వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను మీకు మద్దతు ఇవ్వను...తేల్చేసిన జగన్...షాకింగ్

|
Google Oneindia TeluguNews

ఎస్సీ వర్గీకరణకు తాను మద్దతిచ్చేది లేదని వైకాపా అధినేత జగన్ స్పష్టం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆయన ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ పాదయాత్రను ముట్టడించిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఎస్సీ వర్గీకరణపై వైకాపా వైఖరిని స్పష్టం చేయాలని కోరిన సందర్భంలో తాను మద్దతిచ్చేది లేదని వైసిపి అధినేత జగన్ స్పష్టం చేశారు.

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర 93వ రోజుకు చేరుకోగా ఈ రోజు ప్రకాశం జిల్లాలోని కందుకూరు నుంచి ప్రారంభ‌మైన ఈ యాత్ర వెంక‌టాద్రిపాలెం, అనంతసాగరం మీదుగా జరుగుమల్లి మండలం ఎడ్లూరుపాడు వద్ద కొండపి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కొండపి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు భారీ జనసందోహం మధ్య వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికారు.

YCP Chief Jagan Gives Clarity On SC categorisation

అనంతరం జగన్ పాదయాత్ర ముందుకు సాగుతుండగా ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తివ్వాలంటూ ఎమ్మార్పీఎస్ కార్య‌క‌ర్త‌లు జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను అడ్డుకున్నారు.ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తుపై జ‌గ‌న్ త‌మ పార్టీ వైఖ‌రేంటో చెప్పాల‌ని ఆందోళ‌న చేశారు. దీంతో తమ పార్టీ ఎస్సీ వ‌ర్గీక‌రణ‌కు మ‌ద్ద‌తివ్వ‌డం లేద‌ని జగన్ ఖరాఖండిగా తేల్చి చెప్పేశాడు. పైగా ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశం రాష్ట్ర ప‌రిధిలో లేద‌ని, దాన్ని కేంద్రం తేల్చాల్సి ఉంద‌ని జగన్ వారికి తన అభిప్రాయం తెలియజేశాడు.

English summary
YSRCP Chief Jagan mohan Reddy has cleared that his party will not support to the MRPS seeking categorisation of Scheduled Castes. Jagan has made it clear to the MRPS activists who blocked his pada yatra in Prakasam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X