వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిఘా బాస్ పై ఫోన్ ట్యాపింగ్ కేసు..హైకోర్టు లో పిటీష‌న్‌ : డిజిపి ని మార్చాలి : వైసిపి డిమాండ్..!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల సంఘం పోలీసు అధికారుల పై తీసుకున్న నిర్ణ‌యం పై టిడిపి మండి ప‌డుతున్న స‌మ‌యంలోనే..వైసిపి నేత‌లు మ‌రో నిర్ణయం తీసుకున్నారు. వైసిపి నేత‌ల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ హైకోర్టులో లంచ్ మోష‌న్ పిటిష న్ దాఖ‌లు చేసారు. ఇక‌, డిజిపి ని కూడా మార్చాల‌ని వైసిపి డిమాండ్ చేస్తోంది.

టిడిపి గగ్గోలు ఎందుకు..

టిడిపి గగ్గోలు ఎందుకు..

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఏపి లోని పోలీసు అధికారుల పై చ‌ర్య‌లు తీసుకోవ‌టం పై టిడిపి ఎందుకు గగ్గోలు పెడుతుం దో అర్దం కావ‌టం లేద‌ని వైసిపి ప్ర‌శ్నిస్తోంది. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరుకుందని, సొంత ప్రయోజనాల కోసం ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను వాడుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను కూడా పక్కన పెట్టాలని తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఇదే విషయంపై మరోసారి ఈసీని కలవబోతున్నట్లు ఆయన తెలిపారు. ఇంటెలిజెన్స్‌ శాఖ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారి సమాచారా న్ని సేకరిస్తోందని, మరోవైపు వైఎస్సార్ సీపీ నేతల ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారని రామకృష్ణారెడ్డి అన్నారు.

అధికారులు కొమ్ము కాస్తున్నారు..

అధికారులు కొమ్ము కాస్తున్నారు..

చంద్రబాబు తప్పుడు పనులకు డీజీపీ, ఏబీ వెంకటేశ్వరరావు కొమ్ము కాస్తున్నారన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల వెను క ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పాత్ర ఉందని, చీకటి చక్రవర్తి తయారు చేసినట్లు ఇప్పుడున్న ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ తయారైంద న్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని, ఇందుకోసం 20మంది హ్యాకర్లను నియమిం చుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర‍్కొన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు విదేశాలకు వెళ్లి మరీ ప్రత్యేక టెక్నాలజీని తీసుకొచ్చారన్నారు. వ్యక్తుల ప్రయివేట్‌ జీవితాల్లోకి చొరబడుతున్నారని ఆయన మండిప్డడారు. అన్ని ఆధారాలతో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిశామని, టీడీపీ వాదనలో ఎలాంటి హేతుబద‍్ధత లేదన్నారు. కోర్టులో టీడీపీ వాదనలు నిలబడవని చెప్పుకొచ్చారు.

ఫోన్ ట్యాపింగ్ పై కేసు..

ఫోన్ ట్యాపింగ్ పై కేసు..

ప్రతిపక్షనేత జగన్ తో పాటు పార్టీకి చెందిన పలువురు నేతల ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారంటూ పార్టీ నేత సజ్జల రామ కృష్ణారెడ్డి, 13మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఇవాళ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌లో కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, డీజీపీ, ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, కౌంటర్‌ ఇంజెలిజెన్స్‌ ఎస్పీ భాస్కర్‌ భూషన్ తో పాటు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ప్రతివాదులుగా చేర్చారు. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలు సమ ర్పించారు. ఒక వైపు పోలీసు అధికారుల పై ఎన్నిక‌ల సంఘం నిర్ణయం తీసుకోవ‌టం పై అధికార పార్టీ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న స‌మ‌యంలో తాజాగా ఈ కేసు చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.

English summary
YCP filed lunch motion petition on party leaders phone tapping in AP high court. YCP leader Sajjala Rama Krishna Reddy filed this case against AB Venkateswara rao and another officer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X