వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీలో సీరియస్ నెస్ లేదు, ఏదో మొక్కుబడిలా కనిపిస్తోంది: మల్లిఖార్జున ఖర్గే

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఉన్నట్టు ఎంతమాత్రమూ కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. అవిశ్వాసం విషయంలో ఆ పార్టీది మొక్కుబడిగా కనిపిస్తోందని శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పన విషయంలో మొదటి నుంచి కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనని, తాము అధికారంలోకి వస్తే.. తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే ఉంటుందని తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టంగా చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు.

YCP is not Serious about No Confidence Motion: Mallikarjun Kharge Comments

అన్ని ప్రతిపక్ష పార్టీలనూ సమన్వయం చేసుకునే ఉద్దేశం వైసీపీకి ఉన్నట్లు లేదని, తాము యూపీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చించి, ఈ అవిశ్వాస తీర్మానంపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఖర్గే పేర్కొన్నారు.

మరోవైపు శుక్రవారం ఉదయం చంద్రబాబునాయుడు ఆదేశించినట్టుగానే 16 మంది తెలుగుదేశం సభ్యుల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మాన నోటీసును టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత తోట నరసింహం లోక్‌సభ కార్యదర్శికి కొద్దిసేపటి క్రితమే అందించారు. నోటీసులను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

అనంతరం తోట నరసింహం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌పై, తెలుగుదేశం పార్టీపై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు అవిశ్వాస తీర్మానంపై ఇతర పార్టీల మద్దతు కోసం చర్చిస్తున్నారని కూడా ఆయన చెప్పారు.

English summary
Congress's senior leader, Opposition leader of loksabha Mallikarjun Kharge passed sensational comments in regard of no confidence motion moved by YCP against Central Government here in Delhi on Friday morning. While speaking to media he accused YCP that YCP is not seriously pursuing this no confidence motion it seems. It has not approached the Opposition Party Congress in a proper manner, Even though We the leaders of the congress party will discuss on the YCP's no confidence motion and take a decision, he concluded.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X