వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడాలి నానిపై కక్ష సాధింపు.. క్ల‌బ్బులు న‌డిపిన చ‌రిత్ర టీడీపీది.. చంద్రబాబుపై అంబటి ఫైర్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి నిరోధకులుగా మారారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏం చేసినా కోర్టుల్లో కేసులు వేస్తూ అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మూడు రాజధానులు, పేదలకు ఇళ్లస్థలాలపై కేసులు వేసి అడ్డుకున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు మంత్రి కొడాలి నానిపై కక్ష కట్టారన్నారు. గుడివాడలో గోవా కల్చర్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

క్ల‌బ్బులు, పేకాట‌లు న‌డిపింది టీడీపీయే..

క్ల‌బ్బులు, పేకాట‌లు న‌డిపింది టీడీపీయే..

అసలు గుడివాడలో టీడీపీ నేతలకు ఏం పని అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో క్లబ్బులు, పేకాట సిబిరాలపై ఉక్కుపాదం మోపారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్లబ్బులు, పేకాటలు నడపలేదా ? అని నిలదీశారు. ఆరోజు ఈ నేతలంతా ఎక్కడకు వెళ్లారని దుయ్యబట్టారు. రామోజీ ఫిలింసిటీలో 365 రోజులు క్యాబరే డాన్సులు జరుగుతాయి.. అవి టీడీపీ నేతలకు కన్పించడంలేదా..? వాటిపై ప్రశ్నించాలని అంబటి హితవు పలికారు.

ఎక్కడో జరిగిన దానికి కొడాలి నానికి ఏం సంబంధం?

ఎక్కడో జరిగిన దానికి కొడాలి నానికి ఏం సంబంధం?


వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఎక్కడైనా రాష్ట్రంలో క్లబ్ కల్చర్ ఉందా అని టీడీపీ నేతలను అంబటి రాంబాబు ప్రశ్నించారు. గుడివాడలో గోవా కల్చర్ అంటూ మంత్రి కొడాలి నానిపై కక్షగట్టి కుట్రపూరితంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో జరిగిన దానికి కొడాలి నానికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. నిజనిర్థారణ పేరుతో టీడీపీ నేతలు గుడివాడలో దాడికి వెళ్లారని దుయ్యబట్టారు.. గతంలో పేకాట ఆడిస్తూ వేల‌ కోట్ల రూపాయలు పోగేసుకుంది టీడీపీ నేతలే అని ఆరోపించారు.

ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్ధం చేసుకోవాలి

ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్ధం చేసుకోవాలి

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్ధం చేసుకోవాలన్నారు అంబటి రాంబాబు. ఉద్యోగుల సంక్షేమానికి సీఎం జగన్ ఎప్పుడూ కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. విపక్షాలు, ఎల్లో మీడియా ట్రాప్‌లో పడొద్దని కోరారు. సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉద్యోగులపై కక్ష సాధింపు ధోరణిలో ప్రభుత్వం లేదని స్పష్టం చేశారు. పరిస్థితులను అర్థం చేసుకోని ఉద్యోగులు ప్రభుత్వంతో చర్చలకు రావాలని పిలుపునిచ్చారు.

English summary
Ambati Rambabu serious on TDP over Gudivada Casino
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X