వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ రంగుల కేసు .. 4 వేల కోట్ల ఖర్చు లెక్కలు చెప్పండన్న కోర్టు , విచారణ వాయిదా

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న అంశంపై ఏపీలో పెద్ద యుద్ధమే జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి రంగులు అంశంపై ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వైసీపీ రంగుల కోసం, దుర్వినియోగం చేసిన ప్రజాధనాన్ని వైసిపి నుండి , మంత్రుల నుండి రికవరీ చేయాలని డాక్టర్ శైలజ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి రంగులు వేయడానికి నాలుగు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినట్లుగా పేర్కొన్న డాక్టర్ శైలజ వైసిపి మంత్రులు, సంబంధిత అధికారుల నుండి వసూలు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.

జైలుకెళ్ళొచ్చినా బుద్ధి రాలేదా .. జగన్ పై వ్యాఖ్యలా ? అచ్చెన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకో : మంత్రి అవంతి వార్నింగ్జైలుకెళ్ళొచ్చినా బుద్ధి రాలేదా .. జగన్ పై వ్యాఖ్యలా ? అచ్చెన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకో : మంత్రి అవంతి వార్నింగ్

 వైసీపీ రంగులు , నిధుల దుర్వినియోగంపై కోర్టులో వాదనలు

వైసీపీ రంగులు , నిధుల దుర్వినియోగంపై కోర్టులో వాదనలు

ఈ పిటిషన్ విచారించిన కోర్టు నాలుగు వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు అయిందో తెలపాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగుల విషయంలో దాఖలు చేసిన పిటిషన్ పై పిటిషనర్ తరఫున అడ్వకేట్ డిఎస్ ఎన్ వి ప్రసాద్ బాబు వాదనలు వినిపించారు. ఈ కేసులో కోర్టు తీర్పు వచ్చేవరకు మాజీ సీఎస్ నీలం సాహ్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపాలని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, మంత్రుల నుండి బ్యాంకు గ్యారెంటీ తీసుకోవాలని పిటిషనర్ కోరారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంపై కోర్టు సీరియస్ గా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

నాలుగు వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేశారో తెలపాలని ప్రభుత్వానికి ఆదేశం

నాలుగు వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేశారో తెలపాలని ప్రభుత్వానికి ఆదేశం


ఈ వ్యవహారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోర్టు నాలుగు వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేశారో తెలపాలని పేర్కొంది . తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భవనాలకు రంగులు వేయటం పెద్ద వివాదానికి కారణం అయ్యింది. అయితే ఆ రంగులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలోని రంగులు అంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించారు . కోర్టు మెట్లు ఎక్కారు.

పార్టీ రంగులు తొలగించాలని గతంలోనే హైకోర్టు ఆదేశం .. ఏపీలో వైసీపీ రంగుల దుమారం

పార్టీ రంగులు తొలగించాలని గతంలోనే హైకోర్టు ఆదేశం .. ఏపీలో వైసీపీ రంగుల దుమారం

ఆ తర్వాత హైకోర్టు ప్రభుత్వ పంచాయతీ భవనాలకు ఉన్న రంగులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది . రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాలకు వేసిన వైసీపీ రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులను వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానివని, వాటికి పార్టీ రంగులు ఉండకూడదని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. దీంతో మళ్ళీ రంగులు మార్చాల్సి వచ్చింది . ఇదంతా ప్రజాధనం దుర్వినియోగం అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఏకంగా పలువురు కోర్టులో పిటిషన్లు దాఖలు చేసి, ఆ డబ్బులు వసూలు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నారు.

English summary
A petition has been filed in the High Court on the issue of YCP colors for government offices. Dr. Shailaja has filed a petition in the High Court seeking recovery of the misused public money from the YCP and ministers . court asked the government to show the accounts for that Rs 4,000 crore rupees ,and the case adjourned for three weeks .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X