అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హ‌ద్దు మీరుతున్నారు: కియో మేనేజ‌ర్‌కు వైసీపీ నేత‌ల బెదిరింపులు: టీడీపీ ఆరోప‌ణ‌లు నిజం చేసేలా..!

|
Google Oneindia TeluguNews

అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత పార్టీ పైన వైసీపీ అధినేత ప‌ట్టు త‌ప్పుతోంది. ముఖ్య‌మంత్రి హోదాలో జ‌గ‌న్ చెబుతు న్న మాట‌ల నేత‌ల‌కు ఎక్క‌టం లేదు. కొంత మంది నేత‌లు హ‌ద్దు మీరుతున్నారు. ఏకంగా ప్రపంచ ప్రఖ్యాత కియా ఫ్యాక్టరీ జనరల్‌ మేనేజర్‌నే బెదిరించే స్థితికి ఎదిగారు. ఒక వైపు అసెంబ్లీ వేదిక‌గా తాము పరిశ్ర‌మ‌ల‌కు..పెట్టుబ‌డి దారుల‌కు ఏ ర‌కంగా స‌హ‌క‌రించేదీ వివ‌రిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో పార్టీ శ్రేణులు మాత్రం హ‌ద్దు మీరుతున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ అధికారంలోకి వ‌స్తే బెదిరింపులు ఎక్కువ అవుతాయ‌ని.. వేధింపులు పెరుగుతాంటూ ప్ర‌చారం చేసారు. ఇది త‌ప్పు అని నిరూపించాల్సి పార్టీ శ్రేణులు..కొంద‌రి తీరు కార‌ణంగా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డుతున్నారు.

జ‌గ‌న్‌ నిర్ణ‌యంపై కేంద్రం ఆందోళ‌న‌: మంత్రి అనిల్ ఎక్క‌డ‌: ప‌్ర‌భుత్వ ఇమేజ్ డామేజ్ అవుతున్నా..! జ‌గ‌న్‌ నిర్ణ‌యంపై కేంద్రం ఆందోళ‌న‌: మంత్రి అనిల్ ఎక్క‌డ‌: ప‌్ర‌భుత్వ ఇమేజ్ డామేజ్ అవుతున్నా..!

Recommended Video

టీడీపీపై కక్షతో, అభివృద్ధి పనులను పక్కన పెడుతున్నారు
కియో మేనేజ‌ర్‌కు బెదిరింపులు..

కియో మేనేజ‌ర్‌కు బెదిరింపులు..

క్షేత్ర స్థాయిలో కొంత మంది వైసీపీ నేత‌లు హ‌ద్దు మీరుతున్నారు. అధికార ద‌ర్పం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఏపీలో గ‌త అయి దేళ్ల కాలంలో వ‌చ్చిన ఏకైన ప‌రిశ్ర‌మ కియో సంస్థ‌. ఈ నెల 8న కియో సంస్థ ఉత్ప‌త్తులు మార్కెట్‌లోకి రానున్నాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సైతం హాజ‌ర‌వుతున్నారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో స్థానికంగా కొంద‌రు వైసీపీ నేత‌లు ఏకంగా కియో ఫ్యాక్ట‌రీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌ను బెదిరించిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మా పార్టీ అధికారంలో ఉంది..మేం చెప్పిన‌ట్లు చేయాలి..మా వాళ్ల‌ను ఉద్యోగాల్లోకి తీసుకోవాలి..మా లారీల‌నే అద్దెకు తీసుకోవాలి..మీరు ల‌క్ష‌లు సంపాదిస్తుంటే..మేం చూస్తూ ఊరుకోవాలా..కుద‌రదు అంటూ ఇద్దరు వైసీపీ నాయకులు కియ కార్ల పరిశ్రమ జీఎం సదాశివంను బెదిరించారు. చెన్నేకొత్తపల్లిలో జరిగిన ఈ సంఘటనపై జీఎం జిల్లా ఎస్పీ సత్యఏసుబాబును ఆశ్రయిం చారు. దీని పైన కేసు న‌మోదు చేసారు.

ఆ ఇద్ద‌రి నేత‌ల‌కు కౌన్సిలింగ్‌..

ఆ ఇద్ద‌రి నేత‌ల‌కు కౌన్సిలింగ్‌..

చెన్నేకొత్తపల్లి వైసీపీ మండల కన్వీనర్‌ మైలారపు గోవిందరెడ్డి..బసంపల్లి మాజీ సర్పంచు డోలా రామచంద్రరెడ్డి జీఎం ఇంటికి వెళ్లి ఉద్యోగాల విషయమై ఆయనకు హుకుం జారీ చేశారు. దీంతో ఆయ‌న ఈ బెదిరింపుల వ్యవహారంపై ఎస్పీకి జీఎం ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో ధర్మవరం డీఎస్పీ రమాకాంత్‌ రంగంలోకి దిగి ఆ ఇద్దరి నాయకుల అరెస్టుకు ఆదేశాలిచ్చారు. రామచంద్రారెడ్డికి తీవ్ర స్థాయిలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమై తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గోవిందరెడ్డి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిపై సీకేపల్లి పోలీసు స్టేషన్‌లో 506 సెక్షన్‌ కింద బెదిరింపులకు పాల్పడిన కేసు నమోదు చేసారు. కియా జీఎంను ఇద్దరు వైసీపీ నాయకులు బెదిరించారని డీఎస్పీ రమాకాంత్ నిర్ధారించారు. ఎవరైనా సరే బెదిరింపులు, దౌర్జన్యాలకు దిగితే ఉపేక్షిం చే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

టీడీపీ ఆరోప‌ణ‌లు నిజం చేసేలా...

టీడీపీ ఆరోప‌ణ‌లు నిజం చేసేలా...

ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలుగు దేశం అధినేత మొద‌లు నేతలంతా వైసీపీ మీద తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు. వైసీపీ అధికా రంలోకి వ‌స్తే రాష్ట్రంలో బెదిరింపులు.. దౌర్జ‌న్యాలు పెరుగుతాయంటూ ప్ర‌చారం సాగించారు. ఒక వైపు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఏపీకి ప‌రిశ్ర‌మ‌ల కోసం తాము ఏ ర‌కంగా ముందుకెళ్లేది వివ‌రిస్తూ.. అవీనీతి లేకుండా.. పూర్తి ఫ్రెండ్లీ వాతావ‌ర‌ణం లో అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో కింది స్థాయి నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు వివాదాస్ప దంగా మారుతోంది. కొంత మంది కింది స్థాయి నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో ప‌రిశ్ర‌మ‌ల విధానం పైన ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ స‌మ‌యంలో వైసీపీ అధినాయ‌క‌త్వం సైతం అప్ర‌మ‌త్తం కాక‌పోతే భ‌విష్య‌త్‌లో న‌ష్టం తప్ప‌ద‌నే ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది.

English summary
YCP Mandal level leaders threaten KIO General manager for jobs in KIO for their followers in Anantapur dist. police registered case against those two leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X