India
  • search
  • Live TV
నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె..!! మేకపాటి పై పోటీకి రెఢీ : మారుతున్న సమీకరణాలు..!!

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉండగానే...పార్టీల్లో చేరికలు ఊపందుకుంటున్నాయి. మహానాడు సంబరాల్లో ఉన్న టీడీపీలో వైసీపీ కుమార్తె ఎంట్రీ ఇవ్వటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారింది. వైసీపీ సీనియర్ నేత..నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి టీడీపీలో చేరేందుకు అంతా సెట్ అయింది. కడప జిల్లా బద్వేలు నేత కోడలు అయిన కైవల్యారెడ్డి..ఇప్పుడు టీడీపీలో చేరటం వెనుక తాజా ఒప్పందం రాజకీయంగా చర్చకు కారణమైంది. ఆనం కుటుంబానికి దాదాపుగా నాలుగు దశాబ్దాల రాజకీయ నేపథ్యం ఉంది.

టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం

టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం


సుదీర్ఘ కాలం టీడీపీలో కొనసాగిన ఆనం ఆ తరువాత కాంగ్రెస్ లో చేరారు. వైఎస్సార్..రోశయ్య..కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పని చేసారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ రాజకీయాల్లో భాగంగా..ఒక దశలో సీఎంగా ఆనం పేరు ప్రచారంలోకి వచ్చింది. కానీ, కిరణ్ కుమార్ రెడ్డి వేసిన ఎత్తుగడలతో..మరొకరికి అవకాశం లేకుండా.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. ఇక, రాష్ట్ర విభజన తరువాత ఆనం సోదరులు టీడీపీలో చేరారు. కాంగ్రెస్ - టీడీపీలో ఉన్న సమయంలో ఆనం వైసీపీ అధినేత జగన్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

ఆత్మకూరు సీటు పైన హామీ

ఆత్మకూరు సీటు పైన హామీ


ఇక, ఆనం రామానారాయణ రెడ్డి 2018లో జగన్ పాదయాత్ర సమయంలో వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఆనం నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. సీనియర్ పొలిటీషియన్ అయినా.. పార్టీలో జూనియర్ కావటంతో మంత్రి పదవి దక్కలేదు. ఇక, కొంత కాలంగా ఆయన పలు సందర్భాల్లో ప్రభుత్వ అధికారులు..పార్టీ నేతల పైన అసంతృప్తి వ్యక్తం చేసారు. అదే సమయంలో జగన్ పట్ల విధేయత కొనసాగిస్తున్నారు. ఇక, ఇప్పుడు ఆయన కుమార్తె ఒంగోలులో మహానాడు జరుగుతున్న సమయంలో లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. భర్త రితేష్ రెడ్డితో కలిసి లోకేష్ తో భేటీ అయ్యారు. తన తండ్రి సొంత నియోజకవర్గమైన ఆత్మకూరు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ నుంచి కైవల్యారెడ్డి హామీ పొందినట్లుగా తెలుస్తోంది.

మేకపాటి పై పోటీకి సిద్దం

మేకపాటి పై పోటీకి సిద్దం


ప్రస్తుతం మేకపాటి గౌతమ్ మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు లో బైపోల్ జరగనుంది. ఈ ఉప ఎన్నికల్లో మాత్రం పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించింది. కానీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి టీడీపీ నుంచి ఆనం కుమార్తె కైవల్యారెడ్డి బరిలో నిలుస్తారని ప్రచారం సాగుతోంది. ఆనం..మేకపాటి కాంగ్రెస్ లో ఉన్న సమయం నుంచీ జిల్లాలో వర్గ పోరు ఉంది. దీని పైన ఆనం స్పందించారు. ప్రస్తుతం కైవల్యా బద్వేలు బిజివేముల కుమార్తె అని... లోకేష్ ను కలిస్తే..ఆమెనే అడగండి అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో..తాజా రాజకీయ పరిణామాలు నెల్లూరు జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

English summary
YCP MLA anam daughter has met Nara Lokesh and that she might contest from the late minister Mekapati Goutham reddy constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X