• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నటనలో బాలయ్యను మించిపోయిన బాబు .. మండిపడిన వైసీపీ నేత రవి చంద్రా రెడ్డి

|

గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు కావటంతో అధికారం పోగొట్టుకుని చావుదెబ్బ తిన్న చంద్రబాబు ఏమాత్రం మారలేదని వైసిపి నేత రవిచంద్రా రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. ఎలా ఓడిపోయారు అన్నది చంద్రబాబుకు నేటికి అర్థం కాకపోవడం విడ్డూరమని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయంలో ఆత్మవంచన చేసుకుంటూ, పరనింద వేస్తున్నారని వైసీపీ నేత రవిచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. నటనలో బాలయ్యను మించిన లెజెండ్ చంద్రబాబని సెటైర్ వేశారు.

చంద్రబాబు పాలిచ్చే ఆవు అన్నందుకు వంద ఆవులు మరణించాయని రవిచంద్రా రెడ్డి వ్యాఖ్యలు

చంద్రబాబు పాలిచ్చే ఆవు అన్నందుకు వంద ఆవులు మరణించాయని రవిచంద్రా రెడ్డి వ్యాఖ్యలు

ఇక చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలపై వైసిపి నేత రవిచంద్రా రెడ్డి సెటైర్లు వేశారు. పాలిచ్చే ఆవును వదిలి తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు అన్న బాబు వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు తనను తాను పాలిచ్చే ఆవుతో పోల్చుకున్నారని, అలా, ఆయన పోల్చుకోగానే దాదాపు వంద ఆవులు మృత్యువాత పడ్డాయని పేర్కొన్న రవిచంద్రారెడ్డి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆవుల సైతం తట్టుకోలేక పోయాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక అంతే కాదు చంద్రబాబు పాలనంతా కరువుకాటకాలు పాలని, ప్రజలు గుక్కెడు నీళ్ల కోసం అలమటించిన రోజులు అని పేర్కొన్న ఆయన చంద్రబాబు పరిపాలించిన అన్ని రోజులు వానలు పడలేదని, కరవు కాటకాలతో ప్రజలు అల్లాడారని అన్నారు.

నాడు వైఎస్.. నేడు జగన్ .. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు సముచిత స్థానం .. రీజన్ ఇదే

చంద్రబాబు హయాంలో ప్రకృతి కూడా కరుణించలేదన్న వైసీపీ నేత

చంద్రబాబు హయాంలో ప్రకృతి కూడా కరుణించలేదన్న వైసీపీ నేత

కానీ జగన్ పరిపాలనలో జలాశయాలు నిండుకుండల్లా మారాయని పది సంవత్సరాల తర్వాత నాగార్జున సాగర్ గేట్లు తెరిచారని, ప్రకాశం బ్యారేజ్ గేట్లు కూడా తెరుచుకోగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోందని అన్నారు. రాష్ట్రమంతా జలకళతో కొత్త శోభ సంతరించుకుందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు తీరుకు ఆయన హయాంలో ప్రకృతి కూడా కరుణించలేదని రవిచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.

గత ఐదేళ్ళ పాలనలో చేసిన తప్పులను తెలుసుకోలేదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజలు వద్దని ఓడించినా ఇంకా ఎందుకు ఓడిపోయామో అర్ధం కాలేదని చంద్రబాబు భలే నాటకాలాడుతున్నారని ఆయన మండిపడ్డారు.

ఓటమికి కారణం తెలీదని బాలయ్యను మించి నటిస్తున్న చంద్రబాబు అని ఎద్దేవా

ఓటమికి కారణం తెలీదని బాలయ్యను మించి నటిస్తున్న చంద్రబాబు అని ఎద్దేవా

ఇక చంద్రబాబు బాలయ్య బాబ ని మించిన గొప్ప నటుడని విమర్శల వర్షం కురిపించారు రవిచంద్రారెడ్డి. మొన్నటి ఎన్నికల్లో ఎలా ఓడిపోయామో తనకు అర్థం కావడం లేదని విచిత్రమైన హావభావాలతో నటిస్తున్నాడని పేర్కొన్నారు. చంద్రబాబు చేస్తున్న ప్రదర్శన సినీనటుడు బాలకృష్ణను మరిపించే విధంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. లెజెండ్ నేను .. బాలకృష్ణ బాబు.. మీరు కాదు. నేను ఎంత బాగా యాక్టు చేస్తానో చూడండి అని చెప్పే విధంగా అద్భుతమైన నటనా చాతుర్యాన్ని చంద్రబాబు ప్రదర్శిస్తున్నారని చెప్పారు వైసిపి నేత రవిచంద్రారెడ్డి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chandrababu, who lost his power after losing the TDP defeat in the last election, has not changed at all, said YCP leader Ravichandra Reddy. Chandrababu today does not understand how he lost, he said. YCP leader Ravichandra Reddy believes that the Telugu Desam Party is chkecking them selves they are keeping allegations on ycp . chandrababu acting like a Legend .. he is dominating balayya .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more