వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసిపి అభ్య‌ర్ధుల జాబితా వాయిదా..16న ఇడుపుల‌పాయ‌లో : అస‌లు కార‌ణం ఏంటంటే..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Election 2019 : YCP First List Has Been Postponed To 16th Of This Month | Oneindia Telugu

వైసిపి అభ్య‌ర్ధుల తొలి జాబితా విడుద‌ల వాయిదా ప‌డింది. ఈ రోజు ఉద‌యం 75 మందితో తొలి జాబితా విడుద‌ల చేయా ల‌ని తొలుత నిర్ణ‌యించారు. అయితే, స‌డ‌న్ గా వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నెల 16న ఇడుపుల‌పాయ లో అభ్య‌ర్ధుల జాబితా విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. అయితే, దీని వెనుక అసలు కార‌ణం ఏంటంటే..

<strong>పొట్లూరి..తోట‌..మాగుంట‌..రాజా ర‌వీంద్ర : నేడు వైసిపి లో కీల‌క చేరిక‌లు : ఈ రోజే తొలి జాబితా..!</strong>పొట్లూరి..తోట‌..మాగుంట‌..రాజా ర‌వీంద్ర : నేడు వైసిపి లో కీల‌క చేరిక‌లు : ఈ రోజే తొలి జాబితా..!

అభ్య‌ర్ధుల జాబితా విడుద‌ల వాయిదా

అభ్య‌ర్ధుల జాబితా విడుద‌ల వాయిదా

వైసిపి ఆశావాహుల్లో మ‌రిత ఉత్కంఠ పెరుగుతోంది. ముందుగా ఈ రోజు ఉద‌యం 10.20 గంట‌ల‌కు 75 మంది తో వైసిపి తొలి జాబితా విడుద‌ల చేయాల‌ని డిసైడ్ అయ్యారు. ఆ మేర‌కు స‌మాచారం అందించారు. అయితే, ఉద‌యం నుండి వైపిపి లో భారీ చేరిక‌లు చోటు చేసుకున్నాయి. వైసిపి ఎన్నిక‌ల కోర్ క‌మిటీ స‌మావేశం అయింది. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ చేరిక‌ల్లో బిజీగా ఉన్నారు. దీంతో..ముందుగా నిర్ణ‌యించిన ముహూర్త స‌మ‌యం దాటి పోయింది.

వైసిపి తొలి జాబితా

వైసిపి తొలి జాబితా

విశాఖ స్వ‌రూపానంద వైసిపి తొలి జాబితా విడుద‌ల‌కు ముహూర్తం నిర్ణ‌యించారు. అయితే, ముహూర్త స‌మ‌యం దాటి పోవ‌టం తో మ‌రో సారి స్వ‌రూపానంద‌ను వైసిపి నేత‌లు సంప్ర‌దించారు. ఆయ‌న మరో ముహూర్తం సూచించారు. ఇదే స‌మ‌యంలో టిడిపి సైతం రేపు అధికారికంగా లిస్టు ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించారు. ఈ రోజే..రేపో జ‌న‌సేన సైతం లిస్టు విడుద‌ల‌కు సిద్దం అవుతోంది. దీంతో..రెండు రోజులు ఆగి లిస్టు విడుద‌ల చేయ‌టం ద్వారా మిగిలిన రెండు పార్టీల వ్యూహాల పైనా అంచ‌నా వ‌స్తుంద‌నే భావ‌న వ్య‌క్తం అయింది.

16 ఉద‌యం 10.26 గంట‌ల‌కు

16 ఉద‌యం 10.26 గంట‌ల‌కు

ఈ రోజు వాయిదా ప‌డిన అభ్య‌ర్దుల లిస్టు విడుద‌ల కార్య‌క్ర‌మం ఈ నెల 16న ఉద‌యం 10.26 గంట‌ల‌కు నిర్వ‌హించాల ని నిర్ణ‌యించారు. అదే రోజు వైసిపి అధినేత జ‌గ‌న్ ఇడుపుల పాయ‌లో వైయస్సార్ ఘాట్ వ‌ద్ద నివాళులు అర్పించి తొలుత లిస్టును విడుద‌ల చేసారు. ఆ త‌రువాత అక్క‌డి నుండే ఎన్నిక‌ల ప్ర‌చారం బ‌స్సు యాత్ర ద్వారా ప్రారంభిస్తా రు. ఆ రోజు విడుద‌ల చేసే జాబితాలో దాదాపు అన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల తో పాటుగా లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం. ఈ లోగా టిడిపి..జ‌న‌సేన అభ్య‌ర్ధుల జాబితాలు విడుద‌ల కానున్నాయి. ఆ త‌రువాత అవ‌స‌రం అయితే తుది జాబితాలో మార్పులు చేర్పులు చేసే అవ‌కాశం ఉంది. అయితే, ఇప్పుడు ఈ లిస్టు వాయిదా నిర్ణ‌యం ఆశావాహుల్లో మ‌రితం ఉత్కంఠ‌కు కార‌ణం అవుతోంది.

English summary
YCP first list releasing programme has been post phoned to 16 th of this month. YCP Chief Jagan release party candidates lilst at Idupulapaya and start his election campaign by bus Yatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X