వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డోర్లు ఓపెన్ చేసేద్దాం: బీజేపీ - టీడీపీ ఆరోప‌ణ‌లకు ఇదే స‌మాధానం: వైసీపీతో ట‌చ్‌లో ఎవ‌రంటే..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న హామీల‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించారు. అసెంబ్లీ స‌మావేశాలు ముగిసాయి. రెండు నెల‌ల త‌న పాల‌న పైన బీజేపీ నేత‌లు ప్ర‌తీ రోజు ఆరోప‌ణ‌లు చేయ‌టం ముఖ్య‌మంత్రికి రుచించ‌టం లేదు. ఏపీ సంగ‌తి కేంద్రంలో ని బీజేపీ నేత‌లు ప‌ట్టించుకోవ‌టం లేదు. అయినా..వేచి చూసే ధోర‌ణితో వారికి అన్ని సంద‌ర్భాల్లో అండ‌గా నిలుస్తూనే ఉన్నా ము. టీడీపీ స్థానం తాము భ‌ర్తీ చేస్తామ‌నే అంచ‌నాల్లో బీజేపీ ఉంది. మ‌నం ఇప్ప‌టికీ స్పందించ‌క‌పోతే రాజ‌కీ యంగా న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంది. ఇదే స‌మ‌యంలో మౌనంగా ఉంటే ప్ర‌జ‌ల్లో ప్ర‌తికూల సంకేతాలు వెళ్తాయి. ఇక ..డోర్లు ఓపెన్ చేద్దాం ..టీడీపీ .. బీజేపీ నుండి ట‌చ్‌లో ఉన్న నేత‌ల‌ను తీసుకుందాం..శ్రావ‌ణ మాసం మొద‌లైంది. ఇక‌.. మొద‌లు పెడదాం.. ఇదీ తాజాగా వైసీపీ ముఖ్య‌నేత‌ల వ‌ద్ద అధినేత జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే ముందు జ‌రిగిన చ‌ర్చ సారాంశం..ఇంత‌కీ వైసీపీ ఏం చేయ‌బోతోంది..

టీడీపీలో ఇంకా ఆ ఇద్ద‌రి నిర్ణ‌యాలేనా..!! మ‌రి.. చంద్ర‌బాబు పరిస్థితి ఏంటీ..? రాజ్యసభ సాక్షిగా...టీడీపీలో ఇంకా ఆ ఇద్ద‌రి నిర్ణ‌యాలేనా..!! మ‌రి.. చంద్ర‌బాబు పరిస్థితి ఏంటీ..? రాజ్యసభ సాక్షిగా...

ఉపేక్షిస్తే భారీగా న‌ష్ట‌పోతాం...

ఉపేక్షిస్తే భారీగా న‌ష్ట‌పోతాం...

కొద్ది రోజులుగా టీడీపీతో పోటీ ప‌డి బీజేపీ నేత‌లు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ల‌క్ష్యంగా చేసుకుంటున్నాయి. ఏపీకి వ‌చ్చిన ప్ర‌తీ బీజేపీ నేత జ‌గ‌న్ పైన‌..పాల‌న మీద తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. దీని పైన వైసీపీ నేత‌లు ఎక్క‌డా రియాక్ట్ అవ్వ‌టం లేదు. అదే స‌మ‌యంలో ఢిల్లీ కేంద్రం టీడీపీ..బీజేపీ రాజ‌కీయ ఎత్తుగ‌డుల‌ను వైసీపీ గ‌మ‌నిస్తోంది. కేంద్రంతో స‌ఖ్య‌త అవ‌స‌ర‌మ‌నే కార‌ణంతో బీజేపీ నేత‌ల ఆరోప‌ణ‌ల‌కు వైసీపీ నేత‌లు సమాధానం చెప్ప‌టం లేదు. మ‌రి కొంత కాలం వేచి చూసే ధోర‌ణ‌తో ఉండాల‌ని తొలుత నిర్ణ‌యించారు. రాజ‌కీయాలు కంటే ముందుగా తామిచ్చిన హామీల అమ‌లు..పాల‌న మీద దృష్టి పెట్టాల‌ని నిర్ణ‌యించారు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ హామీలకు చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించారు. ఈ నెల 6,7 తేదీల్లో సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోదీతో పాటుగా బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షాతో స‌మావేశం అవుతున్నారు. ఆ స‌మ‌యంలో రాజ‌కీయ ప‌రిస్థితుల పైన చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది. అప్పటి వ‌ర‌కు ఎదురు చూసి..ఆ త‌రువాత వైసీపీ సైతం రాజకీయంగా త‌మ ఎత్తుగ‌డ‌ల‌ను అమ‌లు చేయాల‌ని భావిస్తోంది.

