వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ నిర్ణయాలు అదుర్స్ అంటూ వైసీపీ ఎమ్మెల్యేల కితాబు .. సంచలన నిర్ణయాలతో జగన్ దూకుడు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మార్కు పాలన సాగించనున్నారు. ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలను తీసుకుంటూ పాలనలో దూకుడు చూపిస్తున్నారు. మొన్నటికి మొన్న సీబీఐ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్ ఇప్పుడు తాజాగా ఏపీకి ఐదుగురు ఉపముఖ్యమంత్రులను నియమిస్తున్నట్టు ప్రకటించడం నిజంగా సంచలనమే అని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఇక పాలన సజావుగా సాగేందుకు పూర్తి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించిన జగన్ మంత్రివర్గ ఏర్పాటు పనిలో పడ్డారు.

<strong>టీడీపీ కార్యకర్తలపై దాడులు సహించం .. టీడీపీ పునాదులు కదిపే శక్తి ఎవరికీ లేదన్న అయ్యన్నపాత్రుడు</strong>టీడీపీ కార్యకర్తలపై దాడులు సహించం .. టీడీపీ పునాదులు కదిపే శక్తి ఎవరికీ లేదన్న అయ్యన్నపాత్రుడు

జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ముఖ్యనాయకులు జగన్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, జగన్ నాయకత్వంలో రాష్ట్రం స్వర్ణయుగంలా మారబోతోందని బొత్సా పేర్కొన్నారు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ లాంటి సీఎంను ఇంతవరకు చూడలేదని ఆయన జగన్ పనితీరుపై ప్రసంశల వర్షం కురిపించారు . మాటలు చెప్పడం కాదు, ఏదైనా చేతల్లో చూపుతున్న సీఎం జగన్ అని, పదవుల్లో సామాజిక న్యాయం చేసిన ఘనత ఆయనదేనని ప్రశంసించారు బొత్సా సత్యన్నారాయణ .

YCP leaders praised Jagan over his decisions .. Jagan is aggressive with sensational decisions

ఇక ఇంకో సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఏపీ సీఎం జగన్ కు కితాబిచ్చారు. జగన్ నిర్ణయం రాజకీయాల్లో సంచలనం సృష్టించిందని ఆయన అభిప్రాయపడ్డారు . అందరికీ సమన్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం ఆయన అందరికీ సమన్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారని ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు . రాబోయే రోజుల్లో ప్రజలు అద్భుతమైన పాలన చూస్తారని పేర్కొన్నారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. వైసీపీకి చెందిన మరో నేత నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చెయ్యరని, నిలబెట్టుకుంటారని పేర్కొన్నారు. రాజన్న రాజ్యం దిశగా వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారని ఆమె అన్నారు . అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించారని నగరి ఎమ్మెల్యే రోజా జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

English summary
The leaders of the YCP have expressed their happiness over the decisions taken by the Jagan. Senior YCP leader Botsa Satyanarayana said the state is going into a golden era under the leadership of Jagan. Another senior leader Umma Reddy Venkateshwarlu said that the decision of the Jagan was a sensation in politics. and YCP MLA roja said YS Jagan is moving towards Rajanna rajyam . Nagari MLA has expressed her happiness over the decisions taken by Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X