వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నకిలీ డాక్యుమెంట్ల కేసులో కోర్టుకెళ్ళిన వైసీపీ ఎమ్మెల్యే

|
Google Oneindia TeluguNews

ఏపీలో ప్రధాన పార్టీల మధ్య కేసుల పర్వం చాలా కాలంగా కొనసాగుతుంది. టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా వివాదం ఉంది . ఇక కేసులు, కోర్టులు ఏపీలో రాజకీయ నాయకులకు సర్వ సాధారణ విషయంలా తయారైంది . గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యర్థిగా ఉన్న నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి మధ్య వివాదం ఓ రేంజిలో సాగింది . దీని ప్రభావమే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.

సిఐడీ .. ఈడీ.. ఐటీ... ముప్పేట దాడులతో టీడీపీ లో టెన్షన్సిఐడీ .. ఈడీ.. ఐటీ... ముప్పేట దాడులతో టీడీపీ లో టెన్షన్

కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పరువు నష్టం దావా వేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పరువు నష్టం దావా వేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

అసలు విషయం ఏమిటంటే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి , కాకాణి గోవర్ధన్ రెడ్డి మధ్య వార్ బాగానే సాగింది. ఇరువురు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడంతో పాటుగా పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ఇక ఈ ఇద్దరు నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఓ రేంజిలో జరిగింది. ఇక నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి హవాలాకు పాల్పడ్డారని సోమిరెడ్డిపై కాకాణి సంచలన ఆరోపణలు చేశారు .

కాకాణి నిరాధార ఆరోపణలతో పరువుకు భంగం కలిగిస్తున్నారన్న సోమిరెడ్డి

కాకాణి నిరాధార ఆరోపణలతో పరువుకు భంగం కలిగిస్తున్నారన్న సోమిరెడ్డి

అయితే ఈ వ్యవహారంలో కాకాణి సమర్పించిన పత్రాలన్నీ నకిలీవని ఆరోపించిన సోమిరెడ్డి కాకాణిపై పరువు నష్టం దావా వేశారు . తనపై కావాలని అభియోగాలు చేస్తున్నారని , నిరాధార ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగిస్తున్నారని ఆయన ఏకంగా ఆయన కోర్టుకెక్కారు. ఈ కేసు నెల్లూరులోని నాలుగో అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది.

కాకాణి నకిలీ పత్రాలు సృష్టించి తనపై ఆరోపణలు చేశారని ఫిర్యాదు

కాకాణి నకిలీ పత్రాలు సృష్టించి తనపై ఆరోపణలు చేశారని ఫిర్యాదు

తప్పుడు పత్రాలు సృష్టించి తనపై బురదజల్లుతున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ప్రాధమికంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు అవి నకిలీ పత్రాలని తేల్చేశారు . కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన చిరంజీవి అలియాస్ మణిమోహన్‌పై కేసు నమోదు చేశారు. ఆ తరువాత ఆ నకిలీ డాక్యుమెంట్లన్నీ చిరంజీవిని రూపొందించారని నిర్ధారించుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

కేసు విచారణకు కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి

కేసు విచారణకు కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి

ఇక మరోవైపు తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ నాడు మంత్రిగా ఉన్న సోమిరెడ్డి, కాకాణిపై పరువు నష్టం దావా వేశారు. ఆ కేసుల విచారణలో భాగంగా సోమవారం కాకాణి నెల్లూరులోని 4వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు.నకిలీ డాక్యుమెంట్లు, పరువు నష్టం కేసుల్లో నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కోర్టులో విచారణకు హాజరయ్యారు.

English summary
Somireddy chandramohan reddy , who is a minister, has filed a defamation suit against Kakani govardhan reddy for making false allegations against him. Kakani appeared before the 4th Judicial Magistrate's Court in Nellore on Monday as part of an investigation into the cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X