హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముస్లింలకు నాలుగున్నర ఏళ్లుగా పదవులు ఎందుకు ఇవ్వలేదు?:చంద్రబాబుకు వైసిపి నేత ఎండి ఇక్బాల్‌ ప్రశ్న

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:మైనారిటీ నేత ఫరూక్ కు తాజాగా మంత్రి వర్గంలో చోటు కల్పించి సిఎం చంద్రబాబు ముస్లింలను ఉద్దరించినట్లుగా మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత ఎండీ ఇక్బాల్‌ దుయ్యబట్టారు. నిజానికి సిఎం చంద్రబాబు చర్య ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు.

ఆదివారం హైదరాబాద్‌లోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఎండి ఇక్బాల్‌ మీడియాతో మాట్లాడుతూ సిఎం చంద్రబాబు పై విమర్శల వర్షం కురిపించారు. మూన్నాళ్ల ముచ్చట కోసం మైనార్టీకి చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వడం చూస్తే ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయన్నారు. ఇప్పటికీ తాను మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారే తప్ప బీజేపీకి వ్యతిరేకంగా అని చెప్పడం లేదనేది గమనించాలన్నారు.

YCP Leader Md Iqbal Questioned CM Chandrababu on Positions

"ఎపి సిఎం చంద్రబాబు దృష్టిలో ముస్లిం మైనారిటీలంటే ద్వితీయశ్రేణి పౌరులు...వారిపై జులుం ప్రదర్శించడం, వారికి ఏమాత్రం గౌరవం ఇవ్వకపోవడం ఆయన దగ్గర పనిచేసే వాళ్లందరూ నిత్యం చూస్తూనే ఉంటారు...హజ్‌యాత్రకు వెళ్లే వారి దగ్గరకు చంద్రబాబు వెళ్లడం చేయకుండా...వాళ్లనే తన వద్దకు పిలిపించుకుని మాట్లాడటం అనేది సంప్రదాయాలను కాలరాసి అవమానించడమే"...అని ఎండీ ఇక్బాల్‌ చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

అయితే చంద్రబాబు వ్యవహారం ప్రజలు గమనిస్తూనే ఉన్నారని...ఇప్పుడు మీరు మంత్రివర్గంలో తీసుకున్న సామాజికవర్గాలు సైతం...ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టే ఇలా సామాజిక వర్గాల వారి ఓట్ల కోసం చంద్రబాబు ఇలా చేస్తున్నాడని అనుకుంటున్నారని ఇక్బాల్ విమర్శించారు. ఓట్ల రాజకీయం కోసమే ముణ్నాళ్ల ముచ్చటైన మంత్రి పదవులను అప్పగించారనేది వాళ్లకి అర్థమైపోయిందన్నారు. ఒకవైపు తెలంగాణ ఎన్నికలు జరగుతుండటం కూడా పదవుల కేటాయింపుకు మరో కారణం అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానంటూ ఇప్పుడు చంద‍్రబాబు ఇతర పార్టీల వద్దకు పరుగులు తీస్తున్నారని... వాస్తవంగా మాట్లాడితే తాజాగా మంత్రివర్గంలో స్థానం కల్పించిన ఫరూక్, ఇప్పుడు మండలి చైర్మన్‌గా పదవి పొందిన షరీఫ్‌, చాంద్‌ బాషా...వీరిరువురూ గత నాలుగున్నరేళ్లుగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని...మరి ఇప్పటివరకూ వీరికి కేబినెట్‌లో స్థానం ఇవ్వడానికి ఏ పరిస్థితులు అడ్డువచ్చాయని ఇక్బాల్‌ నిలదీశారు. ఈ ప్రశ్నకు చంద‍్రబాబు సమాధానం చెప్పితీరాలన్నారు. ఈ విధమైన చంద్రబాబు చర్యలు ముస్లింల మనోభావాలను దెబ్బతీసేవి కావా?...అని ఇక్బాల్‌ ప్రశ్నించారు.

English summary
Hyderabad: YSRCP leader Iqbal slams CM Chandra Babu of over new appointments of ministers. He blamed that CM Chandrababu's actions is to offend the sentiments of Muslims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X