అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసిపి అధికారంలోకి వ‌స్తే రాజ‌ధాని ఎక్క‌డ‌ : మేనిఫెస్టోలో అమ‌రావ‌తి పై : వైసిపి స్ప‌ష్టీక‌ర‌ణ‌..!

|
Google Oneindia TeluguNews

వైసిపి అధికారంలోకి వ‌స్తే ఏపి రాజ‌ధాని ఎక్క‌డ‌. అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండ‌దా. జ‌రుగుతున్న ప్ర‌చారానికి వైసిపి ఇస్తున్న స‌మాధానం ఏంటి. ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసిపి ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఏపి రాజ‌ధాని విష‌యంలో త‌మ మేనిఫెస్టోలో స్ప‌ష్ట‌త ఇవ్వ‌నున్నారు. ఏం చెప్ప‌బోతున్నారు..

అమ‌రావ‌తే రాజ‌ధానిగా..
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుంది. అమరావతే రాజధానిగా ఉంటుంది.. అని పార్టీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు, సీనియర్‌ నేత ఉమ్మారెడ్ది వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. దీనిని పార్టీ ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో)లో కూడా పొందుపరుస్తామని వెల్లడించారు. ఈ విషయంలో తమ పార్టీకి నష్టం కలిగించేలా.. ప్రజలను గందరగోళ పరిచేలా కొంతమంది వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు.

YCP clarified Amaravati it self capital city for AP..

మెరుగైన రాజధానిని నిర్మించడమే తమ పార్టీ లక్ష్యమని తెలిపారు. వైఎస్సార్‌ సంక్షేమ పథకాలనే తాము స్ఫూర్తిగా తీసుకుంటు న్నామని, వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని చిత్తశుద్ధితో అమలుచేసేలా మేనిఫెస్టో రూపొందిస్తున్నామ న్నారు. జ‌గ‌న్ రాజ‌ధానిగా అమ‌రావ‌తి ని మారుస్తార‌ని..దొన‌కొండ లో రాజ‌ధాని ఏర్పాటు చేస్తారంటూ చాలా కాలంగా ప్ర‌చారం చేస్తున్నారు. దీనికి తిప్పి కొట్టాల‌ని వైసిపి నిర్ణ‌యించింది. ఇందులో భాగంగానే ఎన్నిక‌ల ముందే ఈ స్ప‌ష్ట‌త ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది.

పాద‌యాత్ర అనుభ‌వాల‌తో..
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో అనేక వర్గాల సమస్యలు, భౌగోళిక పరిస్థితులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారని.. ఈ నేపథ్యంలో ఆయన అనేక వాగ్దానాలు చేశారని, వాటన్నింటినీ మేనిఫెస్టోలో పొందుప రుస్తామని ఉమ్మారెడ్డి స్ప‌ష్టం చేసారు. అయితే, జ‌గ‌న్ త‌న పాదయాత్ర‌లో ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గానికి మేనిఫెస్టో ప్ర‌క‌టిస్తా మ‌ని చెప్పారు. అదే విధంగా రాష్ట్ర స్థాయి మేనిఫెస్టోల మూడు లేదా నాలుగు పేజీలు మాత్ర‌మే ఉంటుంద‌ని చాలా స‌భ ల్లో చెప్పుకొచ్చారు. న‌వ‌ర‌త్నాల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ వైసిపి మేనిఫెస్టో క‌మిటీ త‌మ ప్ర‌ణాళిక‌ను సిద్దం చేస్తోంది.

English summary
YCP it self clarified that amaravati continue as capital city for AP. Before elections YCP particularly mentioned this statement to controll damage in Amaravati surroundings in up coming elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X