వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ ఎంపీకి అరుదైన అవ‌కాశం: రాహుల్ కంటే ప్రాధాన్య‌త‌: బ్యాక్ బెంచ్‌లో టీడీపీ ఎంపీల‌కు..!

|
Google Oneindia TeluguNews

వైసీపీ లోక్‌స‌భ పార్టీ నేత పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డికి అరుదైన అవ‌కాశం ద‌క్కింది. లోక్‌స‌భ‌లో తొలి వ‌రుస‌లో ప్ర‌ధాని..కీల‌క నేత‌ల‌తో స‌హా ప్ర‌తిప‌క్ష నేత‌లు కూర్చొనే వ‌రుస‌లోనే మిధున్ రెడ్డికి సీటు ద‌క్కింది. అయితే, రాహుల్ గాంధీ సైతం మిధున్ రెడ్డి కంటే వెనుక వ‌ర‌స‌లో కూర్చోవాల్సి వ‌చ్చింది. ఇక‌..టీడీపీ ఎంపీల‌కు ఆ త‌రువాతి వ‌రుస‌లో సీట్లు కేటాయి స్తూ స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకున్నారు. దేశంలోనే అధిక సీట్లు గెలిచిన నాలుగో పార్టీగా వైసీపీ గుర్తింపు ద‌క్కించుకుంది. దీంతో..అధిక సీట్లు ద‌క్కించుకున్న పార్టీల వారీగా సిట్టింగ్ స్థానాలు ఖ‌రారు చేసారు. దీంతో..ఎంతో మంది హేమా హేమీ లు ఆసీనులైన లోక్‌స‌భ లోని తొలి వ‌రుస‌లో ఇప్పుడు మిధున్ రెడ్డికి సీటు ద‌క్కటం అరుదైన గుర్తింపే.

తొలి వ‌రుస‌లో మిధున్‌రెడ్డికి సీటు..

తొలి వ‌రుస‌లో మిధున్‌రెడ్డికి సీటు..

లోక్‌స‌భ‌లో పార్టీలు సాధించిన సీట్ల ఆధారంగా ఎవ‌రికి ఎక్క‌డ కూర్చోవాలో నిర్ణ‌యిస్తారు. ప్ర‌స్తుత లోక్‌స‌భ‌లో బీజేపీ త‌రువాత ప్ర‌తిప‌క్షాల్లో కాంగ్రెస్..డీఎంకే..తృణ‌మూల్ త‌రువాత వైసీపీ నాలుగో స్థానంలో ఉంది. దీంతో..ప్ర‌తిప‌క్ష పార్టీల బెంచ్‌ల్లో తొలి వ‌రుస‌లోనే నాలుగు పార్టీల ఫ్లోర్ లీడ‌ర్ల‌కు సీట్లు కేటాయించారు. కొత్తగా ప్రకటించిన డివిజన్‌ నంబర్ల ప్రకారం ప్రధని మోదీ, మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, నరేంద్ర సిగ్‌ తోమర్‌, సదానంద గౌడ, రవిశంకర్‌ ప్రసాద్‌ , అర్జున్‌ ముండా, రమేశ్‌ పోఖ్రియాల్‌, అరవింద్‌ సావంత్‌, స్మృతీ ఇరానీ, జేడీయూ నేత రాజీవ్‌ రంజన్‌ సింగ్‌కు ముందు వరుసలో అధికార ప‌క్ష టేబుట్స్‌లో కేటాయించారు. ప్ర‌తిప‌క్షం నుండి ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్‌ నుంచి సోనియా గాంధీ, లోక్‌సభలో ఆ పార్టీ నేత అధిర్‌ రంజన్‌ చౌధురికి మాత్రమే మొదటి వరుస సీట్లు దక్కాయి. తాజాగా వైసీపీ ఫ్లోర్ లీడ‌ర్ మిధున్‌రెడ్డికి ఆ అవ‌కాశం ద‌క్కింది.

