చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

"జబర్దస్త్"కు రోజా జలక్ ఇస్తారా..? జగనే రోజాకు హ్యాండిస్తారా..?

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు జ‌గ‌న్ ఎటువంటి ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్నారు. ఈ నెల‌8న జ‌ర‌గే కేబినెట్ విస్త‌ర‌ణ‌లో రోజాకు అవ‌కాశం ద‌క్కుతుందా. ఇప్పుడు రోజా గురించి ఇదే విష‌యం పైన ఆస‌క్తి క‌ర చ‌ర్చ సాగుతోంది. రోజాకు స్పీక‌ర్ ప‌ద‌వి ఇస్తారంటూ జోరుగా ప్ర‌చారం సాగుతోంది. అయితే, అస‌లు రోజా విష‌యంలో జ‌గ‌న్ అంచ‌నాలు ఏంటి. ఎటువంటి ప‌ద‌వి క‌ట్ట‌బెడ‌తారు. రోజా ఆశిస్తున్న‌ది ఏంటి. రోజాకు మంత్రి ప‌ద‌వి అడ్డుకుంటుందెవ‌రు...

సీఎం జ‌గ‌న్ ప‌క్క‌చూపులు చూస్తారా : తప్పెవ‌రిది..అధికారులదా..పార్టీ నేత‌లదా: ఏంటీ నిర్ల‌క్ష్యం..!సీఎం జ‌గ‌న్ ప‌క్క‌చూపులు చూస్తారా : తప్పెవ‌రిది..అధికారులదా..పార్టీ నేత‌లదా: ఏంటీ నిర్ల‌క్ష్యం..!

రోజాకు మంత్రి ప‌ద‌వి ద‌క్కేనా..

రోజాకు మంత్రి ప‌ద‌వి ద‌క్కేనా..

వైసీపీ సీనియ‌ర్ నేత రోజా వ‌రుస‌గా రెండో సారి న‌గ‌రి నుండి గెలుపొందారు. రోజా గెలిస్తే జ‌గ‌న్ అధికారంలోకి రారానే ప్ర‌చారం త‌ప్ప‌ని త‌న విజ‌యం ద్వారా రోజా నిరూపించారు. ఇక‌, ఇప్పుడు ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం పూర్త‌యింది. ఈ నెల 8న కేబినెట్ ఏర్పాటు చేయ‌బోతున్నారు. చిత్తూరు జిల్లా నుండి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రోజాకు ఆ జిల్లాలో మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్న వారిలో సీనియ‌ర్ నేత పెద్దిరెడ్డి రామ‌చంద్ర‌రెడ్డి..భూమ‌న క‌రుణాక‌ర రెడ్డి ఉన్నారు. వీరిద్ద‌రూ రోజా సామాజిక వ‌ర్గ‌మే కావ‌టంతో వీరిలో ఎవ‌రికి ప్రాతినిధ్యం ద‌క్కుతుంద‌నే ఆస‌క్తి కరంగా మారుతోంది. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి ప‌ద‌వి ఖాయం. ఇక‌, మిగిలిన ఇద్ద‌రు రోజా..భూమ‌న క‌రుణాక‌ర రెడ్డి ఇద్ద‌రూ మంత్రి ప‌ద‌వి కోసం పోటీలో ఉన్నారు. అయితే, రోజాకు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని అభిమానులు చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో..చిత్తూరు జిల్లాలో వైసీపీ 13 సీట్లు గెల‌వ‌టంతో ఎస్సీ వ‌ర్గానికి చెందిన నేత‌లు పోటీ ప‌డుతున్నారు.

2

జిల్లాలో ఉన్న స‌మీక‌ర‌ణాల దృష్ట్యా మంత్రి ప‌ద‌వి సాధ్యం కాకుంటే మ‌హిళా స్పీక‌ర్‌గా అవ‌కాశం ఇస్తార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. గ‌తంలో వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో కాల్ మ‌నీ అంశం పైన చ‌ర్చ జ‌రుగుతుండ‌గా రోజాను ఏక‌ప‌క్షంగా ఏడాది పాటు శాస‌న‌స‌భ‌ను బ‌హిష్క‌రించారు. రోజా వివ‌ర‌ణ‌కు అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఆ త‌రువాత కోర్టు ఆదేశించినా..శాస‌న‌స‌భ ఆ ఆదేశాల‌ను తాము అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ప‌క్క‌న పెట్టేసింది. ఏడాది పూర్త‌యినా.. రోజా స‌భ‌లోకి వెళ్ల‌లేక పోయారు. దీంతో..త‌మ పార్టీకి చెందిన మ‌హిళా నేత‌ను ఎక్క‌డైతే అవ‌మానించారో అక్క‌డే గౌర‌వం ఇవ్వాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ని చెబుతున్నారు. ఏ పార్టీ అధినేత ఆదేశాల మేర‌కు నాడు నిర్ణ‌యం తీసుకున్నారో..అదే నేత ఇప్పుడు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉండ‌నున్నారు. ఆయ‌న‌తో రోజాను అధ్య‌క్షా అని పిలిపించాల‌నేది జ‌గ‌న్ ఆలోచ‌న‌గా చెబుతున్నారు. అయితే, రోజా మాత్రం స్పీక‌ర్ ప‌ద‌వి వస్తే..తాను క్రియాశీల‌క రాజ‌కీయాల‌కు దూరం అవుతాన‌నే ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మంత్రి కాకుంటే స్పీక‌ర్‌ను చేస్తారా..

జ‌గ‌న్ ఆలోచ‌న ఏంటి...

జ‌గ‌న్ ఆలోచ‌న ఏంటి...

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న కేబినెట్‌లో మ‌హిళ‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని భావిస్తున్నారు. అందులో ప్ర‌ధానంగా ఎస్సీ - ఎస్టీ మ‌హిళ‌ల‌కు కీల‌క ప‌ద‌వులు ఇవ్వాల‌నే ఆలోచ‌న చేస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీనిలో భాగంగా రోజాకు స్పీక‌ర్ ప‌ద‌వి ఇస్తే..పార్టీ బ‌ల‌మైన వాయిస్ ఉండే రోజాను మిస్ చేసుకున్న‌ట్లేన‌నే అభిప్రాయం ఉంది. రోజా..అంబటి రాంబాబు..అనిల్..కొడాలి నాని..క‌రుణాక‌ర రెడ్డి..పార్ద సార‌ధి లాంటి వారిని స‌భ‌లో టీడీపీ మీద సంద‌ర్భానుసారం ప్ర‌యోగించాల‌ని వైసీపీ అధినేత భావిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఖ‌చ్చితంగా ముగ్గురు మ‌హిళ‌ల‌కు మంత్రి ప‌ద‌వులు ద‌క్కే ఛాన్స్ ఉంది. అందులో ఒక‌రు ఎస్సీ..మ‌రొక‌రు ఎస్టీ..ఒక‌రు జ‌న‌ర‌ల్ కేట‌గిరీకి చెందిన వారు ఉండ‌నున్నారు. దీంతో..రోజాకు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మని చెబుతున్నారు. అయితే, రోజా మాత్రం త‌కు ప‌ద‌వి వ‌చ్చినా..రాకున్నా జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి గా ఉండాల‌నే త‌న కోరిక నెర‌వేరింద‌ని..అది చాల‌ని చెబుతున్నారు.

English summary
YCP Fire brand Roja will get chance in Jagan cabinet or not. Now this discussion is in AP Political circles. Some leaders expecting Speaker post for Roja. But Roaj says she will be stick on Jagan decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X