వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధాని అమరావతి మార్చే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ? బొత్సా వ్యాఖ్యలతో మండిపడుతున్న టీడీపీ !!

|
Google Oneindia TeluguNews

Recommended Video

బొత్సా వ్యాఖ్యలతో మండిపడుతున్న టీడీపీ| YSRCP Govt To Change AP Capital From Amaravati To Donakonda ?

ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి పై బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి సురక్షితం కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వరద ముంపుకు గురయ్యే ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ఎంచుకున్నారో అర్ధం కావట్లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు గతంలో శివరామ కృష్ణ కమిటీ కూడా అదే చెప్పిందని ఆయన పేర్కొన్నారు. దీనిమీద మళ్లీ చర్చించాల్సిన అవసరం ఉందని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అయితే బొత్సా సత్యన్నారాయణ చేసిన వ్యాకహ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఘాటుగా స్పందిస్తున్నారు.

బొత్సా వ్యాఖ్యలు రాజధాని మార్చే కుట్ర తప్ప మరోటి కాదన్న టీడీపీ

బొత్సా వ్యాఖ్యలు రాజధాని మార్చే కుట్ర తప్ప మరోటి కాదన్న టీడీపీ

ఏపీ రాజధాని అమరావతి పై నీలినీడలు అలుముకున్నాయి. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు అమరావతిలో పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. రాజధాని అమరావతి నిర్మాణంలో అవినీతి జరిగిందని వైసిపి సర్కార్ మొదటి నుండి ఆరోపణలు గుప్పిస్తోంది. అమరావతిలో రైతుల వద్ద నుండి భూమి బలవంతంగా లాక్కున్నారని, బినామీల పేర్లతో భూములను టిడిపి నాయకులు కొనుగోలు చేశారని వైసిపి నేతలు ఆరోపించారు. రాజధాని నిర్మాణంలో జరిగిన అవినీతి గుట్టు రట్టు చేసి తీరుతామని చెప్పిన వైసిపి నిర్మాణ పనులు ఎక్కడివక్కడే నిలిపివేసింది. దీంతో రాజధాని నిర్మాణం జరుగుతుందా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే రాజధాని నిర్మాణం విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన టీడీపీ తాజా బొత్సా వ్యాఖ్యలతో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బొత్సా వ్యాఖ్యలు రాజధాని మార్చే కుట్ర తప్ప మరోటి కాదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

బొత్సా వ్యవహారం కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టిన చందంగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసిన వర్ల రామయ్య

బొత్సా వ్యవహారం కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టిన చందంగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసిన వర్ల రామయ్య

ఇక తాజాగా కృష్ణా నది వరదల నేపథ్యంలో రాజధాని ప్రాంతం ముంపుకు గురి అయిందని, రాజధానిగా అమరావతి సురక్షితం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసిపి నేత, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.

అసలే వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజధానిని వేరే ప్రాంతానికి తరలిస్తారు అన్న పుకార్లు షికార్లు చేశాయి. ఇక ఆ పుకార్లకు ఊతం ఇచ్చినట్లుగా బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపాయి. రాజధాని అమరావతి పరిధిలో ముంపు ప్రాంతాలు ఉన్నాయని, వరద ముప్పు నుంచి తప్పించుకోవాలంటే కాలువలు డ్యాములు కట్టాలని, దీంతో నిర్మాణ వ్యయం కూడా రెట్టింపు అవుతుందని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. దీని వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అని చెప్పిన బొత్సా అన్నింటిపైనా ప్రభుత్వంతో చర్చిస్తామని, త్వరలో మా విధానాన్ని ప్రకటిస్తామని పేర్కొన్నారు . బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో అమరావతి తరలిస్తారా అనుమానాలు మరోమారు తెరపైకి వచ్చాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు సైతం రాజధాని విషయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.పైసా ఖర్చు కాకుండా అమరావతిని అభివృద్ధి చేద్దామనుకున్నానని కానీ అమరావతినే తరలించే కుట్ర జరుగుతుందని ఆరోపిస్తున్నారు. ఇక టీడీపీ నేత వర్ల రామయ్య బొత్సా వ్యవహారం కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టిన చందంగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతిని మార్చటం సాధ్యం కానిపని అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏపీలో బొత్సా వ్యాఖ్యల పెను దుమారం .. ఇప్పుడిదే హాట్ టాపిక్

ఏపీలో బొత్సా వ్యాఖ్యల పెను దుమారం .. ఇప్పుడిదే హాట్ టాపిక్

పురపాలక శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి జగన్ అమరావతిలో పర్యటిస్తున్న సమయంలో రాష్ట్ర రాజధాని అమరావతి పై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజలలోనూ చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణం కోసం రుణాలిస్తాం అన్న ప్రపంచ బ్యాంకు ఆ ఆలోచనను విరమించుకుంది. ఇక ఏఐఐబీ కూడా తన రుణ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. పూర్తిగా పనులను సైతం ఆపేసిన జగన్ సర్కార్ , రాజధానిలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరుపుతామని పదే పదే చెప్పింది. కొత్తగా రాజధాని సురక్షిత ప్రాంతం కాదని వరద ముంపుకు గురయ్యే ప్రమాదముందని, దిగువన ఉన్న ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఎలా ఎంచుకున్నారని వైసిపి గత సర్కార్ ను తప్పు పడుతోంది. ప్రస్తుత రాజధాని నిర్మాణంపై బొత్సా చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో పెను దుమారం నెలకొంది.
ఇది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Andhra Pradesh municipal administration minister Botsa Satyanarayana has hinted at moving capital out of Amaravati. In a Press Meet, AP Minister said Amaravati is vulnerable to floods and added that building capital is a costly affair. Reacting over Minister Botsa's comments, TDP has alleged that it is a conspiracy of shifting the capital .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X