వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్దల సభలో మంటలు .. ఎమ్మెల్సీని తన్నిన మంత్రి , ఏరా అన్న మంత్రి : దేవినేని ఉమా ఫైర్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో విచిత్ర వాతావరణం నెలకొంది. తాజాగా నిర్వహించిన శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిన్న శాసన మండలిలో చోటు చేసుకున్న ఘటనలపై ప్రస్తుతం ఏపీలో చర్చ జరుగుతోంది. శాసన సభలో అన్ని బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకున్న వైసిపి ప్రభుత్వం శాసనమండలిలో మాత్రం కనీసం ద్రవ్య వినిమయ బిల్లులు కూడా పాస్ చేసుకోలేకపోయింది. ఇక ఏపీ శాసనసభ, మండలి నిరవధికంగా వాయిదా పడ్డాయి. ప్రభుత్వం, ప్రతిపక్షాలు అనుకున్నది ఏదీ కాకుండా ఏ బిల్లు పాస్ కాకుండా నిరవధికంగా మండలి కూడా వాయిదా పడింది. ఇదే రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Recommended Video

AP Assembly Budget Sessions పెద్దల సభలో మంటలు, ఏరా అంటూ మంత్రి మీదికి వెళ్లారని...!!

ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడండి..అక్రమ కేసులు అన్యాయం .. ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడండి..అక్రమ కేసులు అన్యాయం .. ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ

రచ్చతో నిరాధిక వాయిదా పడిన సభ

రచ్చతో నిరాధిక వాయిదా పడిన సభ

ఇక సభలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ముందు చర్చ జరపాలని వైసిపి కోరడంతో అటు ద్రవ్య వినిమయ బిల్లు పై కూడా ఎటూ తేలకుండా సభ రచ్చరచ్చగా ముగిసింది. ఇక ఈ నేపథ్యంలో మండలి లో చోటుచేసుకున్న పరిస్థితులు ఉటంకిస్తూ మాజీ మంత్రి దేవినేని ఉమ ఇత ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం కంటే రాజధాని మార్పు బిల్లే ముఖ్యమా అంటూ ఆయన ప్రశ్నించారు.

పెద్దల సభలో ఏం జరిగిందో తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి దేవినేని ఉమా

పెద్దల సభలో ఏం జరిగిందో తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి దేవినేని ఉమా

అంతేకాదు పెద్దల సభలో మంటలు.. ఎమ్మెల్సీ ని తన్నిన మంత్రి, ఎమ్మెల్సీ ని ఏరా అని పిలిచిన మంత్రి ,తొడగొట్టిన మంత్రి అని వైసిపి మంత్రుల తీరుపై ఆయన సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ సంక్షోభం అని పేర్కొన్నారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందటం కంటే రాజధాని మార్పు బిల్లే ముఖ్యమా ? ఇందుకేనా ఒక ఛాన్స్ అడిగింది చెప్పండి ముఖ్యమంత్రి జగన్ గారు అంటూ దేవినేని ఉమా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు.

టీడీపీ ఎమ్మెల్సీల తీరుపై వైసీపీ నేతల ఆగ్రహం

టీడీపీ ఎమ్మెల్సీల తీరుపై వైసీపీ నేతల ఆగ్రహం

ఇక ఇదే సమయంలో అటు టిడిపి ఇటు వైసీపీ నేతలు మండలి సమావేశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. నిన్న శాసనమండలిలో చోటుచేసుకున్న పరిస్థితులను ఉటంకిస్తూ వైసిపి నేతలు టిడిపి ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడ్డం పెంచిన మంత్రులను రౌడీ లంటూ టీడీపీ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు . ఇక అంతే కాదు ఎమ్మెల్సీ నారా లోకేష్ ఫోటోలు తీస్తూ పిల్ల చేష్టలు చేశారని, శాసనమండలి చైర్మన్ చెప్పిన మాటలు కూడా పట్టించుకోకుండా వింతగా ప్రవర్తించారని వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మండలి చరిత్రలోనే దుర్దినం

మండలి చరిత్రలోనే దుర్దినం

మండలి చరిత్రలో ఇదొక దుర్దినం అని టీడీపీ మంత్రులు మండిపడ్డారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండలి వాయిదా తర్వాత వైసీపీ మంత్రులు టీడీపీ ఎమ్మెల్సీల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ సభ జరుగుతుండగా ఫొటోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఆరోపించారు. ఇది పెద్ద క్రైమ్ అని వారు పేర్కొన్నారు .ఇక లోకేష్ తీరుపై సభా నిబంధనల ఉల్లంఘన ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

బీదా రవిచంద్రను కొట్టారా ? తిట్లతో మొదలై కొట్లాట దాకా !!

బీదా రవిచంద్రను కొట్టారా ? తిట్లతో మొదలై కొట్లాట దాకా !!

టిడిపి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ను వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కొట్టారని, దీంతో బీద రవిచంద్ర తిరగడానికి వచ్చిందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఇక అంతే కాదు మండలంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తొడకొట్టి సవాల్ చేశారని టిడిపి ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ పై అనిల్ కుమార్ యాదవ్ ఏరా అంటూ మీదికి వెళ్లారని, అనుచిత వ్యాఖ్యలు చేశారని టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

English summary
Devineni uma was embarrassed as a social media platform on the way YCP ministers kicked the tdp MLC, the minister who called the MLC with abusive language. He said it was a constitutional crisis. Is a capital change bill more important than a budget bill?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X