• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ ముగ్గురి ఎన్నిక చెల్ల‌దు..టీడీపీ ఎమ్మెల్యేలకు క‌ష్ట‌కాలం: రుజువైతే ఆ మూడు వైసీపీ ఖాతాలోకే..!

|

టీడీపీ ఎమ్మెల్యేల‌కు క‌ష్ట‌కాలం ఏర్ప‌డింది. 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుండి గెల‌వ‌గా..అందులో ఇప్పుడు ముగ్గురి వ్య‌వ‌హారం కోర్టుకు చేరింది. తాజా ఎన్నిక‌ల్లో గెలిచిన ముగ్గురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా

ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్‌లు సమర్పించారంటూ ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప.. కరణం బలరామ కృష్ణమూర్తి,..మద్దాలి గిరిధర్‌రావులపై వైసీపీ నాయకులు వేర్వేరుగా హైకోర్టులో ఫిర్యాదులు చేశారు. వారి ఎన్నికను రద్దు చేయాలని కోరారు. దంతో..ఇప్పుడు కోర్టు ఏం చెబుతుంద‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.

రాజ‌ప్ప కేసు వివ‌రాలు దాచిపెట్టారు..

రాజ‌ప్ప కేసు వివ‌రాలు దాచిపెట్టారు..

తాజా ఎన్నిక‌ల్లో మాజీ హోం మంత్రి తూర్పుగోదావ‌రి జిల్లా పెద్దాపురం నుండి పోటీ చేసారు. ఆయ‌న ఎన్నిక‌ల అఫిడ‌వి ట్‌లో త‌ప్పుడు వివ‌రాలు స‌మ‌ర్పించార‌ని ఆయ‌న‌పైన వైసీపీ నుండి పోటీ చేసిన తోట గీత హైకోర్టును ఆశ్ర‌యించారు. రాజ‌ప్ప త‌న మీద ఉన్న క్రిమిన‌ల్ కేసు వివ‌రాల‌న..ఆదాయ న‌వ‌రుల‌ను పూర్తిగా ప్ర‌స్తావించ‌లేద‌ని గీత ఆరోపించారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీపై దాడి కేసులో ఆయ‌న 15వ నిందితుడిగా ఉన్నార‌ని కోర్టులో ఆధారాలు స‌మ‌ర్పించారు . మాజీ ఎమ్మెల్సీగా పెన్ష‌న్ పొందుతున్న విష‌యాన్ని సైతం దాచి పెట్టార‌ని వివ‌రించారు. ఎన్నిక‌ల నిబంధ‌నల‌కు వి రుద్దంగా అఫిడ‌విట్‌లో త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని..ఆయ‌న ఎన్నిక ర‌ద్దు చేస్తూ అన‌ర్హ‌త వేటు వేయాలంటూ హైకో ర్టులో గీత పిటీష‌న్ దాఖ‌లు చేసారు. అయితే, రాజ‌ప్ప త‌న మీద క‌క్ష్య పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు.

క‌ర‌ణం..భార్య పేరు- వివ‌రాలు దాచారు..

క‌ర‌ణం..భార్య పేరు- వివ‌రాలు దాచారు..

టీడీపీ సీనియ‌ర్ నేత..ప్ర‌కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌లారం మీద కేసు న‌మోదైంది. బ‌ల‌రామ‌కృష్ణ మూర్తి

నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఎన్నిక‌ల అఫిడ‌విట్ దాఖ‌లు చేయ‌లేద‌ని ఆయ‌న మీద వైసీపీ అభ్య‌ర్దిగా పోటీ చేసిన ఆమంచి కృష్ణ మోమ‌న్ కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేసారు. బ‌ల‌రాం ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో త‌న భార్య‌గా స‌ర‌స్వ‌తి పేరు చూపంచారు త‌ప్ప ప్ర‌సూన పేరును ప్ర‌స్తావించ‌లేద‌ని పేర్కొన్నారు. ప్ర‌సూన‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఫారం-26 లో పేర్కొన‌లేద‌ని త‌న పిటీష‌న్‌లో వివ‌రించారు. ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఎన్నిక‌ల సంఘాన్ని త‌ప్పు దోవ ప‌ట్టించార‌ని పేర్కొన్నారు. వారికి ఓ కుమార్తె ఉందని.. విద్యా ధ్రువీకరణ పత్రాల్లో తండ్రిగా కరణం బలరామ కృష్ణమూర్తి అలియాస్‌ కేబీఆర్‌కే మూర్తి పేరుందన్నారు. అధికారుల‌కు ఫిర్యాదు చేసినా వారు బ‌ల‌రాంకు మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రించార‌ని.. దీంతో బ‌ల‌రాం ఎన్నిక‌ను ర‌ద్దు చేసి..త‌నను విజేత‌గా ప్ర‌క‌టించాల‌ని ఆమంచి కృష్ణ‌మోహ‌న్ కోర్టును అభ్య‌ర్దించారు.

టీడీపీ ఎమ్మెల్యే రుణాలు ఎగ‌వేశారు..

టీడీపీ ఎమ్మెల్యే రుణాలు ఎగ‌వేశారు..

మ‌రో టీడీపీ ఎమ్మెల్యే మీద కేసు దాఖ‌లైంది. గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుండి గెలిచిన టీడీపీ అభ్య‌ర్ది మ‌ద్దాళి గిరిధ‌ర్ వివిధ పేర్ల‌తో బ్యాంకుల్లో రుణాలు తీసుకొని మోసం చేసార‌ని..ఈ విష‌యాన్ని ఎన్నిక‌ల సంఘానికి తెలియ‌కుం డా దాచిపెట్టార‌ని ఆయ‌న మీద పోటీ చేసిన వైసీపీ అభ్య‌ర్ది చంద్ర‌గిరి యేసుర‌త్నం హైకోర్టును ఆశ్ర‌యించారు. రుణ వివ‌రాల‌ను దాచి పెట్టి ఆయ‌న ఎన్నిక‌ల సంఘాన్నిత‌ప్పుదోవ ప‌ట్టించినందుకు ఆయ‌న ఎన్నిక చెల్ల‌ద‌ని ప్ర‌క‌టించాల ని యేసురత్నం కోరారు. నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 4040 పోస్టల్ బ్యాలెట్లు వ‌స్తే అందులో 312 మాత్ర‌మే చెల్లిన‌ట్లు ఆర్వో ప్ర‌క‌టించారు. ఎన్నికల విధుల్లో జ‌రిగిన గంద‌ర‌గోళం కార‌ణంగా ఆఖ‌రి నిమిషంలో విధుల‌కు వెళ్లిన ప్ర‌భుత్వ టీచ‌ర్లు ఓటు హ‌క్కును ఉప‌యోగించుకోలేక‌పోయార‌ని యేసురత్నం చెబుతున్నారు. ఇక‌, ఇప్పుడు ఈ మూడు పిటీష‌న్ల పైన హైకోర్టు ఇవ్వ‌బోయే నిర్ణ‌యం కీల‌కం కానుంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్దులు మాత్రం ఆ ముగ్గురి పైన అన‌ర్హ‌త వేటు ఖాయ‌మ‌ని..తాము కాబోయే ఎమ్మెల్యేల‌మ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

English summary
YCP defeated three MLA Candidates filed petitions on TDP MLA's who won in Elections. Three MLA's did not disclose their full details in elections Affidavit. They asked court to disqualify them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X