వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పై నాడు మెగా కుటుంబం..అలా : ఇప్పుడు..అదే కాల మహిమ: చిరు..సీఎం భేటీ వేళ పోస్టింగ్ ల కలకలం..!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఖరారైంది. తనను కలవాలనుకుంటున్న చిరంజీవిని తన ఇంటికి విందుకు ఆహ్వానించారు సీఎం జగన్. 14న తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ అరుదైన కలయిక జరగనుంది. దీని పైన రాజకీయంగానే కాకుండా.. సినిమా వర్గాల్లోనూ ఆసక్తి నెలకొని ఉంది. ఇదే సమయంలో వైసీపీ అభిమానులు కొందరు సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు. గతంలో చిరంజీవి కాంగ్రెస్ లో ఉన్న సమయంలో జగన్ అరెస్ట్ అయ్యారు.

ఆ సమయంలో రాం చరణ్ చట్టం తన పని తాను చేసింది అని పోస్టింగ్ పెట్టారు..సంతోషం పట్టలేక అంటూ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి టీం అంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ లు వైరల్ గా మారాయి. గతంలో జరిగిన అంశాలను లేవనెత్తుతూ..ఇప్పుుడు వారే జగన్ అప్పాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారని..అదే కాల మహిమ అంటూ పోస్టింగ్ లు పెడుతున్నారు. దీని మీద ఎవరికి తోచిన తీరున వారు స్పందిస్తున్నారు. అయితే, జగన్ మాత్రం గతం ఎలా ఉన్నా..ఇప్పుడు తన కోసం వస్తున్న వారిని మాత్రం ఆహ్వానిస్తున్నారు.

 జగన్ పైన నాడు మెగా ఫ్యామిలీ ఇలా ..

జగన్ పైన నాడు మెగా ఫ్యామిలీ ఇలా ..

సైరా సినిమా సక్సెస్ తో జోష్ మీద ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ ఖరారైంది. 14న ముఖ్యమంత్రి నివాసంలో చిరంజీవిని లంచ్ ఏర్పాటు చేసారు. ఇదే సమయంలో కొందరు వైసీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టింగ్ లు పెడుతున్నారు. జగన ను అరెస్ట్ చేసిన సమయంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో జగన్ ను అరెస్ట్ చేయగానే.. రాం చరణ్ చట్టం తన పని తాను ఇప్పుడు చేసింది అంటూ కామెంట్ చేసారు. ఇప్పుడు వైసీపీ అభిమానులు ఆ విషయాన్ని గుర్తు చేస్తూ పోస్టింగ్ లు పెడుతున్నారు. అటువంటి వారే ఇప్పుుడు జగన్ అప్పాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారని..అదే కాల మహిమ అంటూ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి టీం పేరిట పోస్టింగ్ లు కనిపిస్తున్నాయి.

నాడు రాంచరణ్ కామెంట్ల వెనుక..

నాడు రాంచరణ్ కామెంట్ల వెనుక..

అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు..2009 ఎన్నికల్లో పోరాటం సమయంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రజారాజ్యం నుండి చిరంజీవితో సహా పవన్ కళ్యాణ్ సైతం ఎన్నికల ప్రచారం చేసారు. ఆ సమయంలో పవన్ నాటి సీఎం వైయస్ లక్ష్యంగా అనేక ఆరోపణలు చేసారు. ఇక, అదే సమయంలో చెన్నైలో చిరంజీవి కుమార్తె సుస్మిత నివాసం పైన ఐటీ దాడులు జరిగాయి. దాని వెనుక వైయస్ కుటుంబం ప్రోద్బలం ఉందని ప్రచారం సాగింది. అదే సమయంలో ఒక వర్గం మీడియాలోనూ దాని పైన పెద్ద ఎత్తున ప్రచారం చేసారు. దీనికి రాం చరణ్ బాగా హర్ట్ అయ్యారు. దీనికి స్పందనగానే జగన్ అరెస్ట్ అయిన వెంటనే రాం చరణ్ ఆ విధంగా స్పందించారంటూ అప్పట్లోనే చర్చ సాగింది.

రాజకీయాలకు దూరంగా చిరంజీవి..

రాజకీయాలకు దూరంగా చిరంజీవి..

ఇక, రాష్ట్ర విభజన..రాజ్యసభ సభ్యత్వం పూర్తయిన తరువాత చిరంజీవి పూర్తిగా సినిమాకుల దూరంగా ఉంటున్నారు. తన సోదరులిద్దరూ జనసేన నుండి పోటీ చేసినా దాని మీద ఫోకస్ చేయలేదు. కనీసం కామెంట్ చేయలేదు. తాజాగా డబ్బు ప్రభావం కారణంగా తాను..తన సోదరుడు తమ సొంత జిల్లాలో ఓడిపోయామని మాత్రం చెప్పుకొచ్చారు. ఇక, రాం చరణ్ కు రాజకీయాలతో సంబంధం లేదు. బాబాయ్ పవన్ అంటే అమితమైన ప్రేమ. అయితే, రాజకీయంగా మాత్రం జనసేన కోసం పని చేయలేదు. ఇటువంటి సమయంలో సైరా నిర్మాతగా రాం చరణ్ ఇప్పుడు తన తండ్రితో కలిసి ఏపీ ముఖ్యమంత్రిని కలవాలని నిర్ణయించారు. జగన్ సైతం ఆహ్వానం పలికారు.

జగన్ పక్కా వ్యూహంతో ముందడుగు..

జగన్ పక్కా వ్యూహంతో ముందడుగు..

సైరా సినిమా ప్రత్యేక షోల ప్రదర్శనకు చివరి నిమిషం వరకు ఆలోచించిన ఏపీ ప్రభుత్వం..సినిమా విడుదలకు కొద్ది గంటల ముందు అనుమతి ఇచ్చింది. ఇక, సాహో సినిమాకు కాదని తన సినిమా ప్రత్యేక షోలకు సహకరించిన ఏపీ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిపేందుకు అప్పాయింట్ కావాలని చిరంజీవి ఫోన్ చేసారు. వెంటనే 14న తన ఇంటికి లంచ్ కు రావాలని జగన్ ఆహ్వానించారు. అయితే, గతంలో జరిగిన అంశాల కంటే..ముఖ్యమంత్రిగా ఉన్న తాను భవిష్యత్ రాజకీయాలు..సామాజిక సమీకరణాలు..తన ప్రత్యర్దులు..ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని.. పరోక్షంగా పవన్ పైన మానసికంగా పై చేయి సాధించటం కోసం వ్యూహాత్మకంగా చిరంజీవితో మైత్రి కోరుకుంటున్నారు. ఈ సమయంలో వైసీపీ పోస్టింగ్ లు కొత్త చర్చకు కారణమవుతున్నాయి.

English summary
YCP leaders postings in social media on Ap Cm jagan and chiranjeevi meeting now creating political controversy. some the ycp fans remembering ram charn comments on Jagan Arrest. But, Cm jagan invited chiranjeevi and Ram charan for lunch in his official residence on monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X