ycp leader tdp leaders ycp lokesh chandrababu jagan AP Panchayat elections 2021 ap local body elections panchayat elections nimmagadda ramesh kumar ap government andhra pradesh ys jagan amaravati ramesh kumar ap news వైసిపి లోకేష్ చంద్రబాబు జగన్ పంచాయతీ ఎన్నికలు ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వైయస్ జగన్ అమరావతి
మీ రెండు గాడిదల్ని జగన్ కాస్తున్నారు .. చంద్రబాబు, లోకేష్ లపై వైసీపీ నేత తీవ్ర వ్యాఖ్యలు
టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావాన్ని ప్రకటించిన నారా లోకేష్ 151 మంది ఎమ్మెల్యేలు , 28 మంది ఎంపీలు గాడిదలు కాస్తున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పంచాయతీ ఎన్నికలపై , విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై మీడియాతో మాట్లాడారు.
టీడీపీ పుంజుకుంటే మాయ ,మోసం ,దగాతోనే .. చంద్రబాబుది అంకెల గారడీ : మంత్రి బొత్సా సత్యన్నారాయణ ఫైర్

పంచాయతీ ఎన్నికలలో ఓటమి పాలైన బాధలో తండ్రీకొడుకులు ఉన్నారని ఎద్దేవా
ఈ సందర్భంగా ఆయన పంచాయతీ ఎన్నికలలో ఓటమి పాలైన బాధలో తండ్రీకొడుకులు ఉన్నారని ఎద్దేవా చేశారు. అందుకే వారు ప్రజల తీర్పును గౌరవించలేకపోతున్నారు అంటూ లోకేష్ ,చంద్రబాబులపై వైసిపి నేత లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు . అంతేకాదు లోకేష్ గాడిద వ్యాఖ్యలపై రివర్స్ ఎటాక్ చేశారు. లోకేష్, చంద్రబాబు లాంటి రెండు గాడిదలను సీఎం జగన్ మోహన్ రెడ్డి కాస్తున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు లేళ్ల అప్పిరెడ్డి. 2017లో విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడులు ఉపసంహరణ నిర్ణయం తీసుకుందని, అప్పుడు మీరు ఏ గాడిదలు కాశారు అని ప్రశ్నించారు.

అప్పుడు కేంద్ర మంత్రులుగా మీవాళ్ళు ఇద్దరు ఉండి ఏం చేశారు ?
కేంద్ర మంత్రులుగా ఇద్దరు మీ వాళ్ళు ఉండి కూడా ఏం చేశారు ? అంటూ లేళ్ళ అప్పి రెడ్డి టీడీపీ నేతలను ప్రశ్నించారు. ఎవరో దీక్ష చేస్తుంటే మద్దతు తెలపడం కాదని, విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం లోకేష్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలని లేళ్ల అప్పిరెడ్డి సూచించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశారని, ఇంతవరకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

ఆందోళనకు పిలుపునిచ్చే నైతిక హక్కు టీడీపీకి లేదు: వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి
ఆందోళనకు పిలుపునిచ్చే నైతిక హక్కు టీడీపీకి లేదు అని పేర్కొన్న వైసీపీ నేత లేళ్ళ అప్పిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉక్కు కోసం ఎలాంటి పోరాటానికైనా, త్యాగానికైనా సిద్ధంగా ఉందని ప్రకటించారు . టిడిపి కేవలం రాజకీయాలు చేస్తూ విశాఖ ఉక్కు కోసం మొసలి కన్నీరు కారుస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి విశాఖ ఉక్కు ఉద్యమం వేదికగా టీడీపీ విమర్శలు , దానికి వైసీపీ ప్రతి విమర్శలతో ఏపీ రాజకీయం వేడెక్కుతుంది.