• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైసీపీ నేత పీవీపీ షాకింగ్ ట్వీట్..లంగా డ్యాన్సులేసే సార్లకు 50 కోట్లు,లాజిక్ తో కొట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

|

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే పివిపి ఇటీవల కాస్త వివాదాలకు దూరంగానే ఉన్నారు. మళ్ళీ తాజాగా వైసీపీ నేత పీవీపీ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనూ,సినీ హీరోల అభిమానుల్లోనూ దుమారం రేపుతుంది. హీరోలను లంగా డాన్సర్లు అంటూ ఆయన చేసిన ట్వీట్ వివాదంగా మారింది.

స్టే బాబు పోరంబోకు బ్యాచ్ , పావలాకు కరోనా వచ్చిందా ? చంద్రబాబు , పవన్ కళ్యాణ్ పై సాయిరెడ్డి విసుర్లు స్టే బాబు పోరంబోకు బ్యాచ్ , పావలాకు కరోనా వచ్చిందా ? చంద్రబాబు , పవన్ కళ్యాణ్ పై సాయిరెడ్డి విసుర్లు

పీవీపీ వివాదాస్పద ట్వీట్ .. వకీల్ సాబ్ ఫ్యాన్స్ కౌంటర్

ఇటీవల పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులు ఎదురైన విషయం తెలిసిందే . ఈ క్రమంలో తాజాగా హీరోలను లంగా డాన్సర్లు అంటూ, వారికి 50 కోట్ల రెమ్యూనరేషన్ అంటూ వైసీపీ నేత పీవీపీ చేసిన ట్వీట్ పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. ఇక అసలు విషయం ఏంటంటే పీవీపీ ఇటీవల జరిగిన ఓ ఘటన వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేసి సినీ హీరోలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు పొట్లూరి వరప్రసాద్ .

ముంబై రైల్వేస్టేషన్లో బాలుడ్ని కాపాడిన ఘటన .. రియల్ హీరో అంటూ పీవీపీ ట్వీట్

ముంబై రైల్వేస్టేషన్లో బాలుడ్ని కాపాడిన ఘటన .. రియల్ హీరో అంటూ పీవీపీ ట్వీట్

ఈనెల 17వ తేదీన సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ముంబైలోని రైల్వేస్టేషన్లో ఒక మహిళ తన కొడుకుతో కలిసి ప్లాట్ ఫామ్ పై నడుస్తున్న క్రమంలో బాలుడు కాలుజారి రైల్వే ట్రాక్ పై పడిపోయాడు . ఇక వేగంగా వస్తున్న రైలు ను చూసిన రైల్వే స్టేషన్లో పనిచేసే మయూర్ షేక్ అనే వ్యక్తి హుటాహుటిన ట్రాక్ పైకి వెళ్లి బాలుడి ప్రాణాలు కాపాడి, అంత ఫాస్ట్ గా తనను తాను రక్షించుకున్నాడు.అత్యంత సాహసోపేతంగా చిన్నారి ప్రాణాలు కాపాడిన మయూర్ షేక్ ను అభినందిస్తూ రైల్వే శాఖ 50 వేల రూపాయల రివార్డు ప్రకటించింది, అంతేకాదు అతనికి సరికొత్త జావా మోటర్ బైక్ ని కూడా గిఫ్ట్ గా అందించింది.

లంగా డాన్స్ లేసే సార్లకు 50 కోట్లు .. రీల్ హీరోలపై షాకింగ్ కామెంట్స్

లంగా డాన్స్ లేసే సార్లకు 50 కోట్లు .. రీల్ హీరోలపై షాకింగ్ కామెంట్స్

ఇక ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన పీవీపీ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. రియల్ హీరో బాబు.. రీల్ హీరో కాదు అంటూ మయూర్ షేక్ వీడియోను పోస్ట్ చేశారు. లంగా డాన్స్ లేసే సార్లకు 50 కోట్లు , ఈ రియల్ హీరో కి జస్ట్ జావా బైక్.. హతవిధీ అంటూ ట్వీట్ చేశారు. మనం చేసే కొంచెం అయినా, కొట్టే సీటీమార్ లైనా ఇలాంటి సూపర్ హీరోస్ కి కొడదాం బ్రదర్స్ అంటూ ట్వీట్ చేశారు.

ఇక సినీ హీరోలను లంగా డాన్స్ లు వేస్తారు అంటూ పీవీపీ చేసిన ట్వీట్ జనసేనాని అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.

 మండిపడిన పవన్ ఫ్యాన్స్ .. ఓ రేంజ్ లో ఇచ్చేశారుగా !!

మండిపడిన పవన్ ఫ్యాన్స్ .. ఓ రేంజ్ లో ఇచ్చేశారుగా !!

అసలే వైసీపీ నాయకులపై భగ్గుమంటున్న పవన్ ఫ్యాన్స్ లంగా డాన్సులు వేసే రీల్ హీరోల చుట్టూ తిరిగి సినిమాలు తీసిన లంగాగాడు పీవీపీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు . సినిమాలు చేసిన హీరోలు మీకు ఈరోజు లంగా గాళ్ళలా కనిపించారా ? ఒకరిని పొగడడం కోసం వృత్తి లో భాగమైన వారిని కించపరచడం వైసిపి నాయకుల చీప్ మెంటాలిటీ అంటూ పవన్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు .ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమా పై వైసిపి నాయకులు అక్కసు వెళ్లగక్కిన వేళ వైసిపి నాయకుడైన పివిపి ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు.

English summary
PVP, who has been in the news with controversial comments, has been a bit out of controversy . Once again, a recent tweet by YCP leader PVP is now causing a stir in the movie industry and among fans of movie heroes. His tweet calling the heroes as Langa dancers became controversial. Pawan Kalyan's fans are incensed over the tweet made by PVP saying 50 crores for langa dancers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X