వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రాహ్మణులకు వైసీపీ సర్కార్ పథకాలు .. పేద బ్రాహ్మణులకు వరాలు

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు సంక్షేమ పథకాలను అందించే విషయంలో మాత్రం దూకుడు చూపిస్తుంది. అన్ని సామాజిక వర్గాలకు ఆర్ధిక భరోసా అందించాలి అన్న ఉద్దేశంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమానికే పెద్ద పీట వేస్తున్నారు . అందులో భాగంగా అన్ని సామాజిక వర్గాలకు ఆర్ధిక చేయూత నిస్తున్నారు. తాజాగా బ్రాహ్మణుల విషయంలో కూడా ఆయన వరాల జల్లు కురిపించారు.

ఏపీ సర్కార్ మరో ముందడుగు: మొన్న గ్రామ సచివాలయాలు..నేడు గ్రామ న్యాయాలయాలుఏపీ సర్కార్ మరో ముందడుగు: మొన్న గ్రామ సచివాలయాలు..నేడు గ్రామ న్యాయాలయాలు

బ్రాహ్మణులకు ఏపీ సర్కార్ ఆర్ధిక చేయూత

బ్రాహ్మణులకు ఏపీ సర్కార్ ఆర్ధిక చేయూత

కాపు నేస్తం పథకం ద్వారా కాపు మహిళలకు ఐదేళ్ళ పాటు సంవత్సరానికి 15 వేల రూపాయలు ఆర్ధిక సాయం చేస్తున్న ఏపీ ప్రభుత్వం టైలర్లకు, రజకులకు, నాయీ బ్రహ్మణులకు కూడా 10 వేల రూపాయల ఆర్ధిక సాయం అందించే స్కీమ్లను అందిస్తుంది. సమాజంలోని పలు వెనకబడిన వర్గాలకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ వస్తున్న సీఎం జగన్ ఆటో, టాక్సీ వాలాలకు రూ. 10 వేల చొప్పున సాయం చేశారు. ఇక తాజాగా బ్రాహ్మణుల విషయంలో కూడా సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఉపనయన ఖర్చులు ఇవ్వాలని నిర్ణయం

ఉపనయన ఖర్చులు ఇవ్వాలని నిర్ణయం

ఏపీలోని పేద బ్రహ్మణ కుటుంబాలకు వైసీపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది . ఇకపై ఏడేళ్ల నుంచి పదహారేళ్ల మధ్య వయస్సున్న పేద బ్రాహ్మణ కుటుంబాల్లోని పిల్లలకు ఉపనయన ఖర్చులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకం కింద ఒడుగు చెయ్యటానికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం చెయ్యాలని రంగం సిద్ధం చేసుకోంటోంది. ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్‌ ద్వారా అమలు చెయ్యనున్న ఈ స్కీమ్ కు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే శ్రీకారం చుట్టనున్నారని సమాచారం .

భారతి స్కీమ్ ద్వారా విదేశీ విద్యకు చేయూత

భారతి స్కీమ్ ద్వారా విదేశీ విద్యకు చేయూత

విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే బ్రాహ్మణ యువతకు కూడా "భారతి" స్కీం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించనుంది ఏపీ ప్రభుత్వం.ఈ పథకం కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనుంది. దీనికి సంబంధించిన దరఖాస్తులను బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా స్వీకరిస్తున్నారు. ఫిబ్రవరి 29వ తేదీ వరకు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొంది. అయితే ఏడాదికి రూ.6 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తించనుంది.

Recommended Video

Jagananna Vasathi Deevena : 10 Years Old Student Abhimanyu Excellent Words On YS Jagan | Oneindia
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా పలు సంక్షేమ పథకాలకు ఆర్థిక సహాయం

ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా పలు సంక్షేమ పథకాలకు ఆర్థిక సహాయం

ఇక ఏపీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా రూ.100 కోట్లతో పలు స్కీంలు అమలవుతున్నాయని ప్రభుత్వం చెప్తుంది. 15 వేల మంది బ్రాహ్మణులకు ప్రతి నెలా పింఛను అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక బ్రాహ్మణులకు అందించే వేదవ్యాస, గాయత్రి, కల్యాణమస్తు, గరుడ, భారతి తదితర స్కీంల కింద ఇప్పటి వరకు 22,056 మంది లబ్ధిదారులను గుర్తించామని త్వరలో వారందరికీ ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నట్లు అధికారులు చెప్తున్నారు.

English summary
The YCP government has given good news to poor Brahmin families in AP. It is now decided to pay subsidiary expenses to children of poor Brahmin families aged between seven and sixteen. The sector is preparing a financial assistance of Rs 15,000 to cover the scheme for upanayana event. The scheme, which is being implemented by the Andhra Pradesh Brahmin Welfare Corporation, is expected to roll out from April 1.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X