హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వతంత్ర సంస్థతో విచారణ కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ గురువారానికి వాయిదా

|
Google Oneindia TeluguNews

Recommended Video

జగన్ పిటిషన్ పై విచారణ గురువారానికి వాయిదా..!

హైదరాబాద్‌:విశాఖపట్టణం ఎయిర్‌పోర్టులో తనపై జరిగిన హత్యాయత్నం ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ కోరుతూ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ఒకరోజు వాయిదా పడింది.

ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్‌ ఆకస్మిక సెలవు నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. మంగళవారం సీజే సెలవులో ఉండడంతో ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా వినాలని కోరుతూ జస్టిస్‌ వి. రామసుబ్రమణియన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందు జగన్‌ తరఫు న్యాయవాది ప్రస్తావించారు. అయితే పిల్ లను విచారించాల్సింది సీజే అయినందున, ఆయన సెలవు నేపథ్యంలో విచారణను వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఈ వ్యాజ్యంతో పాటు
వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యం, బి. అనిల్‌ కుమార్‌ దాఖలు చేసిన పిల్‌ ల విచారణ కూడా గురువారానికి వాయిదాపడ్డాయి.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌

తనపై జరిగిన హత్యాయత్నం నేపథ్యంలో ఆ కేసు విచారణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఇదే అంశంపై వైసిపి తరఫున పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కూడా పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ రెండు వ్యాజ్యాలపై గత వారం విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ శేషసాయి, జగన్‌పై దాడి నేపథ్యంలో విమానాశ్రయాల్లో భద్రతా లోపాలపై దాఖలైన మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌)తో ఈ రెండు వ్యాజ్యాలను జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్, వైవీ సుబ్బారెడ్డిలు దాఖలు చేసిన వ్యాజ్యాలు కూడా మంగళవారం కేసు విచారణ జాబితాలో ఉన్నాయి. ఈ మూడు వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించాల్సి ఉంది.

దీపావళి సందర్భంగా కోర్టుకు సెలవు

దీపావళి సందర్భంగా కోర్టుకు సెలవు

అయితే మంగళవారం సీజే సెలవులో ఉండడంతో ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా వినాలని కోరుతూ జస్టిస్‌ వి. రామసుబ్రమణియన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందు జగన్‌ తరఫు న్యాయవాది ప్రస్తావించారు. అయితే ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలను సీజేనే విచారించాల్సి ఉన్నందున తాము వీటిని విచారించడం కుదరదని ఈ వ్యాజ్యాల విచారణను సున్నితంగా తోసిపుచ్చిన ధర్మాసనం బుధవారం దీపావళి సందర్భంగా కోర్టుకు సెలవు ఉన్నందున గురువారం విచారణకు వేయమని రిజిస్ట్రీని ఆదేశిస్తామని వెల్లడించింది.

పిటిషనర్ తరుపు న్యాయవాది మోహన్ రెడ్డి మాట్లాడుతూ

పిటిషనర్ తరుపు న్యాయవాది మోహన్ రెడ్డి మాట్లాడుతూ

ఈ సందర్భంగా పిటిషనర్ తరుపు న్యాయవాది మోహన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ పై హత్యాయత్నం జరిగిన గంటలోపు డీజీపీ విలేకరుల సమావేశం పెట్టి మరీ నిందితుడు ప్రచారం కోసమే జగన్‌పై దాడి చేశారని ప్రకటించారని చెప్పారు. సిఎం చంద్రబాబు సైతం ఇది చాలా చిన్న సంఘటన అంటూ ఘటనను తక్కువ చేసేలా మాట్లాడినట్లు మోహన్‌రెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశంలేదని, అందుకే రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థకు దర్యాప్తు బాధ్యతలను అప్పగించాలని కోరుతున్నామన్నారు.

ధర్మాసనం

ధర్మాసనం

ఈ సమయంలో మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్ తరఫు న్యాయవాది కృష్ణమూర్తి జోక్యం చేసుకుంటూ, తాము కూడా సీబీఐ దర్యాప్తును కోరుతున్నామని, ఆ రెండు పిల్స్ లోని వినతుల్లాగానే తమ అభ్యర్థన కూడా ఉందని తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించవలసింది ఛీప్ జస్టిస్ అని, అయితే సీజే సెలవు నేపథ్యంలో తాము మొదటి కోర్టు బాధ్యతలను తాత్కాలికంగా నిర్వర్తిస్తున్నామని చెప్పారు. ఈ మూడు పిల్స్ ను సిజే నేతృత్వంలోని ధర్మాసనమే విచారించడం సబబని న్యాయంస్థానం అభిప్రాయపడుతూ ఆ మేరకు విచారణ ఒకరోజు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

English summary
A petition filed by AP Opposition leader, YCP Chief Jagan for an independent investigating agency over murder attempt at Visakhapatnam airport has been postponed one day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X