్యపేట, అవనిగడ్డ,మచిలీపట్నం, కై్కలూరు స్థానాలను కాపులకు ఇచ్చారు. బిసిలకు పెనమలూరు, పెడన కేటాయించారు.వైశ్య,బ్రాహ్మణ,ముస్లిం,వెలమ లకు ఒక్కొక్క సీటుఇచ్చారు. ఇక, టిడిపికి అండగా నిలిచే ఓ ప్రధాన సామాజిక వర్గానికి గుంటూరు-ప్రకాశం జిల్లాల్లోనూ ప్రాధాన్యత ఇచ్చారు. గుంటూరు లో కమ్మ వర్గానికి మూడు..కాపు వర్గానికి రెండు స్థానాలు కేటాయించారు. ప్రకాశం లో దగ్గుబాటి వేంకటేశ్వరరావు పర్చూరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు.

లోకేష్ పై ఆళ్ల పోటీ..
గుంటూరు జిల్లా మంగళగిరి నుండి టిడిపి అభ్యర్ధిగా మంత్రి లోకేష్ పోటీ చేస్తున్నారు. ఆయన పై వైసిపి నుండి సిట్టిం గ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ని ప్రకటించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ గా ఉన్న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ను మండపేట నుండి అభ్యర్దిగా ప్రకటించారు. ఇక, టిడిపి వీడి వైసిపి లో చేరిన తోట నర్సింహం సతీమణి వాణికి ఇదే జిల్లాలోని పెద్దాపురం స్థానం ఖరారు చేసారు. అక్కడ నుండి డిప్యూటీ సీయం నిమ్మకాయల చిన రాజప్ప పోటీలో ఉన్నారు. ఇక, వైసిపి సీనియర్ నేత బొత్సా కుటుంబానికి విజయనగరంలో ప్రాధాన్యత ఇచ్చారు.
వారికి మూడు సీట్లు దక్కినట్లు ఉంది. గతసారి చీపురుపల్లి నుంచి పోటీచేసిన బెల్లాన చంద్రశేఖర్ కు విజయనగరం లోక్ సభ టిక్కెట్ ఇవ్వడం విశేషం.చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ, ఆయన సోదరుడు అప్పలనరసయ్య గజపతినగరం లో, తోడల్లుడు అప్పలనాయుడు నెల్లిమర్ల నుంచి పోటీచేయబోతున్నారు.