వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స‌ర్వేల పై చంద్ర‌బాబు సీరియ‌స్ కామెంట్లు : జ‌గ‌న్ కు అది అల‌వాటే : 2014 లో ఏమైందంటే..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

2019 Elections National Survey : CM Chandra babu Naidu Talks baout National Survey | Oneindia Telugu

జాతీయ మీడియా వెల్ల‌డించిన స‌ర్వేల పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కీల‌క కామెంట్లు చేసారు. 2014 ఎన్నిక‌ల స‌మ యం లో ఏం చేసారో గుర్తు చేసారు. జగన్ అహంభావం భరించలేకే అనేక మంది వైకాపాకు దూరమవుతున్నారని సీఎం చంద్ర బాబునాయుడు అన్నారు. ఏపీకి న్యాయం చేయాలని దేశం మొత్తం కోరిందని అయితే వైసీపీ, బీజేపీకి బాధ్యత లేదని..వారికి ప్రజలు బుద్ధిచెబుతారని అన్నారు.

 దొంగ స‌ర్వేలు అల‌వాటే..

దొంగ స‌ర్వేలు అల‌వాటే..

కొన్ని జాతీయ ఛాన‌ళ్లు ఏపిలో వైసిపికి 19 లోక్‌స‌భ సీట్లు వ‌స్తాయంటూ విడుద‌ల చేసిస స‌ర్వేల పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. సానుకూల నాయకత్వానికి తెదేపా.. ప్రతికూల నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు దొంగ సర్వేలు జగన్‌కు అలవాటేనని.. ఆ సర్వే లతో ప్రజాదరణను తారుమారు చేయలేరన్నారు.

తెదేపా ఘన విజయం

తెదేపా ఘన విజయం

2014 ఎన్నికల ముందు కూడా ఇదేవిధంగా తప్పుడు సర్వేలు చేశా రని, ఫలితాల్లో తెదేపా ఘన విజయం సాధించిన విషయం గుర్తుచేశారు. ప్రజాభిమానాన్ని తెదేపాకి దూరం చేయడం అసాధ్యమన్నారు. డబ్బుతో దేనినైనా కొంటాననేది జగన్ అహంభావమని సీఎం ధ్వజమెత్తారు. జగన్ అహంభావం భరించలేకే వైసీపీకి నేతలు దూరం అవుతున్నారని తెలిపారు.

మోదీకి ఇంటికి పోయే టైమ్ వ‌చ్చింది..

మోదీకి ఇంటికి పోయే టైమ్ వ‌చ్చింది..

ప్రధాని మోదీ ఇంటికి పోయే టైమ్ వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సేవ్‌ ఇండియా, సేవ్ డెమోక్రసీ నినాదం మార్మోగుతోందన్నారు. ప్రజా వ్యతిరేక పాలనను దేశం భరించదని వ్యాఖ్యానించారు. రైతులు, మహి ళలు, యువత బీజేపీ, వైసీపీకి దూరంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ, దాని కీలుబొమ్మ పార్టీలకు ఓటమి తప్ప దని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు కలిసికట్టుగా ముందుకు పోవాలని సూచించారు. ఐదేళ్లలో చేసింది గొప్ప చరిత్ర అని, రాబోయే ఐదేళ్లలో చేసేది మరో చరిత్ర అని చెప్పారు. ఇంతకు రెట్టింపు రాష్ట్రాభివృద్ధి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

English summary
AP CM Chandra Babu key comments on surveys which favour to Jagan. He says in 2014 also surveys given in favour of Jagan and actual madate for TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X