వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ హయాంలోని పథకాలన్నీ రద్దు .. నవరత్నాలే టార్గెట్ అన్న మంత్రి బుగ్గన

|
Google Oneindia TeluguNews

ఏపీలో నవరత్నాల అమలే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి . ఇక ఈ నేపధ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అద్భుతమైన బడ్జెట్ అందించబోతున్నట్లు స్పష్టం చేశారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు త్వరలో మంచి బడ్జెట్ అందిస్తామని రూ.2లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు.

Recommended Video

వై.కా.పా ఓట్ల లెక్కింపు శిక్షణా తరగతులు
టీడీపీ హయాంలో అమలైన పథకాల రద్దు .. నవరత్నాలే లక్ష్యంగా వైసీపీ

టీడీపీ హయాంలో అమలైన పథకాల రద్దు .. నవరత్నాలే లక్ష్యంగా వైసీపీ

అన్ని సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత కల్పిస్తానని హమీ ఇచ్చారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అమలైన పథకాలను తమ ప్రభుత్వం రద్దు చేస్తుందని తెలిపారు. దీంతో టీడీపీకి మరో షాక్ ఇచ్చినట్టేనని అర్ధం అవుతుంది. ఇక ఎన్నికల సమయంలో ప్రజల్లో విరివిగా ప్రచారం చేసిన నవరత్నాలపై దృష్టి పెట్టనున్నట్టు ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి నవరత్నాల అమలు చాలా ముఖ్యమన్నారు. వాటి అమలుకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. రాష్ట్రానికి ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తున్నామని తెలిపారు పదహారు వేల కోట్ల రెవెన్యూ లోటు ఉందని గత ప్రభుత్వం సృష్టించిన కథేనని చెప్పిన ఆయన ప్రజలకు లాభం చేకూర్చే బడ్జెట్ త్వరలో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.

మద్య నిషేధంపై వెనక్కు తగ్గేది లేదన్న ఆర్ధిక మంత్రి బుగ్గన

మద్య నిషేధంపై వెనక్కు తగ్గేది లేదన్న ఆర్ధిక మంత్రి బుగ్గన

ఇక మద్య నిషేధం అశంలో వైసీపీ ప్రభుత్వం రాజీపడబోదని తేల్చి చెప్పారు . ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, మద్యానికి ఖర్చు చేసే డబ్బు ఇతర అంశాలకు ఖర్చు చేస్తామన్నారు. మద్యపాన నిషేధం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూలై 10 నుంచి ప్రారంభం కాబోతున్నాయి . జూలై 12న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు .

కేంద్రం నుండి రావాల్సిన నిధులు ఇవ్వాలని కోరిన మంత్రి

కేంద్రం నుండి రావాల్సిన నిధులు ఇవ్వాలని కోరిన మంత్రి

ఇక అంతేకాదు కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేకంగా చూడాలని , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు మంత్రి బుగ్గన . రాష్ట్ర విభజన సమస్యలు, రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం పూర్తి చేయడానికి నిధులను ఇవ్వాలని ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన కోరారు . ఏపీకి కేంద్రం నుంచి రావల్సిన నిధులను ముందస్తు బడ్జెట్ సన్నాహక సమావేశంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్ళిన బుగ్గన ఏపీకి రావాల్సిన నిధుల విడుదల చెయ్యాలని కోరారు.

English summary
Finance Minister Buggana Rajendranath Reddy made it clear that the YCP government is working towards the implementation of Navaratnaalu in AP. "It is in this context that Andhra Pradesh is providing a wonderful budget for the people of the state," said AP Finance Minister Buggana Rajendranath Reddy.If the people of the state have patience for two weeks, a good budget will be introduced with Rs 2 lakh crore, ”he said. He promised to prioritize all welfare schemes. However, minister said that they are going to abolish the schemes implemented in the period of Telugu Desam Government. This would give the TDP another shock
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X