చంద్రబాబు కోసం నిమ్మగడ్డ పిచ్చి పీక్స్ కి, ఏ అధికారి పని చెయ్యరు : ఎస్ఈసీకి వైసీపీ మంత్రుల కౌంటర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మరోమారు కాక రేపుతోంది. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన నోటిఫికేషన్ పై వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. సుప్రీంకోర్టులో కేసు ఉండగా నోటిఫికేషన్ ఎలా ఇస్తారంటూ నిమ్మగడ్డ ను టార్గెట్ చేస్తున్నారు.
చంద్రబాబు కోసమే నిమ్మగడ్డ ఎన్నికల నోటిఫికేషన్ అని , ఇది పెద్ద కుట్ర అని మండిపడుతున్నారు.
ఎవరి ప్రాపకం కోసం ఎన్నికలు .. ఎస్ఈసీ నిమ్మగడ్డపై విరుచుకుపడిన స్పీకర్ తమ్మినేని సీతారాం

సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చేవరకు ఉద్యోగులెవరూ మీ ఆదేశాలు పాటించరు : మంత్రి పెద్దిరెడ్డి
తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కౌంటర్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చేవరకు ఉద్యోగులెవరూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను అమలు చేయబోరని ఆయన స్పష్టం చేశారు . సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రతిపక్ష నేత చంద్రబాబు చెబుతున్నట్లు వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
క్లీవేజ్ షోతో సెగలు.. కరిష్మా తన్నా అందాల విందు

నిమ్మగడ్డ చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారు : డిప్యూటీ సీఎం అంజాద్ భాషా
ప్రస్తుతం ఉద్యోగులందరూ భయాందోళనలు ఉన్నారని మంత్రి చెప్పారు. కలెక్టర్లు ఎస్పీలు పై నిమ్మగడ్డ ఎలా చర్యలు తీసుకుంటారో చెప్పాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు టిడిపికి తొత్తులా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు.
వ్యాక్సిన్ పూర్తయ్యేవరకు ఎన్నికలు వాయిదా వేయాలని కోరిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై డిప్యూటీ సీఎం అంజాద్ భాషా మండిపడ్డారు. నిమ్మగడ్డ చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారని, ఆయన ఏకపక్ష నిర్ణయం నిరంకుశత్వానికి అద్దం పడుతుందని అంజాద్ భాషా ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబుతో నిమ్మగడ్డ రమేష్ లాలూచీ : బొత్సా
మరోవైపు ఓ రాజకీయ నేతల నిమ్మగడ్డ వ్యవహరించారని ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంపై బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. వ్యక్తిగత అవసరాల కోసం, కొంతమందికి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం నిమ్మగడ్డ పనిచేస్తున్నారని మండిపడ్డారు . ఎస్ఈ సికి అధికారాలతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని గుర్తు చేశారు. చంద్రబాబు స్నేహితుడిని సామాజిక వర్గం అని చంద్రబాబుతో నిమ్మగడ్డ రమేష్ లాలూచీ పడ్డారని మంత్రి బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. రాజ్యాంగ వ్యవస్థలో నిమ్మగడ్డ వంటి వ్యక్తులు ఉండటం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని తేల్చి చెప్పారు.

ఏకపక్షంగా బెదిరించే ధోరణితో నిమ్మగడ్డ : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బెదిరించే లా నిమ్మగడ్డ వైఖరి ఉందని, ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తులను పట్టించుకోకుండా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో కలిసి నిమ్మగడ్డ కుట్రలు చేస్తున్నారని, ఏకపక్షంగా బెదిరించే ధోరణితో ముందుకు అడుగుతున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. పిచ్చి పీక్స్ కి చేరిందన్నారు . చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ కీలుబొమ్మగా మారారని విమర్శించారు.
మరోవైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మొండిగా ప్రవర్తిస్తున్నారని వైసీపీ ఎంపీ బాలశౌరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నిమ్మగడ్డ : ఎంపీ బాలశౌరి
కరోనా సమయంలో ఎన్నికల వద్ద ఉద్యోగులు మొరపెట్టుకున్నా నిమ్మగడ్డ అవేవీ పట్టించుకోకుండా ఉద్యోగుల ప్రాణాలతో, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజల ప్రాణానికి న్యాయం నీ ప్రాణానికి మరో న్యాయం అంటూ ఎంపీ బాలశౌరి నిప్పులు చెరిగారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న నిమ్మగడ్డ వైఖరి నియంత వైఖరి అంటూ వైసిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . మూడేళ్లు నిద్రపోయి ఇప్పుడు ఎందుకు తొందర అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రశ్నిస్తున్నారు. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే నిమ్మగడ్డ ఇదంతా చేస్తున్నారంటూ, ఎన్నికలలో చంద్రబాబుకు లబ్ధి చేకూర్చాలని ఉద్దేశంతోనే నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణ కోసం పట్టుదలగా ఉన్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.