శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ రెండు స్థానాలు వైసీపీవే : అధికారులే ఓడించారు : ఏం చేయాలో మాకు తెలుసు: సాయిరెడ్డి..!

|
Google Oneindia TeluguNews

ఏపీలోని మొత్తం 25 లోక్‌స‌భ స్థానాల్లో 22 స్థానాల‌ను వైసీపీ గెలిచింది. శ్రీకాకుళం..విజ‌య‌వాడ‌..గుంటూరు లోక్‌స‌భ సీట్ల ను టీడీపీ గెలుచుకుంది. అయితే, గుంటూరు..శ్రీకాకుళం ఎంపీ స్థానాల్లో టీడీపీ గెల‌వ‌లేద‌ని..అక్క‌డి అధికారులు ప‌క్ష పాతం ప్ర‌ద‌ర్శించార‌ని వైసీపీ ఆరోపిస్తోంది. దీంత..ఇప్పుడు ఆ రెండు లోక్‌స‌భ స్థానాల పైన న్యాయ పోరాటానికి సిద్ద‌మైంది. దీని పైన ఇప్ప‌టికే పార్టీ ముఖ్య నేత విజ‌య సాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు.

గుంటూరులో అధికారుల ప‌క్ష‌పాతం..
గుంటూరు లోక‌స‌భ ప‌రిధిలో ఒక్క అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం మిన‌హా ప్ర‌తీ చోట వైసీపీ గెలిచినా..ఎంపీ స్థానం మాత్రం టీడీపీ గెలుచుకుంది. గుంటూరు ఎంపీ స్థానంలో పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపులో రిటర్నింగ్‌ అధికారి పక్షపాతం ప్రదర్శించారని వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ఆరోపించారు. స్వల్ప సాంకేతిక కారణం చూపి 9700 ఓట్లను లెక్కించలేదని ఆయన ట్వీటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్క‌డ రిటర్నింగ్ అధికారిగా ఉన్న వ్య‌క్తి టీడీపీకి మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రించార‌ని ..దీంతో టీడీపీ 4200 ఓట్లతో గెల్చినట్టు ప్రకటించారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. గుంటూరు లోక్‌సభ స్థానంలోని సుమారు 9,700 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లున్న కవర్‌పై 13-సీ నంబరు లేకపోవడంతో వాటిని లెక్కించలేద‌ని వివ‌రించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాకుండానే రిటర్నింగ్‌ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఫలితాలను అధికారికంగా ప్రకటించారని వైఎస్సార్‌సీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి కోర్టును ఆశ్ర‌యిస్తున్న‌ట్ల వెల్ల‌డించారు.

YCP decided to Fight in court against Guntur and Srikakulam returning officers ..

శ్రీకాకుళంలోనూ ఇదే తీరున...
గుంటూరు ఎంపీ సీటుతో పాటుగా శ్రీకాకుళం ఎంపీ స్థానంలోనూ అధికారులు ఇదే తీరున వ్య‌వ‌హిరించార‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. దీని కార‌ణంగానే శ్రీకాకుళంలో వైసీపీ ఎంపీ అభ్య‌ర్ది ఓడిపోవాల్సి వ‌చ్చింద‌ని చెబుతున్నారు. అక్క‌డి నుండి వైసీపీ అభ్య‌ర్దిగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ పైన టీడీపీ అభ్య‌ర్ది రామ్మోహ‌న్ నాయుడు కేవ‌లం 6,658 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ లోక్‌స‌భ ప‌రిధిలోని ఇచ్ఛాపురం..టెక్క‌లిలో మాత్ర‌మే టీడీపీ అభ్య‌ర్దులు గెలుపొందారు. మిగిలిన అయిదు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ గెలిచింది. ఇప్పుడు ఈ రెండు స్థానాల్లో అధికారుల తీరుపైన ఫిర్యాదు చేసామ‌ని..న్యాయ స్థానం ద్వారా పోరాటం చేస్తామ‌ని వైసీపీ నేత‌లు ప్ర‌క‌టించారు. దీంతో..ఇప్పుడు ఈ రెండు స్థానాల అంశం కోర్టు ప‌రిధిలోకి వెళ్తే..తీర్పు ఏ ర‌కంగా ఉంటుందో అనే ఉత్కంఠ క‌నిపిస్తోంది.

English summary
YCP won 22 loksabha seats in AP out of 25 seats. But, YCP decided to Fight in court against Guntur and Srikakulam returning officers attitude to wards result announcement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X