విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉగాది నుండి ఏపీలో విశాఖ వేదికగా పాలన ... వైసీపీ సర్కార్ తాజా వ్యూహం ఇదేనా ?

|
Google Oneindia TeluguNews

సీఎం జగన్ పరిపాలనా రాజధానిగా విశాఖను ఏర్పాటు చెయ్యాలని భావించి గత కొంత కాలంగా అడుగులు వేస్తున్నారు. ఇక తాజాగా హైపవర్ కమిటీ నివేదికతో సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మూడు రాజధానుల ఏర్పాటుకు చకచకా పావులు కదిపారు. అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదింపజేసి ఆ తర్వాత శాసనమండలికి పంపిన క్రమంలో , శాసన మండలిలో బిల్లు సెలక్ట్ కమిటీ చేతుల్లోకి వెళ్లడం, మండలి రద్దు కోసం కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం పంపడం వంటి వరుస పరిణామాలు జరిగిపోయాయి. అయినప్పటికీ పట్టు పట్టరాదు ..పట్టి విడువరాదు అన్న చందంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుకే సిద్ధం అవుతున్నారు. అన్నిటికంటే విశాఖ నుండి పాలన సాగించాలని మొండిగా ఉన్నారు.

రాజధాని అమరావతి కోసం ....తెనాలిలో చంద్రబాబు భారీ బహిరంగ సభరాజధాని అమరావతి కోసం ....తెనాలిలో చంద్రబాబు భారీ బహిరంగ సభ

 ఉగాది నుండి విశాఖ కేంద్రంగా కార్యాకలాపాలు సాగించటానికి సిద్దం అవుతున్న సర్కార్

ఉగాది నుండి విశాఖ కేంద్రంగా కార్యాకలాపాలు సాగించటానికి సిద్దం అవుతున్న సర్కార్

ఏపీ సీఎం జగన్ మండలిని రద్దు చేసి పార్లమెంట్ కు తీర్మానం పంపి మండలి రద్దు త్వరిత గతిన జరుగుతుందని భావిస్తున్నారు. అయితే ఒకపక్క వైసీపీ ప్రభుత్వానికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ లెక్క చెయ్యకుండా , తాజా పరిణామాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లేందుకే సీఎం జగన్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆయన ఉగాది నుండి విశాఖ కేంద్రంగా తన కార్యాకలాపాలు సాగించటానికి సిద్దం అవుతున్నట్టు తెలుస్తుంది.

న్యాయ, కార్యనిర్వాహక ప్రక్రియ ద్వారా సమస్య పరిష్కరించాలని భావిస్తున్న సర్కార్

న్యాయ, కార్యనిర్వాహక ప్రక్రియ ద్వారా సమస్య పరిష్కరించాలని భావిస్తున్న సర్కార్

అయితే ఉగాదిలోగా అన్నిసమస్యలు పరిష్కారం అవుతాయని అప్పటిలోగా అన్నీ సెట్ అవుతాయనీ, విశాఖ నుంచీ పాలించేందుకు ఉన్న అభ్యంతరాలన్నీ తొలగిపోతాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఏపీలో మూడు రాజధానుల వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది జగన్ ప్రభుత్వం . ఇక న్యాయ, కార్యనిర్వాహక ప్రక్రియ ద్వారా ఓ కొలిక్కి తీసుకురావాలని భావిస్తున్న జగన్ సర్కారు ఈ మొత్తం వ్యవహారంతో సంబంధం లేకుండానే అనుకున్నది కొనసాగించే పనిలో పడింది.

 విశాఖ నుండి కార్యాకలాపాలు సాగించేందుకు న్యాయ సలహా

విశాఖ నుండి కార్యాకలాపాలు సాగించేందుకు న్యాయ సలహా

ఈ దిశగా రాజ్యాంగంలోని నిబంధనల్ని పరిశీలిస్తున్న న్యాయ విభాగం సలహాలను తీసుకుంటున్న సీఎం జగన్ రాజధానితో సంబంధం లేకుండా ఉగాది నాడు తన కార్యకలాపాలను విశాఖ నుంచి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారని సమాచారం. విశాఖలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంతో పాటు సీఎంవో కోసం ఇప్పటికే తగు భవనాలు గుర్తించారు. ఇక అక్కడ నుండి రాజధాని ఊసు లేకుండా పరిపాలన సాగించాలని సీఎం జగన్ భావిస్తున్నారు.

ఉగాదికి విశాఖ నుండే 25 లక్షల మంది ఇళ్లులేని పేదలకు స్ధలాలు ఇవ్వాలని ఆలోచన

ఉగాదికి విశాఖ నుండే 25 లక్షల మంది ఇళ్లులేని పేదలకు స్ధలాలు ఇవ్వాలని ఆలోచన

ఉగాది సందర్భంగా రాష్ట్రంలో 25 లక్షల మంది ఇళ్లులేని పేదలకు స్ధలాలు ఇవ్వాలని భావిస్తున్న సర్కార్ ఈ కార్యక్రమాన్ని విశాఖ నుండే ప్రారంభించాలని భావిస్తోంది. . ముఖ్యమంత్రి గృహప్రవేశం రోజే ఈ కార్యక్రమం నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోందని తెలుస్తోంది. అంతేకాదు విశాఖలో ఉగాది పంచాంగ శ్రవణం కూడా నిర్వహిస్తారు. ఇక అక్కడకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంతో పాటు సీఎంవోనూ విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Recommended Video

AP 3 Capitals : Visakhapatnam Should Be As Telugu Film Industry Capital Not As Executive Capital
ముకుల్ రోహత్గీ సూచనలతో అడుగులు వేస్తున్న జగన్

ముకుల్ రోహత్గీ సూచనలతో అడుగులు వేస్తున్న జగన్

తాజా శాసనసభ సమావేశాల్లో మాట్లాడిన జగన్ పరిపాలన సాగించటం ఎక్కడ నుండి అయినా చెయ్యొచ్చు అని, రాజధాని అనే పదమే రాజ్యాంగంలో లేదని చెప్పారు. దీని వెనుక ప్రస్తుతం రాజధాని కేసులను వాదించేందుకు ప్రభుత్వం నియమించుకున్న మాజీ అటార్నీ జనరల్, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సూచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే రాష్ట్రంలో రాజధాని మార్పుకు సభలో బిల్లులు ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని కూడా రోహత్గీ ఇచ్చిన సలహాతో జగన్ విశాఖకు తన కార్యాలయం మార్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది .

English summary
AP Chief Minister Jagan has preparing to rule from Visakha. the ycp government, which aims to give 25 lakh homeless people in the state during Ugadi, hopes to launch the program from Visakha. The government seems to be actively considering how the event will be conducted on the day of the chief minister's home warming ceremony. If all goes well, the Ugadi panchangam in Vishakha will be performed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X