వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివేకా హ‌త్య‌లో అత‌డిమీదే అనుమానాలు : సిబిఐ విచార‌ణ‌కు వైసిపి డిమాండ్ : జ‌గ‌న్ నివాళి ..!

|
Google Oneindia TeluguNews

వైయ‌స వివేకానంద‌రెడ్డి హ‌త్య పై పలు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. రాజ‌కీయంగానూ టిడిపి- వైసిపి మ‌ధ్య ఆరోప‌ణ‌లు తీవ్ర స్థాయికి వెళ్తున్నాయి. వివేకా హ‌త్య పై సిట్ కాదని..సిబిఐ విచార‌ణ చేయించాల‌ని వైసిపి డిమాండ్ చేస్తోంది. అస‌లు గుండెపోటుతో మ‌ర‌ణించార‌ని ఎలా చెప్పార‌ని టిడిపి ప్ర‌శ్నిస్తోంది. ఇదే స‌మ‌యంలో హ‌త్య లో రాజా రెడ్డి హ‌త్య కేసులో నిందుడైన ఓ వ్య‌క్తి మీద అనుమానాలు మొద‌ల‌య్యాయి.

వివేకాది స‌హ‌జ మ‌ర‌ణం కాదా: ర‌క్త‌పు మ‌డుగులో మృత‌దేహం: పోలీసుల‌కు ఫిర్యాదు..!వివేకాది స‌హ‌జ మ‌ర‌ణం కాదా: ర‌క్త‌పు మ‌డుగులో మృత‌దేహం: పోలీసుల‌కు ఫిర్యాదు..!

రాజారెడ్డి హత్య‌..వివేకా హ‌త్య‌కు లింకు ఉందా..

రాజారెడ్డి హత్య‌..వివేకా హ‌త్య‌కు లింకు ఉందా..

వైఎస్ వివేకానందరెడ్డి అనుమానస్పద మృతి తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే వైఎస్ వివేకాది హత్యే నని పోలీసులు తేల్చిచెప్పారు. మరోవైపు నిందితులెవరన్న దానిపై పోలీసులు, సిట్ బృందం లోతుగా దర్యాప్తు జరుపు తోంది. ఆ కేసులో నమ్మలేని నిజాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. వివేకాది హ‌త్యేన‌ని పోస్టు మార్టం అనంత‌రం పోలీసులు ప్ర‌క‌టించారు. ఆయ‌న శ‌రీరం పై ఏడు క‌త్తి పోట్లు, మెడ మీద‌, చేతి మీద కత్తి పోట్లు ఉన్న‌ట్లుగా గుర్తించారు. దీని పై ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం సిట్ వేసింది. విజ‌య‌వాడ నుండి ప్ర‌త్యేక బృందాల‌ను పంపారు. అయితే, గ‌తంలో జ‌రిగిన రాజారెడ్డి హ‌త్య‌..ఇప్పుడు వివేకా హ‌త్య‌కు లింకు ఉందా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. రాజారెడ్డి హ‌త్య కేసులో సుధాక‌ర రెడ్డి అనే వ్య‌క్తి జైలు శిక్ష అనుభ‌వించాడు. మూడు నెలల కింద సత్ప్రవర్తన కింద కడప సెంట్ర ల్‌ జైలు నుంచి సుధాకర్‌రెడ్డి విడుదలయ్యాడు. ఇప్పుడు వివేకా హ‌త్య‌లోనూ అత‌ని పాత్ర పై అనుమానాలు మొద‌ల య్యాయి. ఈ కోణంలోనూ పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

టిడిపి..వైసిపి రాజ‌కీయ ర‌గ‌డ‌..

టిడిపి..వైసిపి రాజ‌కీయ ర‌గ‌డ‌..

ఇదిలా ఉంటే.. ఈ విషయంలో వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. వివేకా హత్యపై అనుమానాలు ఉన్నాయన్నారు. వివేకానంద రెడ్డి రక్తపు మడుగులో పడి ఉంటే..పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఆస్పత్రికి ఎందుకు తరలించారని ప్ర‌శ్నించా రు. రక్తపు మరకల్ని కడిగేశారని.. హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరిస్తున్నారని నిల‌దీసారు. బాబాయ్‌ చనిపోతే జగన్‌ ఎందుకు స్పందించలేదని జ‌గ‌న్ ను ప్ర‌శ్నించారు. వైఎస్‌ సీఎంగా వివేకా, జగన్‌కు ఉన్నప్పుడే కడప ఎంపీ సీటు కోసం ఘర్షణ జరిగింది నిజంకాదా... ఎంపీ పదవి నుంచి వివేకాను తొలగించాలని ఒత్తిడి తెచ్చింది నిజంకాదా..అని బుద్ధా వెంకన్న ప్ర‌శ్నించారు..

పులివెందుల చేరుకున్న జ‌గ‌న్..

వివేకానంద‌రెడ్డి హ‌త్య పై సిబిఐ విచార‌ణ చేయాల‌ని వైసిపి డిమాండ్ చేస్తోంది. వైసిపి అధినేత జ‌గ‌న్ పులివెందుల చేరుకున్నారు. వెంట‌నే వివేకానంద‌రెడ్డి పార్దివ దేహాన్ని సంద‌ర్శించి నివాళులు అర్పించారు. ఘ‌ట‌న జ‌రిగిన విష‌యా ల‌ను అడిగి తెలుసుకున్నారు. దీనికి ముందు వైసిపి నేత‌లు క‌డ‌ప లోక్‌స‌భ సీటు గెలుస్తామ‌ని..పులివెందుల లో గెలు స్తామ‌ని చెబుతున్న టిడిపి నేత‌ల పై వైసిపి ఆరోప‌ణ‌లు చేస్తోంది. మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి లక్ష్యంగా వైసిపి ఆరోప ణ‌లు గుప్పిస్తోంది.

English summary
YS Jagan pay tributes to YS Vivekananda Reddy in Pulivendula. YCP Demanding CBI enquiry on this murder case. Politically this issue creating more heat in politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X