జ‌గ‌న్‌ నిర్ణ‌యంపై కేంద్రం ఆందోళ‌న‌: మంత్రి అనిల్ ఎక్క‌డ‌: ప‌్ర‌భుత్వ ఇమేజ్ డామేజ్ అవుతున్నా..! జ‌గ‌న్‌ నిర్ణ‌యంపై కేంద్రం ఆందోళ‌న‌: మంత్రి అనిల్ ఎక్క‌డ‌: ప‌్ర‌భుత్వ ఇమేజ్ డామేజ్ అవుతున్నా..!

Recommended Video

ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటా మిథున్ రెడ్డి
రెండో వ‌రుస‌లోకి రాహుల్‌.. ఆ త‌రువాత టీడీపీకి..

రెండో వ‌రుస‌లోకి రాహుల్‌.. ఆ త‌రువాత టీడీపీకి..

ఇక‌..ప్ర‌తిప‌క్షాల నుండి రెండో వ‌రుస‌లో చివ‌రి సీటు రాహుల్‌ గాంధీకి కేటాయించారు. సమాజ్‌వాది పార్టీ నేత ములా యం సింగ్‌ యాదవ్‌, డీఎంకేకు చెందిన టీఆర్‌ బాలుకు ముందు సీట్లు కేటాయిస్తూ స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకున్నారు.
తృణమూల్‌ సీనియర్‌ నేత సుదీప్‌ బందోపాధ్యాయ పక్కనే వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి ప్రతిపక్షం వైపు ముందు వరు సలో సీటు లభించింది. వైసీపీ సభ్యులు ప్రతిపక్షం వైపు మొదటి నాలుగైదు వరుసలు ఆక్రమించారు. ఇక‌, ముగ్గురు స‌భ్యులు ఉన్న టీడీపీకి 4, 5, 6 వరుసల్లో ఒకరి వెనక మరొకరికి సీట్లు లభించాయి. నామా నాగేశ్వరరావు నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ఎంపీలు మూడో వరుస నుంచి కూర్చోవాలని స్పీకర్‌ నిర్ణయించారు. డివిజన్‌ నంబర్ల కేటాయింపుతో రెండు రోజులుగా బిల్లులపై ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌కు వీలవుతోంది.

తొలి సారిగా వైసీపీకి..మిధున్‌రెడ్డికే..

తొలి సారిగా వైసీపీకి..మిధున్‌రెడ్డికే..

కాంగ్రెస్ పార్టీ నుండి 2009 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ క‌డ‌ప నుండి ఎంపీగా గెలిచారు. వైయ‌స్ మ‌ర‌ణం త‌రువాత కాంగ్రెస్ పార్టీ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి కొత్త‌గా పార్టీ ఏర్పాటు చేసి వైసీపీ నుండి తొలి ఎంపీగా రికార్డు మెజార్టీతో తిరిగి క‌డ‌ప ఎంపీగా లోక్‌స‌భ‌లో అడుగు పెట్టారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ 9 స్థానాలు గెలుచుకుంది. తాజా ఎన్నిక‌ల్లో ఏకంగా 22 లోక్‌స‌భ సీట్లు వైసీపీ గెలిచింది. ఇప్పుడు ప్ర‌తిప‌క్ష పార్టీల్లో నాలుగో అతి పెద్ద పార్టీగా వైసీపీ గుర్తింపు సాధించింది. దీంతో.. ఆ పార్టీ లోక్‌స‌భ ఫ్లోర్ లీడ‌ర్‌గా ఉన్న ఉన్న మిధున్ రెడ్డికి ప్ర‌తిప‌క్ష బెంచ్‌ల్లో తొలి వ‌రుస‌లో అగ్ర నేత‌ల ప‌క్క‌న సీటు కేటాయించారు. ఇది మిధున్ రెడ్డికే కాదు..వైసీపీకే ప్ర‌త్యేక గుర్తింపుగా వైసీపీ నేత‌లు చెబుతున్నారు.

English summary
YCP Loksabha floor leader Mithun Reddy got rare opportunity in parliament. Speaker decided seating in first row beside of main opposition leaders for Mithun Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X