కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసిపికి గౌరు చ‌రిత గుడ్ బై..! కాటసానికి ప్రాధాన్య‌త పై అల‌క : టిడిపి రివ‌ర్స్ గేమ్‌..!

|
Google Oneindia TeluguNews

వైసిపిలో వ‌రుస‌గా వ‌ల‌స‌ల జోరు కు టిడిపి రివ‌ర్స్ గేమ్ మొదలు పెట్టింది. క‌ర్నూలు జిల్లాలో వైసిపి నుండి గెలిచిన పా ణ్యం సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చ‌రిత ను టిడిపిలో చేర్చుకొనేందుకు మంత‌నాలు ప్రారంభించింది. కొద్ది రోజుల క్రితం సీని య‌ర్ నేత కాట‌సాని రాంభూపాల్ రెడ్డి వైసిపి లో చేరారు. దీంతో..త‌న‌కు సీటు ద‌క్క‌ద‌నే అంచ‌నాతో గౌరు చ‌రిత ఉన్నారు. దీంతో..గౌరు దంప‌తులు టిడిపిలో చేరుతార‌నే ప్ర‌చారం మొద‌లైంది.

గౌరు చ‌రిత గుడ్ బై..!

గౌరు చ‌రిత గుడ్ బై..!

క‌ర్నూలు జిల్లా లో ఇప్ప‌టికే 2014 ఎన్నిక‌ల్లో వైసిపి నుండి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు టిడిపిలోకి జంప్ అయ్యారు. ఇప్పుడు తాజాగా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చ‌రిత పార్టీని వీడ‌టానికి నిర్ణ‌యించిన‌ట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం సీని య‌ర్ నేత కాట‌సాని రాంభూపాల్ రెడ్డి బిజెపి నుండి వైపిపి లో చేరారు. ఆయ‌న‌కు జ‌గ‌న్ పాణ్యం సీటు ఇస్తాన‌ని హామీ ఇ చ్చిన‌ట్లు గా తెలుస్తోంది. అయితే, గౌరు చ‌రిత మాత్రం త‌న‌ను జ‌గ‌న్ విస్మ‌రించ‌ర‌ని..గ‌ట్టిగా అడిగి సీటు తీసుకొనే చ‌నువు త‌న‌కు ఉంద‌ని గౌరు చ‌రిత వ్యాఖ్యానించారు. అయితే ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. సీటు కేటాయింపు పై జ‌గ‌న్ ఎటువం టి హామీ ఇవ్వ‌లేదు. ఇప్ప‌టికే కాటసారి రాంభూపాల్ రెడ్డి తో పాటుగా గౌరు చ‌రిత ప్ర‌చ‌రాం చేసుకుంటున్నారు. ఇదే టైం లో టిడిపి నేత‌లు గౌరు చ‌రిత తో మంత‌నాలు ప్రారంభించారు. టిడిపిలోకి రావాల‌ని ఆహ్వానిస్తున్నారు.

జ‌గ‌న్ కు ఆత్మీయులుగా..

జ‌గ‌న్ కు ఆత్మీయులుగా..

జ‌గ‌న్ కాంగ్రెస్ వీడి వైసిపి ఏర్పాటు చేసిన స‌మ‌యం నుండి గౌరు దంప‌తులు జ‌గ‌న్ కు ద‌గ్గ‌ర‌గా ఉంటున్నారు. గౌరు చ‌రిత ఒక సారి నందికొట్కూరు నుండి 2014 ఎన్నిక‌ల్లో పాణ్యం నుండి గెలిచారు. 2017 లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గైరు వెంట‌క‌రెడ్డి వైసిపి నుండి బ‌రిలో నిలిచారు. ఆయ‌న నాడు టిడిపి నుండి పోటీ చేసిన శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక‌, వైసిపి లో చేరిన కాట‌సాని రాంభూపాల్ రెడ్డి 2014 ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్దిగా పోటీ చేసి 60598 ఓట్లు సాధించారు.కాట‌సాని పాణ్యం నుండి అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల్లో కాట‌సాని..గౌరు చ‌రిత మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ జ‌రిగింది. ఇప్పుడు పాణ్యం సీటు వైసిపి నుండి కాట‌సానికి ఇస్తార‌నే ప్ర‌చారంతో గౌరు చ‌రిత పార్టీ వీడి టిడిపిలో చేరేందుకు సిద్ద‌మయ్యార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఏరాసు ప్ర‌తాప‌రెడ్డి టిడిపిలో ఉంటారా..

ఏరాసు ప్ర‌తాప‌రెడ్డి టిడిపిలో ఉంటారా..

ఇక‌, 2014 ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్ ను వీడి టిడిపిలో చేరిన మాజీ మంత్రి ఏరాసు ప్ర‌తాప‌రెడ్డి 2014 ఎన్నిక‌ల్లో 53358 ఓట్లు వ‌చ్చాయి. ఇప్పుడు గౌరు చ‌రిత టిడిపి లో చేర్చుకోవాల‌ని ఆ పార్టీ నేత‌లు మంత‌నాలు ప్రారంభించారు. గౌరు చ‌రిత టిడిపి లో చేరి ఆ పార్టీ నుండి పోటీ చేస్తే..మ‌రి టిడిపి నే న‌మ్ముకున్న ఏరాసు ప్ర‌తాప‌రెడ్డి ఏం చేస్తార‌నేది ఇప్పు డు ఆస‌క్తి క‌రంగా మారింది. ప్ర‌తాప‌రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా..మంత్రిగా ప‌ని చేసారు. ఇక‌, గౌరు చ‌రిత వ్య‌వ‌హారం లో జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న నుండి వ‌చ్చిన త‌రువాత ఏమైనా రాజీ ఫార్ములా సూచిస్తారా..లేక గౌరు చ‌రిత పార్టీ వీడినా.. మౌనంగా ఉంటారా అనేది వేచి చూడాలి. గౌరు దంప‌తులు సైతం జ‌గ‌న్ తో భేటీ అయిన త‌రువాత తుది నిర్ణ‌యం తీసుకొనే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

English summary
Kurnool dist Panyam sitting YCP Mla Gowru Charitha may leave YCP and join in TDP. Leaders from the TDP in touch with Charitha invited her into party and offered Panyam assembly seat. After Jagan return from Londan Final decision will be take.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X