• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాలకృష్ణ పట్ల జగన్ అభిప్రాయం అదే..!వారి మద్య ఉన్న సాన్నిహిత్యాన్ని బయటపెట్టిన వైసీపీ నేత..!

|

అమరావతి/హైదరాబాద్ : రాజకీయాల్లో కొన్ని సంఘటనలు ఎంతో విచిత్రంగా పరిణమిస్తుంటాయి. జీవితంలో చోటుచేసుకునే చిత్రమైన మలుపులను అప్పుడప్పుడు రాజకీయాల్లో కూడా జరిగిపోతుంటాయి. అవి చాలా యాదృచ్చికంగా జరిగిపోయి కొంత కాలం తర్వాత అందరిని ఆశ్యర్యానికి గురిచేస్తుంటాయి. అలాగే ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవుతాయనే నానుడికి కూడా ప్రస్తుత రాజకీయాలు అతికినట్టు సరితూగడం కూడా చర్చినీయాంశమవుతోంది. సరిగ్గా ఇలాంటి ఘటనే ప్రస్తుత ఏపి రాజకీయాల్లో ఆసక్తిరేపుతోంది.

ఇద్దరు సీఎంల కుమారులు.. పాత సంఘటనను కొత్తగా చెప్పిన వైసీపి నేత..

ఇద్దరు సీఎంల కుమారులు.. పాత సంఘటనను కొత్తగా చెప్పిన వైసీపి నేత..

అది కూడా రెండు పరస్పర విరుద్ద పార్టీల,హేమాహేమీల వంటి నేతల మధ్య గతంలో జరిగిన సంఘటన పట్ల తాజాగా చర్చ జరుగుతోంది. ఇదే అంశాన్ని అధికార వైయస్సార్సీపి కి చెందిన నేత నిర్ధారించడం మరింత వేడి రగుల్చుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా సాగుతుంటాయి. కొన్ని సంఘటనలు ఊహించని రీతిలో సంచలనంగా మారుతుంటాయి. సంచలనానికి ఉదాహరణగా మిగిలిన సంఘటనల పట్ల తాజాగా జరుగే చర్చ కూడా సంచలనాలను నమోదు చేస్తాయి.

వీరాభిమానం అంటే అదే.. ఆసక్తి రేపుతున్న ఘటన..

వీరాభిమానం అంటే అదే.. ఆసక్తి రేపుతున్న ఘటన..

ఏపీలో తాజాగా ఇద్దరు ముఖ్యమంత్రుల కుమారుల పట్ల గతంలో జరిగిన పరిణామాలు తాజాగా హల్ చల్ చేస్తున్నాయి. ఏపి ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ, హిందూపురానికి చెందిన ఎమ్మెల్యే, సినీహీరో బాలకృష్ణ మద్య గతంలో చోటు చేసుకున్న ఓ ఉదంతం గురించి వైసీని నేత స్పందించడం సంచలనంగా మారింది. మామూలు సమయంలో నైతే ఈ అంశానికి అంత ప్రాధాన్యత వచ్చేది కాదేమో గాని, ప్రస్తుతం జగన్ ఏపి ముఖ్యమంత్రిగా జగన్, ఎమ్మెల్యేగా ప్రతిపక్షపార్టీలో బాలకృష్ణ కొనసాగుతుండడంతో ఈ అంశానికి ఊహించని ప్రతిస్పందన వస్తోంది.

ఏపి సీఎం జగన్ బాలకృష్ణ వీరాభిమాని.. వారి మద్య సాన్నిహిత్యం వేరన్న వైసీపి నాయకుడు..

ఏపి సీఎం జగన్ బాలకృష్ణ వీరాభిమాని.. వారి మద్య సాన్నిహిత్యం వేరన్న వైసీపి నాయకుడు..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతకన్నా ముందు మంచి సినిమా నటుడుగా ముద్ర వేసుకున్న సీనియర్ నటుడు విజయ్ చందర్ ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఏపీ స్టేట్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఏపీలో తిరుగులేని రాజకీయ శక్తిగా మారిన జగన్మోరెడ్డి వ్యక్తిగతంగా ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణను విపరీతంగా అభిమానిస్తారన్న అంశానికి తానే ప్రత్యక్ష సాక్షమని చెప్పుకొచ్చారు విజయ చందర్. అదే విషయాన్ని నటుడు విజయ్ చందర్ తాజా దృవీకరించారు కూడా. గత స్మృతులను నెమరువేసుకుంటూ కరుణామయుడు యాదృచ్చికంగా కొన్ని సంఘటనల గురించి ఆసక్తికరంగా వివరించారు.

బాలయ్య సినిమా విడుదల కోసం జగన్ ఎదురు చూసే వాడు.. థియేటర్లో జగన్ బాగా ఎంజాయ్ చేసేవాడన్న విజయ్ చందర్

బాలయ్య సినిమా విడుదల కోసం జగన్ ఎదురు చూసే వాడు.. థియేటర్లో జగన్ బాగా ఎంజాయ్ చేసేవాడన్న విజయ్ చందర్

నటుడు బాలయ్య అంటే జగన్మోహన్ రెడ్డికి మాచెడ్డ అభిమానమని, ఒకప్పుడు జగన్ బాలయ్య బాబు సినిమాలు తెగ చూసేవాడని, బాలయ్య నటన అన్నా, డాన్సులన్నా జగన్ కు చాలా ఇష్టమని, అసలు బాలకృష్ణ సినిమా విడుదల కాగానే మొదటి షోలో బాగా ఎంజాయ్ చేసేవాడని చెప్పారు. అయితే గతం గురించి, జగన్ అభిమానం గురించి, గత జ్ఞాపకాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయ్ చందర్, ప్రస్తుత పరిణామాల గురించి మాత్రం పెదవి విప్పలేదు. కోట్లాదిమంది ప్రజల అభిమానాన్ని పొందిన జగన్ వంటి అధినాయకుడి మనసును గెల్చుకున్న నటుడు బాలకృష్ణ కావటం ఆసక్తికరంగా మారింది. తనకు ఏపి సీఎం జగన్ వీరాభిమాని అనే అంశంపై బాలయ్య బాబు ఎలా స్పందిస్తారన్నదే క్యూరియాసిటీ కలిగిస్తోంది.

English summary
Actor Balaya is a favorite of Jagan Mohan Reddy and Vijay Chander has made interesting comments about Jagan's fondness and past memories, but he has not kept a close eye on the current developments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more