అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పండుగ చేసుకోండి..టపాసులు కాల్చండి: సభలో ఆమోదానికి ముందుగానే: వైసీపీ నేతలకు సందేశాలు..!

|
Google Oneindia TeluguNews

అసెంబ్లీ సమావేశం..మూడు రాజధానుల నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీలో ప్రభుత్వం రాజధానుల పైన ఏ విధంగా ముందుకు వస్తుందనే చర్చ సాగుతోంది. బిల్లులో అమరావతి గురించి ఏం చెబుతారనే అంశం పైన భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీఆర్డీఏ బిల్లను ద్రవ్య బిల్లుగా తీసుకొస్తారా..లేక సాధారణ బిల్లుగా ప్రతిపాదిస్తారా..అధికార వైసీపీ ఏం చేయబోతోంది..శాసనసభలో మెజార్టీ ఉన్నా.. మండలిలో బలం ఉన్న టీడీపీ అక్కడ ప్రతిఘటిస్తే ప్రభుత్వం ఏం చేయబోతోంది..ఇలా చర్చ సాగుతున్న సమయంలో వైసీపీ కార్యాలయం నుండి పార్టీ నేతలకు సందేశాలు వచ్చాయి. వారి ఫోన్లకు మెసేజ్ ల అందాయి. వికేంద్రకరణ దిశగా ముఖ్యమంత్రి నిర్ణయానికి ఆమోదం లభిస్తోంది. ఆ వెంటనే జిల్లా..మండల కేంద్రాల్లో టపాసులు కాల్చండి..ర్యాలీలు నిర్వహించండి..పండుగ వాతావరణం కనిపించాలంటూ ఆ సందేశాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

వైసీపీ నేతలకు సందేశాలు..
మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశం కానుంది. ప్రభుత్వం అనుకున్న విధంగానే రాజధానుల పైన బిల్లును సభలో ప్రవేశ పెట్టనుంది. ముందుగా కేబినెట్ లో దీనికి ఆమోద ముద్ర వేసి..ఆ వెంటనే అసెంబ్లీలో చర్చ కు ప్రతిపాదించనుంది. ఈ బిల్లుకు శాసనసభలో అధికార పార్టీకి పూర్తి మెజార్టీ ఉండటంతో..ప్రతిపక్షం నుండి అడ్డంకులు ఎదురైనా బిల్లు పాస్ అవ్వటంలో ఇబ్బందులు ఉండకపోవచ్చు. అదే సమయం లో శాసనసభలో పాసైన బిల్లు మంగళవారం శాసన మండలిలో ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది. అక్కడ టీడీపీ బలం ఎక్కువ. వైసీపీకి కేవలం 9 మంది సభ్యుల బలమే ఉంది. టీడీపీ సైతం అక్కడే తాము బిల్లును అడ్డుకుంటామని చెబుతోంది. దీనికి ప్రభుత్వం ప్రతివ్యూహం సిద్దం చేస్తోంది. అక్కడ కూడా ఆమోదం..లేక అక్కడ తిరస్కరిస్తే ఆ వెంటనే మరుసటి రోజున మరోసారి అసెంబ్లీలో ఆమోదించి తుది ఆమోద ముద్ర వేయాలని ప్రభుత్వం ఆలోచన. ఇక..ఇదే అంశం మీద ఉత్కంఠ..అదే విధంగా అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో వైసీపీ నేతలకు కొన్ని సందేశాలు వచ్చాయి.

 YCP central office directed party leaders to celebrate govt decentralistaion decision

పండుగ వేడకులకు సిద్దం అవ్వండి..
ఇక..ఈ ఉత్కంఠ కొనసాగుతున్న సమయంలోనే వైసీపీ కార్యాలయం నుండి పార్టీ నేతలకు సందేశాలు వచ్చాయి. ముఖ్యమంత్రి జగన్ అధికార వికేంద్రీకరణ దిశగా సంచలన నిర్ణయం తీసుకున్నారని..ఆ నిర్ణయానికి అధికారిక ఆమోదం లభిస్తుందని ఆ సందేశంలో పేర్కొన్నారు. దీనికి కొనసాగింపుగా..ఆ నిర్ణయం సభలో ఆమోద ముద్ర పడగానే..పార్టీ నేతలు జిల్లా కేంద్రాలు..మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించాలని..టపాకాయాలు పేల్చి ప్రజలకు ఈ విషయం చేరేలా చేయాలంటూ ఆ సందేశాల్లో పేర్కొన్నారు. ఈ రోజు సభలో ఆమోదం పొందినా..మండలిలో రేపు బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది. ప్రక్రియ పూర్తి కాకుండానే..పార్టీ శ్రేణులకు ఇటువంటి సందేశాలు రావటం పైన ఇప్పుడు వైసీపీలోనే చర్చ సాగుతోంది.

English summary
YCP central office directed party leaders to celebrate govt decentralistaion decision after approval in Assembly. In all district and Mandal head quarters party leaders participate in these elebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X