కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

"చంద్రబాబు ప్యాకేజీలతో పవన్ కల్యాణ్ ఇష్టం వచ్చినట్లు.."

By Pratap
|
Google Oneindia TeluguNews

కడప: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప నేతలు స్పందించారు. పవన్‌ కళ్యాణ్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఇస్తున్న ప్యాకేజీ తీసుకుంటూ పవన్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వారు విమర్శించారు.

పోలవరం ప్రాజెక్టు పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కూడా తీవ్ర విమర్సలు చేశారు. శనివారం మీడియాతో వైసిపి నేతలు రవీంద్రనాథరెడ్డి, అంజాద్‌ బాషా, సురేష్‌ బాబు మాట్లాడారు. వైఎస్‌ హయంలోనే పోలవరానికి సంబంధించిన అన్ని అనుమతులు వచ్చాయని వారు తెలిపారు.

చంద్రబాబు కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారే తప్ప పోలవరం పనులు పూర్తి చేయడం లేదని వారన్నారు. పవన్‌ కళ్యాణ్‌పై వైసిపి నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అభిమానించే సినీ హీరో ఇంత చ‌వట అనుకోలేదని ఆయన అన్నారు.

YCP leaders alleges Pawan Kalyan taking packages from Chandrababu

లెక్కల మాష్టారును అడగండి

వరుసగా ఏడో సంవత్సరం ఆస్తులను ప్రకటించి.. రాజకీయ నేతలకు చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆదర్శంగా నిలిచారనిఆంధ్రప్రదేస్ ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. ఆస్తులను ఎలా ప్రకటిస్తారో లెక్కల మాస్టారు విజయసాయిని అడగండని ఆయన విజయవాడలో అన్నారు.

టీడీపీ హయాంలోనే ఎక్కువ డీఎస్సీలని ఆయన అన్నారు. ఇప్పుడున్న టీచర్లలో 70 శాతం మంది అలా వచ్చిన వారేనని ఆయన చెప్పారు. పక్క రాష్ట్రంలోనూ చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారని దినకర్ తెలిపారు. టీడీపీ హయాంలోనే 15 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చాయని చెప్పారు.

English summary
Kadapa YSR Congress leaders Ravindranath Reddy and others alleged that Jana Sena chief Pawan kalyan is accepting Andhra Pradesh CM Nara Chandrababu Naidu's packages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X