వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీకి షాక్‌: బీజేపీలోకి ఆ నేత జంప్..ఆయ‌నే కార‌ణ‌మా: జ‌గ‌న్‌కు తెలియ‌గానే..అక్క‌డ‌..!

|
Google Oneindia TeluguNews

ఏపీని రాజ‌కీయంగా టార్గెట్ చేసిన బీజేపీ కొత్త ఎత్తుగ‌డ‌లు వేస్తోంది. పైకి టీడీపీ నేత‌లే ల‌క్ష్య‌మ‌ని చెబుతున్నా..వైసీపీ నేత‌ల‌ను త‌మ తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తోంది. అందులో భాగంగా తాజాగా వైసీపీకి చెందిన నేత‌తో తాజాగా బీజేపీలో చేరిన మాజీ టీడీపీ ముఖ్య నేత సంప్ర‌దింపులు చేసారు. ఇక‌, ఆ వైసీపీ నేత బీజేపీలో చేరాల‌ని నిర్ణ‌యించారు. దీని కోం ముహూర్తం సైతం ఖ‌రారు చేసుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీని ద్వారా ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సైతం అప్ర మ‌త్తంగా ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. మరి కొంద‌రు వైసీపీ నేత‌ల‌తోనూ బీజేపీ ట‌చ్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక‌, ఇప్పుడు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఏం చేయ‌బోతున్నారు...

 బీజేపీలోకి వైసీపీ నేత‌...

బీజేపీలోకి వైసీపీ నేత‌...

బీజేపీ టార్గెట్ టీడీపీ మాత్ర‌మే కాదు అనే విష‌యం స్ప‌ష్టం అవుతోంది. అందులో బాగంగా..ఇప్పటి వ‌ర‌కు టీడీపీ నేత‌ల తో మాత్ర‌మే బీజేపీ నేత‌లు ట‌చ్‌లో ఉన్నార‌ని అంద‌రూ భావించారు. అయితే, తాజాగా వైసీపీ నేత‌ల‌తోనూ మంత‌నాలు సాగిస్తున్నారు. అందులో భాగంగా తాజా ఎన్నిక‌ల ముందుగా వైసీపీలో చేరి..ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన తోట వాణి ఇక బీజేపీలో చేర‌టానికి రంగం సిద్ద‌మైంది. వాణి భ‌ర్త తోట న‌ర్సింహం 2014లో కాకినాడ నుండి టీడీపీ ఎంపీగా గెలిచారు. లోక్‌స‌భ‌లో టీడీపీపీ నేత‌గా వ్య‌వ‌హ‌రించారు. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వైసీపీలో చేరారు. తోట వాణికి వైసీపీ అధినేత జ‌గ‌న్ పెద్దాపురం టిక్కెట్ కేటాయించారు. మాజీ హోం మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప చేతితో తోట వాణి ప‌రాజ‌యం పాల‌య్యారు. తాజాగా ఆయ‌న ఎన్నిక మీద హైకోర్టులోనూ వాణి కేసు దాఖ‌లు చేసారు. ఈ సంద‌ర్భంలోనే తోట వాణికి బీజేపీ నుండి ఆఫ‌ర్ వచ్చింది. బీజేపీలో చేరేందుకు వాణి సైతం సిద్ద‌యమ‌య్యారు. దీంతో ఈ విష‌యం తెలుసుకున్న జ‌గ‌న్ వెంట‌నే అక్క‌డ కార్యాచ‌ర‌ణ ప్రారంభించారు.

జ‌గ‌న్ తెలిసిన వెంట‌నే..అక్క‌డ‌..

జ‌గ‌న్ తెలిసిన వెంట‌నే..అక్క‌డ‌..

ఎన్నిక‌ల ముందు త‌మ పార్టీలో చేరి..టిక్కెట్ ఇస్తే ఎన్నిక‌ల్లో ఓడిన తోట వాణి ఇప్పుడు భ‌ర్త న‌ర‌సింహంతో క‌లిసి బీజేపీ లో చేరాల‌ని నిర్ణ‌యించిన విష‌యం ముఖ్య‌మంగ్రి జ‌గ‌న్ దృష్టికి వ‌చ్చింది. దీంతో..జ‌గ‌న్ వెంట‌నే అక్క‌డ కార్యాచ‌ర‌ణ ప్రారంభించారు. జిల్లాకు చెందిన మంత్రి బోస్‌తోనూ..అదే విధంగా ఇన్‌ఛార్జ్ మంత్రి ఆళ్ల‌నానితోనూ చ‌ర్చించారు. ఇక వాణి పార్టీ మార‌కుండా వారించాల్సిన అవ‌స‌రం లేద‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం. ప్ర‌తిపక్షంలో ఉన్న స‌మ యంలోనే పార్టీ మారేవారి విష‌యంలో ఎక్క‌డా వెనుక‌డుగు వేయ‌లేద‌ని..ఇప్పుడు అస‌లు అవ‌సరం లేద‌నే ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్లు స‌మాచారం. దీంతో..తోట వాణి స్థానంలో పెద్దాపురం లో పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్‌గా కొత్త వారికి బాధ్య త‌లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. అందులో భాగంగా ..పెద్దాపురం వైసీపీ ఇంచార్జ్‌గా దవులూరి దొరబాబుకు బాధ్యతలు అప్పగించారు. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు వైసీపీలో క‌ల‌క‌లం రేపుతోంది.

చ‌క్రం త‌ప్పిన సుజ‌నా చౌద‌రి..

చ‌క్రం త‌ప్పిన సుజ‌నా చౌద‌రి..

బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ద్వారా ఆ పార్టీకి చెందిన జాతీయ నాయకులతో వాణి మంతనాలు జరిపినట్లు సమాచారం. ఏపీలో బిజేపీ త‌ర‌పున క్రియా శీల‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని భావిస్తున్న సుజ‌నా చౌద‌రి గోదావ‌రి జిల్లాలోని కాపు నేత‌ల‌ను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అందులో భాగంగా తోట న‌ర్సింహంతో ఉన్న ప‌రిచ‌యాల‌తో తొలుత ఆయ‌న కుటుంబాన్ని బీజేపీలో చేర్చుకొనేందుకు పావులు క‌దిపారు. తూర్పు గోదావ‌రి జిల్లాలో తోట కుటుంబానికి రాజ‌కీయంగా మంచి నేప‌థ్య‌మే ఉంది. అయితే, ఈ వ్య‌వ‌హారం ద్వారా వైసీపీ నేత‌ల వైపు బీజేపీ దృష్టి సారించిన విష‌యం స్పష్టంగా క‌నిపిస్తోంది. మ‌రి..ఇప్పుడు బీజేపీ వేస్తున్న తాజా అడుగుల‌తో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎటువంటి వైఖ‌రి తీసుకుంటారో...ఎటువంటి విరుగుడు చ‌ర్య‌లు తీసుకుంటారో అనేది ఆస‌క్తి క‌రంగా మారింది.

English summary
YCP leader Thota Vani along with her family members ready to join in BJP. Thota Family joined in YCP before elections and contested from Peddapuram and lost that election. Now jagan appointed new in charge in peddapuram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X