గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజాయితీకి బహుమానం బదిలీ...ఆ హామీ తీసుకునే పోస్టింగులు:ఐపిఎస్ ల బదిలీపై వైసిపి ధ్వజం

|
Google Oneindia TeluguNews

గుంటూరు:తాజా ఐపిఎస్ బదిలీలను వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని...సిఎం చంద్రబాబు పోలీస్ అధికారులతో అర్థరాత్రి మంతనాలు జరిపి మరీ చేశారని వైసిపి నేత, మాజి డిఐజి చంద్రగిరి ఏసురత్నం విమర్శించారు.

వచ్చే ఎన్నికల్లో తమ పార్టికి అనుకూలంగా ఏవిధంగా వ్యవహరించాలో హామి తీసుకుని మరీ పోస్టింగ్ లు
ఇచ్చారని ఏసురత్నం ఆరోపించారు. వైసిపి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, మాజి డిఐజి చంద్రగిరి ఏసురత్నంఆరోపించారు. తమకు అనుకూలంగా ఉన్న వారికే ప్రాధాన్యత కలిగిన, కీలకమైన పోస్టింగ్ లు ఇచ్చారని ఆయన విమర్శించారు.

YCP criticism over transfer of IPS officers

గుంటూరులోని జిల్లా వైసిపి కార్యాలయంలో ఆ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అయిన చంద్రగిరి ఏసురత్నం మీడియాతో మాట్లాడారు. గుంటూరు రూరల్ ఏస్ పి గా పనిచేసిన అప్పల నాయుడు
పట్టుమని ఏడాది కూడ పూర్తి చెయ్యకముందే ఆయనను బదిలీ చేసేశారని ఏసురత్నం చెప్పారు . జిల్లాలో క్రికెట్ బెట్టింగ్,
ఇసుక , మైనింగ్ మాఫియా, గుట్కా వ్యాపారస్తుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించడం వల్లే ఈయనను బదిలీ చేసారని అన్నారు.

నిజాయితీగా పనిచేస్తే బదిలీ వేటునే బహుమానం గా ఇచ్చారని వ్యాఖ్యానించారు. అలాగే అధికార పార్టీకి చెందిన నేతలు ముఖ్యమంత్రి పై ఒత్తిడి తెచ్చి ఆయా స్థానాల్లో నిజాయితీగా పనిచేస్తున్న అధికారులను
బదిలీ చేయించారని ఏసురత్నం ఆరోపించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పూర్తిగా ఈ బదిలీల పర్వం సాగిందని
ఆయన విమర్శించారు. అయితే నిజాయితీతో పనిచేసే అధికారులను బదిలీ చెయ్యడాన్ని ఆ అధికారులు అవమానకరంగా
భావిస్తారని చెప్పుకొచ్చారు.

English summary
Guntur: YCP leader, ex DIG Chandragiri Yesuratnam criticized that transferring Police officers who were honest in the transfers of the latest IPS officers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X