డోర్లు ఓపెన్ చేద్దాం.. ఆల‌స్యం అవ‌స‌రం లేదు..

డోర్లు ఓపెన్ చేద్దాం.. ఆల‌స్యం అవ‌స‌రం లేదు..

వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప‌లువురు టీడీపీ నేత‌లు వైసీపీతో ట‌చ్‌లోకి వ‌చ్చారు. వారిలో ప్ర‌స్తుత ఎమ్మెల్యే ల‌తో పాటుగా కీల‌క నేత‌లు ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే, అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే వారిని వైసీపీలోకి ఆహ్వానిస్తే ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక భావం వ‌చ్చే అవకాశం ఉంద‌ని వైసీపీ అంచ‌నా వేసింది. అదే స‌మ‌యంలో టీడీపీ గెలిచిన ఎమ్మెల్యే ల విష‌యంలో మాత్రం వారు రాజీనామా చేస్తేనే వైసీపీలోకి తీసుకుంటామ‌ని స్ప‌ష్ట‌త ఇచ్చింది. దీంతో..ఎమ్మెల్యేలుగా ఉంటూ బీజేపీలోకి అయినా వెళ్దామ‌ని భావించిన వారికి జ‌గ‌న్ శాస‌న‌స‌భ‌లో చేసిన ప్ర‌క‌ట‌న అడ్డంకిగా మారింది. దీంతో వారికి ప్ర‌త్యామ్నాయం లేకుండా పోయింది. ఇదే స‌మ‌యంలో గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన కొంద‌రు నేత‌లు ఇప్ప‌టి కే వైసీపీతో ట‌చ్‌లో ఉన్నారు. వారికి వైసీపీ ముఖ్య నేత‌ల నుండి కొంత స‌మ‌యం వేచి ఉండాల‌నే సూచ‌న అందింది. ఇదే స‌మ‌యంలో టీడీపీ నుండి బీజేపీలోకి వెళ్లిన నేత‌ల నుండి క‌మ‌లం పార్టీలోకి రావాలంటూ ఒత్తిడి పెరుగుతోంది.
అయితే, ఏపీలో బీజేపీ భ‌విష్య‌త్ మీద కొంత మంది నేత‌లకు ఇప్పటికీ అపోహ‌లు ఉన్నాయి.

ఓకే అంటే..వారు వైసీపీలోకి వ‌స్తారంటూ..

ఓకే అంటే..వారు వైసీపీలోకి వ‌స్తారంటూ..

మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ వైసీపీలోకి రావ‌టం దాదాపు ఖాయ‌మైంది. అయితే, ఆయ‌న‌కు ఎక్క‌డ బాధ్య‌త‌లు ఇవ్వాల నే దాని పైనే సందిగ్ద‌త కొన‌సాగుతోంది. అదే విధంగా కృష్ణా జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్సీ సైతం వైసీపీ నేత‌ల‌తో ట‌చ్ లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఒక ప్ర‌ధాన సామాజిక వ‌ర్గానికి చెందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే వైసీపీలో ముఖ్య నేత‌తో సంప్ర‌దింపులు పూర్తి చేసారు. విశాఖ‌లో టీడీపీ హాయంలో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి సైతం ఇప్ప‌టికే తాను వైసీపీలోకి వ‌చ్చేందుకు సిద్ద‌మ‌ని వ‌ర్త‌మానం పంపారు. అనంత‌పురం జిల్లాలో టీడీపీకి కీల‌కం వ్య‌వ‌హారించిన ఒక మాజీ ఎంపీ తాము వైసీపీలోకి వ‌చ్చేందుకు సిద్ద‌మ‌ని..త‌న కుమారుడి భ‌విష్య‌త్ పైన హామీ ఇవ్వాల‌ని కోరుతున్నారు. అదే విధంగా చిత్తూరు జిల్లాలో మాజీలైన ఇద్ద‌రు నేత‌లు నేరుగా ఆ జిల్లాకు చెందిన సీనియ ర్ నేత‌తో ట‌చ్‌లో ఉన్నారు. ఇదే స‌మ‌యంలో శ్రావ‌ణ మాసం మొద‌ల‌వ్వ‌టంతో ప‌ద‌వుల్లో లేని వారిని ముందుగా త‌మ పార్టీలోకి తీసుకోవాల‌ని..త‌ద్వారా ప్ర‌త్య‌ర్ధి పార్టీల‌కు చెక్ పెట్టాల‌నేది వైసీపీ వ్యూహంగా క‌నిపిస్తోంది. దీని పైన సీఎం జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న నుండి రాగానే తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు.

English summary
YCP decided open doors for who want to join in party. To face TDP and BJP politically YCP following new strategy in new joining's. After Jagan return to Amaravati some leaders may join in YCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X