ముస్లింలకు తప్పని వేధింపులు.. సలాం తర్వాత షేక్ హనీఫ్.. వైసీపీ నేతల దాడి చేయడంతో..
ఏపీలో వైసీపీ సర్కార్ ఆగడాలు శృతి మించుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఇటీవల బలవన్మరణానికి గురయిన అబ్దుల్ సలాం కుటుంబం గురించి ప్రస్తావించారు. తాజాగా మరొకరు కూడా ఆత్మహత్యయత్నం చేశారని గుర్తుచేశారు. వైసీపీ సర్కార్ హయాంలో రోజుకో ముస్లిం సూసైడ్ అటెంప్ట్ చేయాల్సిందేనా అన్నారు.
మరో ఘటన..
నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య గురించి మరచిపోకముందే మరో ఘటన జరిగింది. తాడికొండకు చెందిన ముస్లిం మౌజాం షేక్ హనీఫ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ముస్లిం శ్మశానవాటికలో వైసీపీ నేతలు మట్టిని తవ్వుకుపోతుంటే ప్రశ్నించడమే తప్పైపోయిందా అని అంతకుముందు తీసిన వీడియోలో అడిగారు.
పదిముందు దాడి చేసి..
తనను పది మంది ముందు దాడి చేసి, తిడుతూ అవమానించారని తెలిపారు. దీంతో మనస్తాపానికి గురై సూసైడ్ అటెంప్ట్ చేశారు. అంతకుముందు తీసిన వీడియోలో అన్నీ వివరాలు తెలిపారు. శ్మశానం నుంచి మట్టి తీయొద్దని చెబితే దాడి చేయడం ఏంటీ అని లోకేశ్ ప్రశ్నించారు. సూసైడ్ అటెంప్ట్ చేయగా.. ఆయన ప్రాణాలు పోతే ఆ కుటుంబానికి జవాబుదారీ ఎవరు అని లోకేశ్ ప్రశ్నించారు.

ఖండిస్తున్నాం..
మౌజాం షేక్ హనీఫ్పై జరిగిన దాడిని ఖండిస్తున్నానని లోకేశ్ తెలిపారు. ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.

ఏం జరిగిందంటే..
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ అరెస్ట్ చేశారు. దొంగతనం కేసుకు సంబంధించి పోలీసులు వేధించారని అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు పోలీసుల తీరును వివరిస్తూ సెల్పీ వీడియో షూట్ చేశాడు. కుటుంబం సామూహిక ఆత్మహత్య తర్వాత వీడియో పోలీసులకు లభించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరలయ్యింది. కేసుతో సంబంధం ఉన్న సీఐ, హెడ్ కానిస్టేబుల్ను విధుల నుంచి తప్పించారు.