వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతీయ నేత‌లు బాబును న‌మ్మ‌కండి: కోడెలే చొక్కా చించుకున్నారు : ఎన్నిక‌ల సంఘానికి వైసిపి ఫిర్యాదులు..!

|
Google Oneindia TeluguNews

వైసిపి నేత‌ల బృందం కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిసింది. ఏపిలో ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన హింస‌..స్ట్రాంగ్ రూం ల భ‌ద్ర‌త..వైసిపి నేత‌ల పై దాడుల గురించి ఫిర్యాదు చేసారు. ఈ ప్ర‌గ‌తి ప్రాజెక్టులో ఆధార్ సంస్థ నుండి ఇద్ద‌రు కీల‌క పో లీసు అధికారులు చిక్కుకున్నార‌ని..ఈ ఒక్క కేసు వారిని అరెస్ట్ చేయటానికి స‌రి పోతుంద‌ని వ్యాఖ్యానించారు. కోడెల శివ ప్ర‌సాద్ రిగ్గింగ్ చేస్తుంటే గ్రామ‌స్థులే దాడి చేసార‌ని పేర్కొన్నారు.

చంద్ర‌బాబును న‌మ్మ‌కండి..
వైసిపి నేత‌లు ఎన్నిక‌ల సంఘాన్ని కలిసి ఏపిలో పోటీలో ఉన్న త‌మ అభ్య‌ర్దుల పై జ‌రిగిన దాడుల‌ను వివ‌రించారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఇవియం ల పై చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించారు. పోలింగ్ రోజు ఉద‌యమే కుటంబ స‌భ్యుల తో క‌లిసి ఓటు వేసిన చంద్ర‌బాబు..మ‌ధ్నాహ్నం వ‌ర‌కు ఇవియం లు ప‌ని చేయ‌లేద‌ని ఎలా చెబుతార‌ని ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల్లో త‌మ ఓట‌మి ఖ‌రారు కావ‌టంతో..ఈ ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని పార్టీ ఎంపి విజ‌య సాయిరెడ్డి ఆరోపించారు.

జాతీయ నేత‌లు ఎవ‌రూ చంద్ర‌బాబు మాట‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు. ఇక‌, ఆధార్ సంస్థ న‌మోదు చేసిన కేసు పైనా స్పందించారుద‌. ఆధార్ స‌మాచారాన్ని ఏపి లో ఈ ప్ర‌గ‌తి ప్రాజెక్టు కోసం సేక‌రించి...ఆ ప్రాజెక్టు నిర్వ‌హ‌ణ ఇద్ద‌రు ముఖ్య పోలీసు అధికారుల వార‌సుల‌కు అప్ప‌గించార‌ని..ఆ కేసు ఒక్క‌టి చాల‌ని వీరంద‌రినీ లోప‌ల వేయ‌టానికి అంటూ వ్యాఖ్యానించారు. స‌రైన స‌మ‌యంలో పూర్తి స‌మాచారం బ‌య‌ట పెడ‌తామ‌న్నారు.

YCP leaders met CEC and complaint on TDP : Requested for central forces at Strong rooms

కోడెలే చొక్కా చించుకున్నారు..
స్పీక‌ర్ గా ఉన్న స‌త్తెన‌ప‌ల్లి టిడిపి అభ్య‌ర్ది కోడెల శివ ప్ర‌సాద్ పై జ‌రిగిన దాడి గురించి వైసిపి నేత‌లు ఎన్నిక‌ల సంఘా నికి వివ‌రించారు. పోలింగ్ బూత్ లోకి వెళ్లి రిగ్గింగ్ చేయ‌టానికి కోడెల ప్ర‌యత్నం చేసార‌ని..ఆ స‌మ‌యంలో గ్రామ‌స్థులు త‌రిమి కొట్టార‌ని వివ‌రించారు. సానుభూతి కోస‌మే కోడెల చొక్కా చించుకున్నార‌ని ఆరోపించారు. ఇక‌, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో తమ అభ్య‌ర్దుల పై దాడులు జ‌రిగాయ‌ని ఫిర్యాదు చేసారు.

సీఎం చంద్రబాబు తొత్తులు ఎస్పీలుగా ఉన్నచోట్లే హింస జరిగిందని, టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఇక‌, స్ట్రాంగ్ రూంల వ‌ద్ద కేంద్ర బ‌ల గాల‌ను మొహ‌రించాల‌ని వైసిపి నేత‌లు ఎన్నిక‌ల సంఘాన్ని కోరారు. మ‌చిలీప‌ట్నం లో స్ట్రాంగ్ రూంలోకి ఒక వ్యక్తి వెళ్లిన‌ట్లు జ‌రిగిన ప్ర‌చారాన్ని ఇసి దృష్టికి తెచ్చారు. ఆర్టీసి..ఆశా కార్మికుల‌కు పోస్టల్ బ్యాలెట్ అవ‌కాశం క‌ల్పించాల‌ని ఎన్నిక‌ల సంఘాన్ని అభ్య‌ర్దించారు.

English summary
YCP leaders met Election commission and complaint on TDP leaders attacks on YCP contesting candidates. YCP requested CEC for central forces security for EVM's strong Rooms. YCP MP Vijaya Sai Reddy appeal for national party leaders do not trust Chandra babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X